Dark Circles: ముఖం అందంగా, కాంతివంతంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ కొన్ని రకాల చర్మ సమస్యలు మన అందాన్ని పాడు చేస్తాయి. అందులో డార్క్ సర్కిల్స్ కూడా ఒకటి. చాలా మందిని వేధించే ఒక సాధారణ సమస్య డార్క్ సర్కిల్స్. దీనికి సరిగ్గా నిద్ర లేకపోవడం, ఒత్తిడి, వయస్సు పెరగడం లేదా జన్యుపరమైన అంశాలు వంటి అనేక కారణాలు కూడా ఉంటాయి. ఇదిలా ఉంటే.. ఈ సమస్య నుంచి బయటపడటానికి కొన్ని స్కిన్ కేర్ టిప్స్‌తో పాటు లైఫ్ స్టైల్ మార్పులు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మార్పులతో డార్క్ సర్కిల్స్‌కు చెక్ :
1. తగినంత నిద్ర:
డార్క్ సర్కిల్స్‌కు అతి ముఖ్యమైన కారణాలలో ఒకటి నిద్ర లేమి. ప్రతి రోజు రాత్రి కనీసం 7-9 గంటలు నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోండి. మంచి నిద్ర రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా అలసట కారణంగా ఏర్పడే నలుపును తగ్గిస్తుంది.
2.కోల్డ్ కంప్రెస్:
చల్లటి వాటిని ఉపయోగించడం రక్త నాళాలను సంకోచించి, వాపు, అంతే కాకుండా నలుపును తగ్గిస్తుంది. మీరు చల్లటి నీటిలో ముంచిన క్లాత్, ఫ్రిజ్‌లో పెట్టిన స్పూన్లు, లేదా క్లాత్‌లో చుట్టిన ఐస్ ప్యాక్‌ను 10-15 నిమిషాలు కళ్లపై ఉంచుకోవచ్చు.
3. దోసకాయ ముక్కలు:
దోసకాయలో ఉండే నీరు, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని చల్లబరచడానికి అంతే కాకుండా తేమను అందించడానికి .. వాపును తగ్గించడానికి సహాయ పడతాయి. చల్లటి దోసకాయ ముక్కలను 10 నిమిషాలు కళ్లపై పెట్టుకోండి.
4. టీ బ్యాగ్‌లు:
గ్రీన్ లేదా బ్లాక్ టీ బ్యాగ్‌లలో ఉండే కెఫిన్, యాంటీఆక్సిడెంట్లు రక్త ప్రసరణను మెరుగుపరిచి, నలుపును తగ్గిస్తాయి. ఉపయోగించిన టీ బ్యాగ్‌లను చల్లబరిచి, 10-15 నిమిషాలు కళ్లపై ఉంచుకోండి.
5. విటమిన్ ఇ తో బాదం నూనె:
బాదం నూనెలో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. ఇది సున్నితమైన కంటి చర్మాన్ని పోషిస్తుంది. నిద్రపోయే ముందు కొద్దిగా బాదం నూనెను తీసుకుని.. దానిలో విటమిన్ E క్యాప్సూల్ ఆయిల్ కలిపి మృదువుగా మసాజ్ చేయండి.
6. బంగాళదుంప రసం:
బంగాళదుంపలో సహజమైన బ్లీచింగ్ గుణాలు ఉన్నాయి. తురిమిన బంగాళదుంప రసాన్ని దూది సాయంతో నల్లటి వలయాలపై 10 నిమిషాలు ఉంచి.. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి.
7. రోజ్ వాటర్ :
రోజ్ వాటర్ కళ్లకు విశ్రాంతినిచ్చి, చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. దూదిని రోజ్ వాటర్‌లో ముంచి.. 10 నిమిషాలు కళ్లపై ఉంచడం వల్ల నలుపు తగ్గుతుంది.
Also Read: ఆవ నూనెతో అద్భుతం.. ఇలా వాడితే తల మోయలేనంత జుట్టు
8. హైడ్రేషన్ :
శరీరానికి తగినంత నీరు అందిస్తే.. చర్మం కాంతివంతంగా ఉంటుంది. అంతే కాకుండా డార్క్ సర్కిల్స్ ఏర్పడే అవకాశం తగ్గుతుంది.అందుకే రోజుకు 8-10 గ్లాసుల నీరు తప్పక తాగండి.
9. సన్ ప్రొటెక్షన్ :
ఎండ వల్ల చర్మంపై మెలనిన్ ఉత్పత్తి పెరిగి నలుపు పెరుగుతుంది. కంటి కింద ప్రాంతంలో కూడా SPF ఉన్న సన్‌స్క్రీన్ తప్పక ఉపయోగించండి మరియు బయటకు వెళ్లినప్పుడు సన్ గ్లాసెస్ వాడండి.
10. సమతుల్య ఆహారం:
ఐరన్, విటమిన్ సి, విటమిన్ కె వంటి పోషకాలు అధికంగా ఉండే ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, నట్స్ వంటి సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగు పడుతుంది.