వేరే మహిళతో భర్తను బెడ్‌పై రెడ్ హ్యాండెడ్‌గా భార్య పట్టుకున్న.. సంఘటన హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దల సమక్షంలో శివ, దీప్తికి వివాహం జరిగింది. వీరికి మూడేళ్లపాప కూడా ఉంది. శివ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. చాలా సంతోషంగా జీవితం గడుపుతున్న సమయంలో.. భర్తకు సుష్మ అనే మహిళతో పరిచయమైంది. ఇద్దరు పరిచయం అక్రమ సంబంధానికి దారితీయడంతో ఎక్కువగా ఆమెతోనే గడుపుతున్నాడు.
అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ కూకట్ పల్లిలో భర్త వివాహేతర సంబంధాన్ని బట్టబయలు చేసింది భార్య. సానవపల శివాజీరావు అనే వ్యక్తికి దీప్తి అనే మహిళతో 2019లో వివాహమైంది. శివాజీ టెక్టోరో కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. డెలివరీకి అని భార్య పుట్టింటికి వెళ్లడంతో.. భర్త శివాజీ తన క్లాస్‌మేట్ అయిన సుష్మా అనే మరో మహిళతో తన ఇంట్లోనే నివాసం ఉంటున్నాడు.
Also Read: అత్తింటి వేధింపులు తట్టుకోలేక.. పిల్లల్ని కత్తితో పొడిచి తల్లి ఉరేసుకొని..
ఇది గమనించిన భార్య భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని నిర్ణయం తీసుకుంది. భర్త తన ప్రియురాలితో కలిసి కూకట్ పల్లి లోని ఓ అపార్ట్మెంట్ లో ఉంటున్న విషయం తెలుసుకుని.. వెంటనే బంధువులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. ఇద్దర రూమ్‌లో బెడ్‌పై ఉండగా భార్య, బంధువులు వారిని పట్టుకున్నారు. ఇద్దరిపై దాడి చేసి పోలీసులకు పట్టించారు.
రెండు సంవత్సరాల నుంచి తన భర్త సుష్మాతో కలిసి ఉంటున్నాడని.. ఇవాళ ఇంటికి వచ్చి చూసేసరికి వారిద్దరని.. అలా చూసి తట్టుకోలేక పోయానని భార్యదీప్తి ఆవేదన వ్యక్తం చేసింది. జరిగిందేదో జరిగింది.. కొత్త లైఫ్ మొదలుపెడుదామన్న తన భర్త సహకరించడం లేదని దీప్తి తెలిపంది. . ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.