Winter Dry Skin Body Scrubs| చలికాలం వచ్చిందంటే చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తాం. కానీ ఇదే సమయంలో చర్మం మాత్రం పొడిబారడం, తెల్లగా పొట్టు రాలడం, గరుకుగా మారడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎంత మాయిశ్చరైజర్ రాసినా కొన్నిసార్లు చర్మం మునుపటిలా మృదువుగా అనిపించదు. అయితే ఇందుకోసం ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ కొనాల్సిన అవసరం లేదు. మీ వంటింట్లోనే ఉండే ఓట్స్, తేనె, కాఫీ, పెరుగు, బియ్యప్పిండి వంటి పదార్థాలతో ఇంట్లోనే బాడీ స్క్రబ్స్ తయారు చేసుకోవచ్చు. ఇవి చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు తొలగించడంలో సహాయపడతాయి. మరి చలికాలంలో చర్మాన్ని మృదువుగా ఉంచుకోవడానికి ఉపయోగపడే 5 సింపుల్ హోమ్‌మేడ్ స్క్రబ్స్ గురించి తెలుసుకుందాం.
చలికాలంలో చర్మం ఎక్కువగా పొడిబారేవారు ఓట్స్, తేనెతో తయారు చేసిన స్క్రబ్ ప్రయత్నించండి. ఓట్స్ చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను సున్నితంగా తొలగించడంలో సహాయపడతాయి. చర్మంలో తేమ నిల్వ ఉండటానికి తేనె తోడ్పడుతుంది.
కావాల్సిన పదార్థాలు:
తయారీ విధానం: ఒక గిన్నెలో ఓట్స్ పొడి, తేనె వేసి కలపాలి. అవసరమైనంత నీళ్లు పోసి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తడి చర్మంపై అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
కాఫీ పొడి చర్మంపై ఉండే మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నూనె పొడిబారిన చర్మాన్ని మృదువుగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.
కావాల్సిన పదార్థాలు:
తయారీ విధానం: కాఫీ పొడిలో కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చేతులు, కాళ్లతో సహా శరీరానికి అప్లై చేసి మెల్లగా మసాజ్ చేయాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ స్క్రబ్‌ను ముఖానికి ఉపయోగించకూడదు.
పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మంపై మృతకణాలు సున్నితంగా తొలగించడంలో సహాయపడుతుంది. ఓట్స్ కూడా చర్మాన్ని మృదువుగా శుభ్రం చేయడానికి ఉపయోగపడతాయి.
కావాల్సిన పదార్థాలు:
తయారీ విధానం: రెండు పదార్థాలను కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. చర్మానికి అప్లై చేసి కొద్దిసేపు ఉంచాలి. తర్వాత నీటితో మెల్లగా కడిగేయాలి.
బియ్యప్పిండి సంప్రదాయ చర్మ సంరక్షణ పద్ధతుల్లో ఉపయోగించే పదార్థం. ఇది చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు తొలగించడంలో సహాయపడుతుంది.
కావాల్సిన పదార్థాలు:
తయారీ విధానం: బియ్యప్పిండిలో పాలు పోసి పేస్ట్‌లా కలపాలి. తడి చర్మంపై అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత నీటితో కడిగేయాలి. గరుకుగా ఉండే పిండిని ఉపయోగించకుండా మెత్తగా పొడి చేసిన బియ్యప్పిండినే ఎంచుకోవాలి.
అరటిపండు చర్మం మృదువుగా అనిపించడానికి సహాయపడుతుంది. ఓట్స్ చర్మంపై ఉండే మృతకణాలను సున్నితంగా తొలగిస్తాయి.
కావాల్సిన పదార్థాలు:
తయారీ విధానం: అరటిపండు మెత్తగా గుజ్జులా చేసుకోవాలి. అందులో ఓట్స్ పొడి వేసి బాగా కలపాలి. తడి చర్మానికి ఈ పేస్ట్ అప్లై చేసి 5 నిమిషాలు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
Also Read: మీ కళ్లు చిన్నవిగా కనిపిస్తున్నాయా? పెద్దవిగా కనిపించేందుకు 3 ఫర్ఫెక్ట్ ఐలైనర్ ట్రిక్స్
Also Read: ఫైబర్ పుష్కలంగా ఉండే స్పెషల్ ఉప్మా.. చలికాలంలో సూపర్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్
చర్మం ఇప్పటికే సున్నితంగా లేదా పొడిబారిపోయి ఉంటే తరచుగా స్క్రబ్బింగ్ చేయడం మంచిది కాదు. సున్నితమైన చర్మ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి.