E-Paper
Advertisement

ప్రేమ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం.. ఈ తేదీల్లో పుట్టినవారు భార్యని ప్రాణంగా ప్రేమిస్తారు

ప్రేమ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం.. ఈ తేదీల్లో పుట్టినవారు భార్యని ప్రాణంగా ప్రేమిస్తారు
Advertisement

Numerology| ప్రేమలో పడటం సులభమే. కానీ ఆ బంధాన్ని జీవితాంతం నిలబెట్టుకోవడం అంత సులభం కాదు. ఒక అందమైన బంధం కొనసాగాలంటే ప్రేమతో పాటు నమ్మకం, నిజాయితీ, గౌరవం కూడా ఉండాలి. ముఖ్యంగా భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడం, కష్టసమయాల్లో తోడుగా నిలబడటం చాలా ముఖ్యం. అయితే న్యూమరాలజీ ప్రకారం కొన్ని పుట్టిన తేదీల్లో జన్మించిన వారు ప్రేమ విషయంలో ఎంతో నిజాయితీగా ఉంటారు. ముఖ్యంగా మూడు ప్రత్యేక మూలంకాలు తమ జీవిత భాగస్వామి సంతోషం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. మరి ఈ మూడు మూలాంకాల ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం.

మూలాంకం 2.. భావోద్వేగాలకు ఎక్కువ విలువ ఇస్తారు

ఏ నెలలోనైనా 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 2 అవుతుంది. న్యూమరాలజీ ప్రకారం ఈ మూలాంకానికి చంద్రుడు అధిపతి. ఈ తేదీల్లో పుట్టిన వారు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎదుటివారి భావాలను సులభంగా అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా తమ భాగస్వామి ఇష్టాయిష్టాలను గుర్తించి ప్రవర్తిస్తారు. ప్రేమలో పడిన తర్వాత వీరు బంధానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. కష్టసమయాల్లో భార్యని ఒంటరిగా వదిలిపెట్టరు. చిన్న చిన్న విషయాలతో కూడా తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. వీరికి ప్రేమతో పాటు భావోద్వేగ భద్రత, పరస్పర అవగాహన కూడా చాలా ముఖ్యం.

మూలాంకం 3 కలిగిన వారు ప్రేమలో నిజాయితీగా ఉంటారు

Advertisement

ఏ నెలలోనైనా 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 3 అవుతుంది. ఈ సంఖ్యకు గురుడు అధిపతిగా పరిగణిస్తారు. న్యూమరాలజీ ప్రకారం ఈ మూలాంకం కలిగిన వారు తెలివైనవారు, నిజాయితీపరులు, ప్రేమగా మాట్లాడేవారు. ఏ బంధంలోనైనా పరస్పర గౌరవం ఉండాలని కోరుకుంటారు. భాగస్వామితో మనసు విప్పి మాట్లాడటానికి ఇష్టపడతారు. సమస్యలు ఎదురైనప్పుడు వాటిని చర్చించి పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇస్తారు. అందుకే వీరు నమ్మకమైన జీవిత భాగస్వాములుగా ఉంటారని న్యూమరాలజీ చెబుతోంది.

Also Read: అభిప్రాయ భేదాలున్నా భార్యాభర్తలు కలిసి ఉండొచ్చు.. బంధాన్ని కాపాడే 7 మార్గాలు

మూలాంకం 6.. ప్రేమను వ్యక్తపరచడంలో ముందుంటారు

Advertisement

ఏ నెలలోనైనా 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 6 అవుతుంది. ఈ సంఖ్యకు శుక్రుడు అధిపతి. జ్యోతిష్యశాస్త్రంలో శుక్రుడిని ప్రేమ, అందం, విలాసం, వైవాహిక సంతోషానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే మూలాంకం 6 ఉన్నవారిని ప్రేమ విషయంలో ప్రత్యేకంగా పరిగణిస్తారు. వీరు తమ భాగస్వామిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం, ప్రేమగా మాట్లాడటం, ప్రత్యేక సందర్భాలను గుర్తుంచుకోవడం వంటివి చేస్తారు.

వీరికి నమ్మకం, విధేయత చాలా ముఖ్యం. తమ బంధంలో మోసాన్ని అస్సలు ఇష్టపడరు. భాగస్వామి సంతోషం కోసం త్యాగాలు చేయడానికి కూడా వెనుకాడరని న్యూమరాలజీ వివరిస్తుంది.

Also Read: మనసులో నిరాశ, బాధ, గందరగోళంగా ఉందా? ప్రతి సమస్యకు పరిష్కరం సూచించే భగవద్గీత అధ్యాయాలు ఇవే

ఈ మూడు మూలాంకాల వారిలో ప్రధాన ప్రత్యేకతలు

మూలాంకం 2, 3, 6 కలిగిన వారిలో ప్రేమ, అనురాగం, నిజాయితీ, భావోద్వేగ అవగాహన వంటి లక్షణాలు ఉంటాయని న్యూమరాలజీ నమ్ముతుంది. అయితే ఇవి సంప్రదాయ నమ్మకాలు మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. నిజ జీవితంలో మంచి బంధం కొనసాగాలంటే ఇద్దరి మధ్య నమ్మకం, గౌరవం, ప్రేమ, పరస్పర అవగాహన తప్పనిసరి.

Related News

మహారాష్ట్ర స్పెషల్ ‘పిత్లా భాక్రీ’.. తక్కువ టైంలోనే అదిరిపోయే రుచి!

మార్కెట్‌కు వెళ్లాల్సిన పనిలేదు.. ఇంట్లోనే వెల్లుల్లి పంట.. ఒక్క రెబ్బ ఉంటే చాలు

కొత్త ఇంటికి ఎలాంటి ఫ్లోరింగ్ వేయించాలి? మీ ఇంటి అందాన్ని రెట్టింపు చేసే 5 ఫ్లోరింగ్ డిజైన్స్

చాణక్య నీతి.. జీవితంలో ఈ 5 సందర్భాల్లో భావోద్వేగాలకు లొంగకండి లేకుంటే భారీ నష్టమే

చలికాలంలో చర్మం పొడిబారుతోందా? ఇంట్లో తయారు చేసే ఈ బాడీ స్క్రబ్స్‌ ట్రై చేయండి

పిల్లల మనసులో ఏముందో తెలుసుకోవాలంటే ఎలా? ప్రతిరోజు ఇలా మాట్లాడితే స్వయంగా చెప్పేస్తారు

కంటి పరీక్షల్లో అంతా నార్మల్.. కానీ చీకటి పడితే చూపు మందగిస్తోందా? కొత్త జన్యు వ్యాధిని గుర్తించిన శాస్త్రవేత్తలు!

Big Stories

Advertisement
×