E-Paper
Advertisement

కిచెన్‌లో తక్కువ ధర కత్తులు వాడుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలకు కారణం అదే

కిచెన్‌లో తక్కువ ధర కత్తులు వాడుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలకు కారణం అదే
Advertisement

వంటగదిలో ఉపయోగించే కత్తులు మంచి క్వాలిటీ చాలా ముఖ్యం. చాలామంది డబ్బు ఆదా చేయాలనే ఉద్దేశంతో తక్కువ ధరలో దొరికే కత్తులను కొనుగోలు చేస్తారు. మొదట్లో అవి బాగానే పనిచేసినా, కొంతకాలానికి తుప్పు పట్టడం, మొద్దుబారడం లేదా విరిగిపోవడం జరుగుతుంది. ఇలాంటి కత్తులు ఆరోగ్యానికి, భద్రతకు ప్రమాదంగా మారే అవకాశం ఉంది.

ఫుడ్ గ్రేడ్ కత్తులే ఉపయోగించాలి

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కొత్త మార్గదర్శకాల ప్రకారం.. రెస్టారెంట్లు, హోటళ్లు, కమర్షియల్ కిచెన్లలో ఫుడ్ గ్రేడ్ కత్తులు, వంట పరికరాలనే ఉపయోగించాలి. తుప్పు పట్టినవి, పగిలినవి లేదా దెబ్బతిన్న కత్తులను వెంటనే మార్చాలి. ఈ నియమాలు హోటల్స్, వాణిజ్య కిచెన్స్‌కు మాత్రమే కాకుండా ఇళ్లలో కూడా పాటించడం మంచిది.

చౌక కత్తులు త్వరగా పాడవుతాయి

Advertisement

తక్కువ ధరలో లభించే చాలా కత్తులు నాణ్యతలేని ఇనుముతో తయారవుతాయి. ఇవి త్వరగా తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. అలాగే వాటి పదును తగ్గిపోతుంది. కొందరు అవి పాడైనా అలాగే ఉపయోగిస్తుంటారు. అలాంటి కత్తులతో ఆహారం తయారు చేయడం సురక్షితం కాదు.

చేతులకు గాయాలు అయ్యే ప్రమాదం ఎక్కువ

పదును తగ్గిన కత్తితో కూరగాయలు లేదా పండ్లు కోయాలంటే ఎక్కువ బలం అవసరం అవుతుంది. దీంతో కత్తి జారి చేతికి గాయం అయ్యే ప్రమాదం ఉంటుంది. మరోవైపు ఎక్కువ పదునున్న నాణ్యతలేని కత్తులు లోతుగా కట్ చేస్తాయి. చిన్న గాయాలు కూడా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇన్‌ఫెక్షన్‌కు దారితీయవచ్చు.

తుప్పు వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది

Advertisement

తుప్పు పట్టిన కత్తులపై చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడతాయి. వాటిలో తేమ, ఆహారపు ముక్కలు చిక్కుకుపోతాయి. వాటిని పూర్తిగా శుభ్రం చేయడం కష్టం. దీంతో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఆహారంలోకి చేరవచ్చు

తుప్పు పట్టిన కత్తులపై ఈ కోల్లి, సాల్మొనెల్లా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటి కత్తులతో పండ్లు, కూరగాయలు కోస్తే బ్యాక్టీరియా ఆహారంలోకి చేరుతుంది. ఆ ఆహారం తింటే ఫుడ్ పాయిజనింగ్, వాంతులు, విరేచనాలు, కడుపు ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ ప్రమాదం మరింత ఎక్కువ.

మంచి క్వాలిటీ కలిగిన కత్తినే ఎంచుకోండి

ఫుడ్ గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారైన కత్తులు తుప్పు పట్టవు. అవి ఎక్కువకాలం మన్నుతాయి. శుభ్రం చేయడం కూడా సులభం. ప్రతిసారీ ఉపయోగించిన తర్వాత కత్తిని సబ్బుతో కడిగి పూర్తిగా ఆరబెట్టాలి. తుప్పు పట్టిన లేదా విరిగిన కత్తులను వెంటనే మార్చేయాలి.

Also Read: మీరు రోజూ ఉపయోగించే ఈ మేకప్‌ ఆరోగ్యానికి చాలా హానికరం.. క్యాన్సర్ వచ్చే అవకాశం

తక్కువ ధర కోసం చూసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదం

కొన్ని రూపాయలు ఆదా చేయడానికి చౌక కత్తులు కొనడం సరైన నిర్ణయం కాదు. మంచి నాణ్యత కలిగిన కత్తి మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే వంటను మరింత సురక్షితంగా, సులభంగా చేస్తుంది.

Also Read: మీ పిల్లలు ఆరోగ్యంగా పెరిగేందుకు ఈ మంచి అలవాట్లు నేర్పించండి..

Related News

ఫ్రెండ్స్ వేలల్లో.. మనసు మాత్రం ఒంటరిగా!

సూపర్ ఫ్రెండ్.. ఈ తేదీల్లో పుట్టినవారు అందరితో త్వరగా స్నేహం చేస్తారు

మీ మాజీ లవర్ వద్దకు మళ్లీ వెళ్లాలనుకుంటున్నారా? ముందుగా ఈ 8 విషయాలు ఆలోచించండి

చాణక్య నీతి.. పిల్లలు చేసే ఈ తప్పులను తల్లిదండ్రులు అసలు నిర్లక్ష్యం చేయకూడదు

సైనా నెహ్వాల్‌కు ఆర్థరైటిస్.. క్రీడాకారులందరికీ ఈ వ్యాధి ప్రమాదం ఉందా?

ఆన్‌లైన్‌లో ఫ్రీగా చదువుకోవచ్చు.. మరి స్కూల్, కాలేజీ ఫీజులు ఎందుకు పెరుగుతున్నాయి?

పెళ్లయ్యాక డబ్బు విషయంలో గొడవలు రాకుండా ఉండాలంటే…

విషపూరిత పూలతో పవర్‌ఫుల్ ఔషధాలు తయారీ.. మలేరియా, క్యాన్సర్‌కు చికిత్స

Big Stories

Advertisement
×