Arava Sridhar: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా ఎన్నికల ప్రచారానికి వెళ్లే నాయకులకు పూలమాలలతో స్వాగతం లభిస్తుంటుంది. కానీ, పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చిట్వేల్ మండలం కొత్తపల్లి గ్రామానికి వెళ్లిన స్థానిక ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు మాత్రం సొంత పార్టీ కార్యకర్తల నుంచే ఊహించని ప్రతిఘటన ఎదురైంది.
అసలు ఏం జరిగిందంటే?
కొత్తపల్లిలో పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో.. స్థానిక జనసేన మహిళా కార్యకర్తలు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను అడ్డుకుని ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో జరిగిన పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీలో ఉన్నప్పటికీ, మీరు టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచారని వారు ఆరోపించారు. సొంత పార్టీ గుర్తైన గ్లాసు గుర్తుకు ప్రచారం చేయాల్సింది పోయి.. టీడీపీ కోసం పనిచేశారంటూ మహిళలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
‘ఆ రోజు ఎందుకు రాలేదు?’
‘పరిషత్ ఎన్నికల సమయంలో టీడీపీ పోటీలో ఉందనే కారణంతో మీరు కనీసం ప్రచారానికి కూడా రాలేదు. అలాంటప్పుడు ఇప్పుడు మళ్లీ మా గ్రామానికి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వచ్చారు’. అంటూ మహిళలు ఎమ్మెల్యేను సూటిగా నిలదీశారు. ఈ క్రమంలో ‘నువ్వు అసలు ఏ పార్టీ ఎమ్మెల్యేవి?’ అంటూ వారు వేసిన ప్రశ్న అక్కడున్న వారందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. కార్యకర్తల నుంచి ఇంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుందని ఊహించని ఎమ్మెల్యే, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాస్త ఉక్కిరిబిక్కిరయ్యారు.
తప్పు ఒప్పుకున్న ఎమ్మెల్యే
మహిళా కార్యకర్తల ఆగ్రహం, వారి సూటి ప్రశ్నల ముందు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తలొగ్గక తప్పలేదు. కార్యకర్తల ఆవేదనలో న్యాయం ఉందని గ్రహించిన ఆయన, గతంలో జరిగిన దానికి ‘నాది తప్పే’ అని బహిరంగంగా అంగీకరించారు. దీంతో అక్కడి వాతావరణం కాస్త సద్దుమణిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన చర్చ నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.
టీడీపీకి మద్దతిచ్చి ఇప్పుడు జనసేన ప్రచారానికి వస్తారా….? ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను నిలదీసిన కార్యకర్తలు
చిట్వేల్ మండలం కొత్తపల్లిలో పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను జనసేన కార్యకర్తలు, మహిళలు నిలదీశారు.
పరిషత్ ఎన్నికల్లో జనసేన పోటీలో… pic.twitter.com/gAONErBqfr
— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) November 24, 2026
Also Read: విహారయాత్రలో విషాదం.. ఉయ్యాల తగిలి విద్యార్థి మృతి!