Bobby Deol : సందీప్ రెడ్డి వంగ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు సందీప్ రెడ్డి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఒక మామూలు కథని తనదైన శైలిలో చూపించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ సినిమాతోనే విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇదే కథను సాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ అనే పేరుతో హిందీలో తెరకెక్కించాడు సందీప్ రెడ్డి. కబీర్ సింగ్ సినిమా రిలీజ్ అయినప్పుడు చాలామంది హిందీ రివ్యూ రైటర్స్ ఈ సినిమాని ఒక వైలెంట్ ఫిలిం అంటూ కామెంట్ చేశారు. అయితే ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ ఐ విల్ సో వాట్ వైలెంట్ ఫిలిం ఇట్ ఇస్ అంటూ అప్పట్లో కామెంట్ చేశాడు. ఆ కామెంట్స్ వైరల్ గా మారాయి.
సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన రెండవ సినిమా అనిమల్. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సంచలమైన విజయాన్ని నమోదు చేసుకుంది. దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమాలో విలన్ రోల్ లో కనిపించాడు బాబి డియోల్. ఈ సినిమాతో బాబీ డియోల్ విపరీతమైన పేరు వచ్చింది. ఇక బాబి డియోల్ పాత్ర వెనుక ఎవరికీ తెలియని ఒక కథ ఉంది. ఒకప్పుడు మంచి స్టార్డం సంపాదించుకున్న బాబి డియోల్ కు అవకాశాలు తగ్గడం మొదలయ్యాయి. ఆ తరుణంలో కొన్నేళ్లపాటు ఇంట్లో ఖాళీగా కూర్చున్న వాడు బాబి. ఒక సందర్భంలో వాళ్ల పిల్లలు కూడా నాన్నని ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చుంటున్నారు ఏంటి అని అడిగిన రోజులు కూడా ఉన్నాయి. అయితే వీటన్నిటిని దర్శకుడు బాబి తో షేర్ చేసుకున్నాడు బాబి డియోల్. సందీప్ రెడ్డి వంగ పేరు చెప్తే బాబి డియోల్ చాలా ఎమోషనల్ అయిపోతాడు అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు దర్శకుడు బాబి.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత మంచి పేరు సాధించుకున్న నటుడు జగపతిబాబు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ సినిమాతో విలన్ గా మరో రూట్ ఎంచుకున్నాడు జగపతిబాబు. ఆ తర్వాత జగపతిబాబుకి వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలానే బాబి డియోల్ కి కూడా సందీప్ రెడ్డి వంగ అవకాశం ఇవ్వడంతో ప్రస్తుతం వరుసగా అవకాశాలు వస్తున్నాయి. అయితే అన్ని సబ్జెక్టులకు ఓకే చెప్పకుండా కొన్ని సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరియర్లో ముందుకు వెళ్తున్నాడు బాబి డియోల్ అని చెప్పుకొచ్చాడు దర్శకుడు బాబి. బాబీ దర్శకత్వం వహిస్తున్న డాకు మహారాజు సినిమాలో బాబి డియోల్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.
Also Read : Jani master: జానీ మాస్టర్ కి షాక్.. ఆరోపణలు నిజమే అంటూ తేల్చిన పోలీసులు..!