E-Paper
Advertisement

రాగి బాటిల్ vs స్టీల్ బాటిల్.. రోజూవారీ వాడకానికి ఏది బెస్ట్? దేనివల్ల ఎక్కువ బెనిఫిట్స్?

రాగి బాటిల్ vs స్టీల్ బాటిల్.. రోజూవారీ వాడకానికి ఏది బెస్ట్? దేనివల్ల ఎక్కువ బెనిఫిట్స్?
Advertisement

Copper vs Steel Water Bottle: ప్రయాణాలు, ఆఫీసులు, పర్యటనల సందర్భాల్లో చాలా మంది తమ వెంట వాటర్ బాటిళ్లను తీసుకెళ్తుంటారు. ప్లాస్టిక్ బాటిల్స్ లో పదే పదే నీళ్లు పట్టుకొని తాగడం మంచిది కాదన్న ఉద్దేశంతో స్టీల్, కాపర్ (రాగి) బాటిళ్లు కొనుగోలు చేస్తుంటారు. అయితే స్టీల్, రాగి బాటిల్స్ లో రోజూవారి వాడకానికి ఏది మంచిదన్న డౌట్ సహజంగానే చాలా మందిలో ఉంది. కాబట్టి ఈ కథనంలో దానిపై ఒక క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం.

అసలు రాగి బాటిల్ ప్రత్యేకత ఏంటి?

తాత ముత్తాతల కాలం నుంచి ఇళ్లల్లో నీటిని నిల్వ చేయడానికి రాగి బిందెలను ఉపయోగించడం పరిపాటిగా వస్తోంది. అయితే దీని వెనుక శాస్త్రీయ కారణం ఉంది. ‘జర్నల్ ఆఫ్ హెల్త్, పాపులేషన్ అండ్ న్యూట్రిషన్’ అధ్యయనం ప్రకారం.. కలుషిత నీటిని 16 గంటల పాటు రాగి పాత్రలో ఉంచితే ఈ కోలి, సాల్మొనెల్లా, విబ్రియో కలరా వంటి హానికర బ్యాక్టీరియాలు పూర్తిగా నశిస్తాయని తేలింది. కాబట్టి పూర్వం నుంచి రాగి బిందెలను వినియోగించడం అలవాటుగా మారింది. అయితే ఇప్పుడు మారిన కాలానికి అనుగుణంగా వినియోగదారుల సౌలభ్యం కోసం కాపర్ బాటిల్స్ అందుబాటులోకి రావడం గమనార్హం.

నీటిపై రాగి ప్రభావం ఎలా పనిచేస్తుందంటే?

Advertisement

రాగి బిందె లేదా బాటిళ్లలో నీరు పోసినప్పటి నుంచే దానిపై కాపర్ ప్రభావం నెమ్మదిగా ప్రారంభమవుతుందని నిపుణులు చెబుతున్నారు. నిల్వ చేసిన నీటిలో రాగి అయాన్లు కలిసి బ్యాక్టీరియాను నాశనం చేస్తాయని స్పష్టం చేస్తున్నారు. దీనిని ‘ఒలిగోడైనమిక్ ఎఫెక్ట్’ అంటారని తెలియజేస్తున్నారు. కాబట్టి ఆ నీరు తాగడానికి ఎంతో సురక్షితమని వివరిస్తున్నారు. అయితే ఈ యాంటీమైక్రోబియల్ బెనిఫిట్స్ పొందాలంటే రాగి బాటిల్ లో నీటిని కనీసం 6 నుంచి 8 గంటల పాటు నిల్వ ఉంచాలని సూచిస్తున్నారు.

మరి స్టీల్ బాటిల్స్ సంగతేంటి?

స్టీల్ బాటిళ్లు నీటితో ఎలాంటి చర్య జరపదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. యూఎస్ ఎఫ్‌డీఏ పరిశోధనల ప్రకారం.. స్టీల్ బాటిల్ లో నీరు పోసిన వెంటనే తాగొచ్చు. రాగి బాటిళ్ల తరహాలో దానిని 6-8 గంటల పాటు నిల్వ ఉంచాలన్న నియమం ఏది లేదని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే స్టీల్ బాటిల్ లో సురక్షితమైన నీటిని మాత్రమే పట్టుకొని తాగాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే మలినమైన నీటిని శుభ్రం చేసే శక్తి దీనికి లేదని వివరిస్తున్నారు.

వాడకంలో పెద్ద తేడా ఉందండోయ్!

Advertisement

అయితే రాగి, స్టీల్ బాటిళ్ల నిర్వహణ పరంగా కూడా కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. రాగి బాటిళ్లను రోజూ శుభ్రం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. శుభ్రం చేయడమే కాకుండా దానిని పూర్తి స్థాయిలో ఆరబెట్టాలని హితవు పలుకుతున్నారు. అంతేకాకుండా నిమ్మరసం, మజ్జిగ వంటి ఆమ్ల గుణాలు ఉన్న పానీయాలను ఎట్టి పరిస్థితుల్లో రాగి బాటిల్స్ లో పోయకూడదని సూచిస్తున్నారు. ఎందుకంటే రాగి ఆ ఆమ్లాలతో చర్య జరిపి పరిమితికి మించి అయాన్లు విడుదల చేసే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు స్టీల్ బాటిళ్ల విషయంలో అలాంటి ఇబ్బందులు ఏమీ లేదని.. ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చని వివరిస్తున్నారు.

Also Read: జియో బంపరాఫర్.. ‘హ్యాపీ న్యూ ఇయర్ 2.0’ పేరుతో కొత్త ప్లాన్లు లాంచ్.. రూ. 15కే అపరిమిత 5G!

ఫైనల్గా రెండింట్లో ఏది బెటర్?

ఈజీ మెయిన్ టెనెన్స్, అన్ని పానియాలకు అనుకూలంగా ఉండే బాటిల్ కోరుకుంటే హ్యాపీగా స్టీల్ ది కొనుగోలు చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో నీరు పట్టుకొని వెంట వెంటనే తాగేందుకు వీలుంటుందని చెబుతున్నారు. అలాకాకుండా రాత్రంతా నీటిని నిల్వ చేసే శాస్త్రీయ పద్ధతిని పాటిస్తూ, దాని నిర్వహణ కూడా పెద్ద కష్టం కాదని భావించే వారు రాగి బాటిల్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుందని సూచిస్తున్నారు.

Also Read: ‘నువ్వు అసలు ఏ పార్టీ ఎమ్మెల్యేవి?’ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను నిలదీసిన జనసేన కార్యకర్తలు!

Tags

Related News

ఆవిరిపై ఉడికే కమ్మని గుజరాతీ ఖమన్ ధోక్లా.. చుక్క నూనె లేకుండా ఇలా చేసేయండి!

ప్రేమ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం.. ఈ తేదీల్లో పుట్టినవారు భార్యని ప్రాణంగా ప్రేమిస్తారు

మహారాష్ట్ర స్పెషల్ ‘పిత్లా భాక్రీ’.. తక్కువ టైంలోనే అదిరిపోయే రుచి!

మార్కెట్‌కు వెళ్లాల్సిన పనిలేదు.. ఇంట్లోనే వెల్లుల్లి పంట.. ఒక్క రెబ్బ ఉంటే చాలు

కొత్త ఇంటికి ఎలాంటి ఫ్లోరింగ్ వేయించాలి? మీ ఇంటి అందాన్ని రెట్టింపు చేసే 5 ఫ్లోరింగ్ డిజైన్స్

చాణక్య నీతి.. జీవితంలో ఈ 5 సందర్భాల్లో భావోద్వేగాలకు లొంగకండి లేకుంటే భారీ నష్టమే

చలికాలంలో చర్మం పొడిబారుతోందా? ఇంట్లో తయారు చేసే ఈ బాడీ స్క్రబ్స్‌ ట్రై చేయండి

Big Stories

Advertisement
×