BigTV English

Love Propose: అమ్మాయిల కంటే ముందు అబ్బాయిలే ప్రేమ ప్రపోజ్ చేస్తారు, ఎందుకు?

Love Propose: అమ్మాయిల కంటే ముందు అబ్బాయిలే ప్రేమ ప్రపోజ్ చేస్తారు, ఎందుకు?

అమ్మాయిల్లో ప్రేమ ఉన్న కూడా వారు బయటపడరు. అబ్బాయిలే మొదట తమ ప్రేమను ప్రపోజ్ చేస్తారు. అమ్మాయి కూడా అబ్బాయి ప్రపోజ్ చేసే వరకు వెయిట్ చేస్తూ ఉంటుంది. మీకు ఎప్పుడైనా అనిపించిందా? అబ్బాయిలే మొదట ఎందుకు ప్రపోజ్ చేస్తారు అని? ప్రపంచంలో నూటిలో 90 శాతం ప్రేమ పెళ్లిళ్లలో మొదట అబ్బాయి ప్రపోజ్ చేసిన సంఘటనలే ఉంటాయి. అరుదుగా అమ్మాయిలు కూడా ప్రపోజ్ చేస్తూ ఉంటారు. కానీ అలా చేసిన సంఘటనలు వేళ్ళ మీదే లెక్క పెట్టవచ్చు. ఆధునిక యుగంలోనే అమ్మాయిలు తమ ప్రేమను ముందుగా వ్యక్తం చేయడం ప్రారంభించారు. అంతకముందు మాత్రం పూర్తిగా అబ్బాయిలే మొదట ప్రేమను ప్రపోజ్ చేసేవారు. ఇప్పటికీ ఎక్కువ శాతం అదే జరుగుతుంది. అమ్మాయిలు తన ప్రేమను ముందుగా చెప్పకూడదనుకోవడానికి కొన్ని ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయని మానసిక శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు.


నో అంటే
కొందరు అమ్మాయిలు నో అనే పదాన్ని తీసుకోలేరు. అంటే తమ ప్రేమను తిరస్కరిస్తే అది భరించలేరు. తిరస్కరణ భయంతోనే తమ ప్రేమను లోపలే దాచుకుంటారు. ప్రేమలో తిరస్కరణకు గురైన అమ్మాయిలు కరెంట్ షాక్ కొట్టినంత బాధ పడిపోతారు. అలాగే ఆ బాధ నుంచి బయటపడేందుకు వారికి చాలా సమయం పడుతుంది. మానసికంగా కుంగిపోతారు. అబ్బాయిలు నో చెబితే అమ్మాయిలు తన ఆత్మ గౌరవం తగ్గిపోయినట్టు భావిస్తారు. అందుకే ప్రేమను ప్రపోజ్ చేయకుండా వెయిట్ చేస్తూ ఉంటారు.

గౌరవం తగ్గుతుందని
అమ్మాయిలు తామే ముందుగా అబ్బాయికి ప్రపోజ్ చేస్తే తమ గౌరవం తగ్గిపోయినట్టు ఫీలవుతారు. అలాగే తమను చులకనగా చూస్తారన్న భయం కూడా వారిని వెంటాడుతుంది. ఆ విషయం పదిమందికి తెలిసి తమకు దక్కాల్సిన గౌరవం సమాజంలో దక్కదని వారు సంకోచిస్తారు. అందుకే ప్రేమ ఉన్నా కూడా లోపలే దాచుకుంటారు. కానీ బయటపడరు.


ఆ కిక్కే వేరు
అమ్మాయిలు… అబ్బాయిలు ప్రపోజ్ చేస్తే వచ్చే ఆ కిక్ ను ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. ఈ కారణంగానే అమ్మాయిలు ఏ అబ్బాయికి ముందుగా ప్రపోజ్ చేయడానికి ఇష్టపడరు. ఆ ప్రత్యేక అనుభూతిని తాము ఫీల్ అవ్వాలని కోరుకుంటారు. తమకే ప్రాధాన్యత ఇవ్వాలని అందుకే వారే ముందుగా ప్రపోజ్ చేయాలని వెయిట్ చేస్తూ ఉంటారు.

గోల్డ్ టాగ్
అమ్మాయే ముందుగా నచ్చిన అబ్బాయికి ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి చాలా బోల్డ్ అని మాటలు వినిపిస్తాయి. తనకు బోల్డ్ అనే ట్యాగ్ రావడం కొందరు అమ్మాయిలకు నచ్చదు. తమను చులకనగా చూస్తారని, తాము సులువుగా ఎవరికైనా పడిపోతామని ఎదుటివారు భావిస్తారనే భయం వారిలో ఉంటుంది. అందుకే ఏ అమ్మాయి ఇలాంటి ఆలోచనలను సహించలేదు. ఇలాంటి అమ్మాయిలు తమ ప్రేమను చిన్నచిన్న హింట్స్ ద్వారా వ్యక్త పరుస్తారు. కానీ ఎక్కడా ఓపెన్ కారు.

సమాజంలో భయం
ఇప్పటికీ సమాజం అబ్బాయిలను, అమ్మాయిలను వేరువేరుగానే చూస్తుంది. అబ్బాయిలు తమకు నచ్చిన విషయాన్ని అమ్మాయిలతో ఓపెన్ గా చెప్పగలరు. ఒక అబ్బాయి తన ప్రేమను పొందడానికి ఏ పనులు చేసిన రొమాంటిక్ గా ప్రవర్తించినా కూడా అబ్బాయిని సమాజం గొప్పగానే చూస్తుంది. అదే అమ్మాయి అబ్బాయి ప్రేమ కోసం కాస్త రొమాంటిక్ గా ప్రవర్తిస్తే చాలు, ఆమెను చులకనగా చూడడం మొదలుపెడుతుంది. క్యారెక్టర్‌లెస్ అనే ముద్రను వేస్తుంది. ఇవన్నీ ఆలోచించి అమ్మాయిలు తమ ప్రేమను లోపలే దాచుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో బయటపడనివ్వరు.

Related News

Navratri Fasting: నవరాత్రి ఉపవాస సమయంలో.. ఈ ఫుడ్ తింటే ఫుల్ ఎనర్జీ !

Fast Eating: టైం లేదని వేగంగా తింటున్నారా ? ఎంత ప్రమాదమో తెలిస్తే ఈ రోజే మానేస్తారు !

Dates Benefits: డైలీ రెండు ఖర్జూరాలు తింటే ? బోలెడు లాభాలు !

Alcohol: 30 రోజులు ఆల్కహాల్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ?

Masala Vada: మాసాలా వడ బయట తిన్నట్లే క్రిస్పీగా రావాలంటే.. ఇలా ట్రై చేయండి

Brain Health:ఈ టిప్స్ పాటిస్తే చాలు.. బ్రెయిన్ షార్ప్‌గా పనిచేస్తుంది

High Cholesterol: గుండె జబ్బులు రాకూడదంటే ? నిపుణుల సూచనలివే !

Warning Signs of Stroke: బ్రెయిన్ స్ట్రోక్.. ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి ?

Big Stories

×