E-Paper
Advertisement

జియో బంపరాఫర్.. ‘హ్యాపీ న్యూ ఇయర్ 2.0’ పేరుతో కొత్త ప్లాన్లు లాంచ్.. రూ. 15కే అపరిమిత 5G!

జియో బంపరాఫర్.. ‘హ్యాపీ న్యూ ఇయర్ 2.0’ పేరుతో కొత్త ప్లాన్లు లాంచ్.. రూ. 15కే అపరిమిత 5G!
Advertisement

Jio Happy New Year 2.0: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన యూజర్లకు సర్ ప్రైజ్ ఇస్తూ అదిరిపోయే ప్లాన్లను తీసుకొచ్చింది. ‘హ్యాపీ న్యూ ఇయర్ 2.0’ పేరుతో వాటిని పరిచయం చేసింది. రూ. 399 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ ప్లాన్లలో రెండు అపరిమిత డేటాను ఆఫర్ చేస్తుండగా.. మరో రెండు డేటా ప్యాక్స్ కావడం విశేషం. పెరిగిన డేటా వినియోగం, యూజర్ల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ‘హ్యాపీ న్యూ ఇయర్ 2.0’ ప్లాన్లు లాంచ్ చేసినట్లు జియో వర్గాలు పేర్కొన్నాయి. ఇంతకీ ఆ ప్లాన్లు ఏంటి? వాటి వల్ల యూజర్లలకు కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఫ్లాగ్‌షిప్ ప్లాన్‌గా రూ. 399 రీఛార్జ్

జియో తన కొత్త ఫ్లాగ్‌షిప్ ప్రీపెయిడ్ ప్లాన్‌గా రూ. 399 రీఛార్జ్‌ను ప్రవేశపెట్టింది. దీని వ్యాలిడిటీ 28 రోజులు కాగా అపరిమిత 4G, 5G డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు దీని కింద లభించనున్నాయి. అలాగే అదనపు బెనిఫిట్స్ కింద 12 నెలల ‘కాన్వా ప్రో’ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు జియో టీవీ ద్వారా జియో హాట్ స్టార్, ఫ్యాన్ కోడ్ పొందొచ్చు. వీటితో పాటు ‘జియో గేమ్స్’ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, ‘జియో ఏఐ క్లౌడ్’ ద్వారా 50GB క్లౌడ్ స్టోరేజ్, జస్ట్ డయల్ లైట్, హైపర్‌ లోకల్ కూపన్లు, డిజిటల్ డైరీ వంటి సదుపాయాలను కూడా జియో అందిస్తోంది.

ఏడాది వ్యాలిడిటీతో రూ. 3,999 ప్లాన్

Advertisement

ఎక్కువ కాలం వ్యాలిడిటీ కోరుకునే యూజర్ల కోసం జియో రూ. 3,999 వార్షిక రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. 365 రోజుల వ్యాలిడిటీ ఉండే ఈ ప్లాన్‌లో అపరిమిత 4G, 5G డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందొచ్చు. ఇందులో కూడా పై ప్లాన్ తరహాలోనే 12 నెలల కాన్వా ప్రో లైట్ సబ్‌స్క్రిప్షన్, హాట్ స్టార్, ఫ్యాన్ కోడ్ తో పాటు 50GB క్లౌడ్ స్టోరేజ్ బెనిఫిట్స్ యూజర్లకు లభించనున్నాయి.

రూ. 15, రూ. 25, రూ. 50 ప్యాక్స్

తక్కువ వ్యవధిలో అపరిమిత 5G డేటా కోరుకునే వారి కోసం జియో రెండు యాడ్ ఆన్ ప్యాక్స్ (రూ.15, రూ.25) తీసుకొచ్చింది. రూ. 15 ప్యాక్ ఒక రోజు పాటు అపరిమిత 5G డేటాను ఇవ్వనుండగా.. రూ. 25 ప్యాక్ రెండు రోజుల పాటు అందిస్తుంది. ఈ యాడ్-ఆన్‌లలో డౌన్‌లోడ్ పరిమితులు, స్పీడ్ లిమిట్ వంటి ఆంక్షలు ఏవీ ఉండవని జియో స్పష్టం చేసింది. మరోవైపు రాత్రి వేళల్లో ఎక్కువ డేటా కోరుకునేవారి కోసం రూ. 50 నైట్ డేటా ప్యాక్‌ను కూడా జియో ప్రవేశపెట్టింది. 28 రోజుల పాటు ప్రతిరోజూ అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు అపరిమిత 4G, 5G డేటా దీని కింద లభించనుంది.

Advertisement

Also Read: ట్యూబ్‌లెస్ టైర్ పంక్చర్ అయితే కారు ఎంత దూరం నడపవచ్చు? ఈ పొరపాటు చేస్తే భారీ నష్టం తప్పదు

ఎప్పటి నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు?

జియో ఈ కొత్త రూ. 399, రూ. 3,999 అపరిమిత డేటా ప్లాన్లు ఇవాళ్టి నుంచే (నవంబర్ 24) నుంచే అందుబాటులోకి తీసుకొచ్చింది. అటు రూ. 25 అపరిమిత 5G యాడ్ ఆన్ కూడా ఇదే రోజున ప్రారంభం కానుండగా.. రూ. 15 యాడ్-ఆన్ ఇప్పటికే అందుబాటులో ఉండటం గమనార్హం. ఇక రూ. 50 అపరిమిత నైట్ డేటా ప్యాక్ నవంబర్ 26 నుంచి యూజర్లు రీఛార్జ్ చేసుకోవచ్చు. మై జియో యాప్, జియో వెబ్‌సైట్‌తో పాటు రిటైల్ స్టోర్లు ద్వారా కస్టమర్లు ఈ రీఛార్జ్‌లు చేసుకోవచ్చని జియో వర్గాలు స్పష్టం చేశాయి.

Also Read: ఫ్రెండ్ యాప్‌లో పరిచయం..కోటీశ్వరుడినంటూ బిల్డప్.. మహిళ మంగళసూత్రం కాజేసిన మెకానిక్

Tags

Related News

చలికాలంలో బట్టలు ఉతకడం కష్టంగా ఉందా? తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ 7KG వాషింగ్ మెషీన్లు ఇవే!

వారంటీ ఉన్నా రూ.79,000 రిపేర్ బిల్లు వేసిన యాపిల్.. చివరికి కోర్టు ఏం తీర్పు ఇచ్చిందో తెలుసా?

దుప్పటి కింద ఫోన్ పెట్టి ఛార్జ్ చేస్తున్నారా? వింటర్ సీజన్లో ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా!

కేవలం రూ.349కే అన్‌లిమిటెడ్ 5G డేటా, 1+1 రీఛార్జ్.. ఇంతకంటే బెస్ట్ ప్లాన్ ఇంకేముంటుంది?

బడ్జెట్ ధరలో ఫ్యామిలీ సైజ్ ఎయిర్ ఫ్రయర్ కావాలా?రూ.2,999కే సూపర్ డీల్!

రూ.899కే 50 గంటల బ్యాటరీ!ఫైర్-బోల్ట్ ఏరో ప్రో ఇయర్‌బడ్స్ ఫీచర్లు అదుర్స్

iPhone 17 కొనేవారికి పండగే.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కళ్లు చెదిరే ఆఫర్, క్రెడిట్ కార్డ్ లేకపోయినా భారీ తగ్గింపు!

Big Stories

Advertisement
×