E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

హోటల్ కెటిల్స్ వెనుక దాగివున్న భయంకరమైన సీక్రెట్.. తెలిస్తే జన్మలో ముట్టుకోరు!

హోటల్ కెటిల్స్ వెనుక దాగివున్న భయంకరమైన సీక్రెట్.. తెలిస్తే జన్మలో ముట్టుకోరు!
Advertisement

Hotel Kettles: మనకు ఏదైనా ఊరు వెళ్లినప్పుడు లేదా ఫ్యామిలీతో టూర్‌ ప్లాన్ చేసినప్పుడు లగ్జరీ హోటల్స్‌లో బస చేయడం అలవాటు. రూమ్‌లోకి వెళ్లగానే అక్కడ కనిపించే కింగ్ సైజ్ బెడ్స్, ఏసీలతో పాటు వేడి నీళ్ల కోసం లేదా కాఫీ, టీ తయారు చేసుకోవడానికి అందుబాటులో ఉండే ఎలక్ట్రిక్ కెటిల్ మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఉదయాన్నే లేవగానే బెడ్ కాఫీ తాగే అలవాటు ఉన్నవారు రూమ్‌లో ఉన్న కెటిల్‌ను చూసి తెగ మురిసిపోతుంటారు. అయితే, పైకి ఎంతో మెరుస్తూ, నీట్‌గా కనిపించే ఈ కెటిల్స్ వెనుక కొన్ని భయానక నిజాలు, అలాగే కొన్ని అపోహలు దాగి ఉన్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో దీనిపై జరుగుతున్న చర్చ నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. ఇంతకీ హోటల్ కెటిల్స్ వాడటం సేఫా? కాదా?

ఎంత అసహ్యంగా ఉన్నా ఇది నిజం.

హోటల్ కెటిల్స్ వాడకూడదనడానికి  వినిపిస్తున్న అతిపెద్ద కారణం .. కొందరు ప్రయాణికుల విచిత్ర ప్రవర్తన. .. కొంతమంది రూమ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ కెటిల్స్‌ను కేవలం నీళ్ల కోసమే కాకుండా, తమ అంతర్గత దుస్తులు (Undergarments), సాక్స్ వంటి వాటిని త్వరగా ఉతకడానికి, వాటిలోని క్రిములను చంపడానికి అందులో వేసి మరిగిస్తున్నారట! వినడానికి ఇది ఎంత అసహ్యంగా ఉన్నా ఇది నిజం.

Advertisement

Also read :యూరప్ టూర్‌కు రాజమౌళి సిద్ధం.. ‘RRR’ నుంచి ‘ఈగ’ వరకు స్పెషల్ స్క్రీనింగ్స్.. పూర్తి షెడ్యూల్ ఇదే!

మరికొందరు కెటిల్‌ను ఉపయోగించిన తర్వాత అందులో మిగిలిపోయిన నీటిని అలాగే వదిలేస్తుంటారు. రోజుల తరబడి నీరు అలాగే నిల్వ ఉండటం వల్ల కెటిల్ అడుగు భాగంలో ‘బయోఫిల్మ్’ (Biofilm) అనే ఒక రకమైన జిగట బ్యాక్టీరియా పొర, ఫంగస్ ఏర్పడతాయి. హోటల్ రూమ్స్ క్లీన్ చేసే సిబ్బందికి సమయం తక్కువగా ఉండటం వల్ల వారు బెడ్ షీట్లు, బాత్‌రూమ్‌లపై శ్రద్ధ పెడతారే కానీ, కెటిల్‌ను ప్రత్యేక డిటర్జెంట్లతో లోపలి వరకు క్లీన్ చేయరు. కేవలం పైపైన తుడిచి పెట్టేస్తారు. దీనివల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందనేది నిపుణుల హెచ్చరిక.

అలా ప్రవర్తిస్తారని అనుకోవడం పొరపాటే

Advertisement

కానీ, నాణేనికి రెండో వైపు చూస్తే.. ప్రయాణికులందరూ అలా ప్రవర్తిస్తారని అనుకోవడం పొరపాటే. నూటికి 90 శాతం మంది హోటల్ నియమాలను గౌరవిస్తారు. పైగా, సైన్స్ ప్రకారం నీటిని 100°C ఉష్ణోగ్రత వద్ద మరిగించినప్పుడు అందులో ఉండే దాదాపు అన్ని రకాల హానికర బ్యాక్టీరియాలు, వైరస్‌లు నశించిపోతాయి. అంతేకాకుండా, త్రీ-స్టార్, ఫైవ్-స్టార్ వంటి ప్రతిష్టాత్మక హోటళ్లలో హైజీన్ ప్రోటోకాల్స్ చాలా కఠినంగా ఉంటాయి. వారు ప్రతి గెస్ట్ వెళ్లిన తర్వాత కెటిల్స్‌ను ప్రాపర్ కెమికల్స్‌తో డీ-స్కేలింగ్ మరియు శానిటైజ్ చేస్తారు. కాబట్టి అన్ని హోటళ్లలోనూ ఇలాంటి పరిస్థితి ఉంటుందని భయపడాల్సిన అవసరం లేదు.

మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే.. కొన్ని చిన్న జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. మీకు వేడి నీరు లేదా టీ కావాలంటే రూమ్ సర్వీస్‌ను అడిగి నేరుగా కిచెన్ నుండి తెప్పించుకోవడం అన్నిటికంటే సురక్షితం. ఒకవేళ రూమ్ లోని కెటిల్ తప్పనిసరిగా వాడాల్సి వస్తే, ఉపయోగించే ముందు అందులో నీళ్లు పోసి కనీసం రెండు మూడు సార్లు బాగా మరిగించి ఆ నీటిని పారబోయాలి, ఆ తర్వాతే వాడుకోవాలి.

అన్నిటికంటే బెస్ట్ ఐడియా

వీలైతే ప్రయాణాల్లో మీతో పాటు ఒక చిన్న సైజు పర్సనల్ ట్రావెల్ ఎలక్ట్రిక్ కెటిల్‌ను క్యారీ చేయడం అన్నిటికంటే బెస్ట్ ఐడియా. పైకి ఎంతో క్లాసిక్‌గా, క్లీన్‌గా కనిపించే వస్తువుల వెనుక కూడా ఇటువంటి ఆరోగ్య ముప్పులు దాగి ఉండే అవకాశం ఉంది కాబట్టి, అతిగా భయపడి టూర్‌ను పాడుచేసుకోకుండా.. కాస్త అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటిస్తే మీ ప్రయాణం సుఖమయం, సురక్షితం అవుతుంది!

Related News

గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ.. ఏది తాగితే బరువు త్వరగా తగ్గుతారు?

ఏ బట్టలు వేసుకున్న పొట్ట బయటకు కనిపిస్తోందా? స్లిమ్‌గా, స్టైలిష్‌ లుక్ కసం ఫ్యాషన్ టిప్స్

మీ లవర్ మిమల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడా? రిలేషన్‌లో మీ ఆత్మగౌరవం ఇలా కాపాడుకోండి

రోజంతా పనిచేసి ముఖంలో అలసట, నల్లదనం కనిపిస్తోందా? ఈ ఫేస్‌ఫ్యాక్‌తో తక్షణ గ్లో

మీరు తాగుతున్న పాలలో డిటర్జెంట్ ఉందా? కల్తీ పాలను ఇలా చెక్ చేయండి

కేవలం ప్రత్యేకమైనవారికే మనసిస్తారు.. మూల అంకం 9కి పర్ఫెక్ట్ సౌల్ మేట్ ఎవరంటే

భార్యభర్తల మధ్య వయసు తేడా ఎక్కువగా ఉంటే సమస్యలు వస్తాయా? సరైన ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి?

Big Stories

×