E-Paper
Advertisement

కొత్త ఇంటికి ఎలాంటి ఫ్లోరింగ్ వేయించాలి? మీ ఇంటి అందాన్ని రెట్టింపు చేసే 5 ఫ్లోరింగ్ డిజైన్స్

కొత్త ఇంటికి ఎలాంటి ఫ్లోరింగ్ వేయించాలి? మీ ఇంటి అందాన్ని రెట్టింపు చేసే 5 ఫ్లోరింగ్ డిజైన్స్
Advertisement

Modern floor designs for home| ఇల్లు అందంగా కనిపించాలంటే ఖరీదైన ఫర్నిచర్, ఆకర్షణీయమైన గోడల రంగులే అవసరం లేదు. ఇంటి ఫ్లోరింగ్ కూడా మొత్తం ఇంటి రూపురేఖలను మార్చగలదు. సరైన ఫ్లోరింగ్ డిజైన్ ఎంచుకుంటే సాధారణ ఇల్లు కూడా ఎంతో అందంగా, ఆధునికంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంటి గదులు, హాలు, వంటగది, బాల్కనీకి సరిపోయే ఫ్లోరింగ్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల ఫ్లోరింగ్ డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని ఇంటికి సంప్రదాయ రూపాన్ని ఇస్తే, మరికొన్ని ఆధునిక లుక్‌నిస్తాయి. తక్కువ ఖర్చుతో ఇంటిని అందంగా మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఐదు ఫ్లోరింగ్ డిజైన్ల గురించి తెలుసుకోండి.

గ్రానైట్ ఫ్లోరింగ్.. ఇంటికి అందంతో పాటు మన్నిక

గ్రానైట్ ఫ్లోరింగ్ ఇంటికి ప్రత్యేకమైన అందాన్ని తీసుకొస్తుంది. ఇది నలుపు, గోధుమ, బూడిద రంగులతో పాటు ఇతర షేడ్స్‌లో కూడా లభిస్తుంది. దీని సహజమైన మెరుపు ఇంటి హాలు, మెట్లు, ఎంట్రో డోర్స్‌లను ఆకర్షణీయంగా మారుస్తుంది. గ్రానైట్ ఎక్కువ కాలం మన్నికగా ఉండే ఫ్లోరింగ్ ఎంపికగా పరిగణిస్తారు. అయితే నీరు ఎక్కువగా పడే ప్రాంతాల్లో జారిపోకుండా ఉండే ఫినిషింగ్ ఎంచుకోవాలి.

టెర్రాజో, మొజాయిక్ ఫ్లోరింగ్.. ఇంటికి కలర్‌ఫుల్ లుక్

Advertisement

ఇంటికి ప్రత్యేకమైన రూపాన్ని ఇవ్వాలనుకునేవారికి టెర్రాజో, మొజాయిక్ ఫ్లోరింగ్ మంచి ఆప్షన్. వీటిలో వివిధ రంగులు, చిన్న చిన్న రాళ్లతో అందమైన డిజైన్లు రూపొందిస్తారు. మన అభిరుచికి అనుగుణంగా లేత రంగులు లేదా ఆకర్షణీయమైన కలర్ కాంబినేషన్లు ఎంచుకోవచ్చు. హాలు, బాల్కనీ, ఇతర విశాలమైన ప్రదేశాల్లో ఈ ఫ్లోరింగ్ అందంగా కనిపిస్తుంది. ఇవి ఇంటికి పాతకాలపు అందంతో పాటు ఆధునిక రూపాన్ని కూడా అందిస్తాయి.

సిరామిక్ టైల్స్.. తక్కువ బడ్జెట్‌లో మంచి ఆప్షన్

తక్కువ ఖర్చుతో ఇంటిని అందంగా మార్చుకోవాలనుకునేవారికి సిరామిక్ టైల్స్ ఉపయోగపడతాయి. వీటిలో ఎన్నో రంగులు, ఆకర్షణీయమైన డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. వంటగది, బాత్రూమ్, బెడ్‌రూమ్‌లలో వీటిని ఉపయోగించవచ్చు. అయితే నీరు పడే ప్రాంతాల్లో ఎక్కువగా జారిపోని టైల్స్ ఎంచుకోవాలి. మంచి గ్రిప్ ఉన్న టైల్స్ ఇంట్లో నడిచేటప్పుడు సౌకర్యాన్నిస్తాయి.

కోటా స్టోన్ ఫ్లోరింగ్‌తో ఇంటికి ట్రెడిష్నల్ లుక్

Advertisement

సింపుల్‌, సంప్రదాయ పద్ధతిలో ఇంటిని అలంకరించుకోవాలనుకునేవారికి కోటా స్టోన్ మంచి ఎంపిక. ఇది ఆకుపచ్చ, నీలం, గోధుమ రంగుల్లో లభిస్తుంది. ఇంటి వరండాలు, మెట్లు, కారిడార్లు, ఆవరణల్లో దీన్ని ఉపయోగించవచ్చు. దీని సహజమైన రూపం ఇంటికి ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. చెక్క ఫర్నిచర్, మొక్కలు, మట్టి కుండలతో కలిపి అలంకరిస్తే మరింత అందంగా కనిపిస్తుంది.

Also Read: ఇంటి గుమ్మం తెరవగానే అందమైన లుక్ కనిపించాలా? ఈ 7 డెకరేషన్ టిప్స్‌ ట్రై చేయండి

విట్రిఫైడ్ టైల్స్‌తో ఇంటికి మోడ్రన్ లుక్‌

ఆధునికంగా కనిపించే ఫ్లోరింగ్ కావాలనుకునేవారికి విట్రిఫైడ్ టైల్స్ మంచి ఆప్షన్. ఇవి వివిధ రంగులు, డిజైన్లు, ఫినిషింగ్‌లలో లభిస్తాయి. మార్బుల్, కలప, సహజ రాళ్లను పోలిన డిజైన్లను కూడా ఎంచుకోవచ్చు. వీటి ఉపరితలాన్ని శుభ్రం చేయడం కూడా సులభం. హాలు, బెడ్‌రూమ్‌లకు సరిపోయే డిజైన్లు ఎంచుకోవచ్చు. ఇంటి ఫర్నిచర్, గోడల కలర్స్‌కు అనుగుణంగా టైల్స్ ఎంపిక చేసుకోవాలి.

Also Read: మంచి పెర్ఫ్యూమ్‌ కొనాలని చూస్తున్నారా? మీ పర్సనాలటీకి ఏటి సూట్ అవుతుందో ఇలా తెలుసుకోండి

ఇంటికి సరైన ఫ్లోరింగ్‌ ఎలా ఎంచుకోవాలి?

ఫ్లోరింగ్ ఎంచుకునేటప్పుడు ఇంటి అందంతో పాటు రోజువారీ అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. గదిని బట్టి టైల్స్ ఎంపిక చేసుకోవడం మంచిది. వంటగది, బాత్రూమ్‌లకు మంచి గ్రిప్ ఉన్న ఫ్లోరింగ్ ఎంచుకోవాలి. హాలులో ఆకర్షణీయమైన డిజైన్లు ఉపయోగించాలి. అలాగే ఇంటి ఫర్నిచర్, గోడల కలర్స్, మీ బడ్జెట్‌ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.

Related News

చాణక్య నీతి.. జీవితంలో ఈ 5 సందర్భాల్లో భావోద్వేగాలకు లొంగకండి లేకుంటే భారీ నష్టమే

చలికాలంలో చర్మం పొడిబారుతోందా? ఇంట్లో తయారు చేసే ఈ బాడీ స్క్రబ్స్‌ ట్రై చేయండి

పిల్లల మనసులో ఏముందో తెలుసుకోవాలంటే ఎలా? ప్రతిరోజు ఇలా మాట్లాడితే స్వయంగా చెప్పేస్తారు

కంటి పరీక్షల్లో అంతా నార్మల్.. కానీ చీకటి పడితే చూపు మందగిస్తోందా? కొత్త జన్యు వ్యాధిని గుర్తించిన శాస్త్రవేత్తలు!

బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా నూడిల్స్ కట్లెట్! ఇంట్లోనే ఈజీగా చేయండిలా

ఆరెంజ్ గ్లో కోసం ఇదేం ప్రయోగం! వైరల్ ట్రెండ్‌పై షాకింగ్ ఫ్యాక్ట్స్

కరాచీ హల్వా పర్ఫెక్ట్‌గా రావాలంటే ఈ కొలతలు, టిప్స్ పక్కాగా ఫాలో అవ్వాలి!

Big Stories

Advertisement
×