BigTV English

Fever Reasons: మీకు తరచూ జ్వరం వస్తుందా? అయితే ఈ ఐదు ప్రాణాంతక వ్యాధుల లక్షణం అది కావచ్చు

Fever Reasons: మీకు తరచూ జ్వరం వస్తుందా? అయితే ఈ ఐదు ప్రాణాంతక వ్యాధుల లక్షణం అది కావచ్చు

శరీరంలో ఏదైనా సమస్య మొదలైనప్పుడు అది జ్వరం రూపంలో మనకి బయటకి తెలుస్తుంది. జ్వరం వచ్చినప్పుడు శరీరంలోని ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. సాధారణంగా జ్వరం మూడు నుంచి ఐదు రోజుల్లోపు తగ్గిపోతుంది. కొంతమందికి అలా తగ్గిపోయాక మరల వారం పది రోజులకే జ్వరం రావడం, తగ్గడం జరుగుతూ ఉంటుంది.


ఇలా పదే పదే జ్వరం రావడం అనేది అంతర్లీనంగా దాగి ఉన్న తీవ్రమైన వ్యాధి లక్షణం కావచ్చు. కాబట్టి మీకు జ్వరం తరచూ వస్తూ ఉంటే దాన్ని తేలిగ్గా తీసుకోకండి. దానికి అసలైన కారణాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించండి.

తీవ్రమైన ఇన్ఫెక్షన్
తరచుగా జ్వరం వస్తూ పోతూ ఉంటే అది శరీరంలో ఉన్న ఒక తీవ్రమైన ఇన్ఫెక్షన్ ను సూచిస్తుంది. అది వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్, పరాన్న జీవి వల్ల కలిగే ఇన్ఫెక్షన్ కావచ్చు. మీకు ఇలా తరచూ జ్వరం వస్తూ తగ్గుతూ ఉంటే ఒకసారి వైద్యుల్ని కలిస్తే దానికి కారణాన్ని పరీక్షించి చెబుతారు.


ఆటో ఇమ్యూన్ వ్యాధులు
ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్నవారికి కూడా జ్వరం తరచూ వస్తుంది. లూపస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. లూపస్ బారిన పడిన వారికి కూడా తరచూ జ్వరం వస్తూ ఉంటుంది. ఈ వ్యాధిలో రోగ నిరోధక వ్యవస్థ శరీరంలోని తమ కణజాలాలపైనే దాడి చేస్తుంది. దీనివల్లే జ్వరం వస్తూ ఉంటుంది. కాబట్టి జ్వరాన్ని తేలిగ్గా తీసుకోకండి.

క్షయ వ్యాధి
క్షయ వ్యాధిని ట్యూబర్‌కొలసిస్ అంటారు. టీబీ అనేది ఒక అంటువ్యాధి. బ్యాక్టీరియా వల్ల వచ్చే తీవ్రమైన వ్యాధి ఇది. ఊపిరితిత్తులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. టీబీ ఉన్నవారికి కూడా తరుచూ జ్వరం వస్తూ ఉంటుంది. రోగులు సన్నగా మారిపోతూ ఉంటారు.

టైఫాయిడ్
మురికి నీరు, కలుషిత ఆహారం ద్వారా వ్యాపించే అంటువ్యాధి టైఫాయిడ్. ఈ వ్యాధిలో కూడా రోగికి పదేపదే జ్వరం వస్తూ తగ్గుతూ ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు మీరే మందులు వేసుకొని ఇంట్లో ఉండిపోవడం వంటివి చేయవద్దు. వైద్యులను కలిసి తగిన పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది.

క్యాన్సర్
తరచుగా జ్వరం రావడం అనేది క్యాన్సర్ లక్షణం అని చెబుతారు వైద్యులు. ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్ ఉన్నవారికి తరచుగా జ్వరం వస్తూ పోతూ ఉంటుంది. అందుకే తరచూ జ్వరం రావడం అనేది సాధారణ సంకేతం కాదు. వీలైనంత త్వరగా వైద్యుల్ని కలిసి దానికి తగిన కారణాన్ని తీసుకోవాలి అలాగే చికిత్స కూడా పొందాలి.

జ్వరం సాధారణమైనదేనని వైద్యులు నిర్ధారించాక ప్రత్యేకమైన ఆహారాన్ని తినడం ద్వారా మీరు జ్వరం రాకుండా అడ్డుకోవచ్చు. జ్వరం వచ్చినప్పుడు తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. సూపులు రూపంలో, గంజి, ఉడికించిన కూరగాయలు, మెత్తగా ఉడికించిన అన్నం, పండ్లు వంటివి తినాలి.

ముఖ్యంగా ద్రవహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. మీరు ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్లు వంటివి అధికంగా తాగాలి. జ్వరం తగ్గడానికి శరీరానికి పోషకాహారం అవసరం. కాబట్టి పోషకాలు నిండుగా ఉండే ఆహారాలను తినాలి. ముఖ్యంగా పాలు, పెరుగు, గుడ్లు వంటివి తినవచ్చు.

అలాగే ఉడికించిన చికెన్ ను కూడా కొద్ది మొత్తంలో తీసుకోవచ్చు. కానీ కారంగా ఉండే ఆహారాలను దూరం పెట్టాలి. ఇవి గొంతును చికాకు పెడతాయి. దగ్గును, జ్వరాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుంది. అలాగే కెఫీన్ ను ఉండే కాఫీలను దూరంగా పెట్టాలి. ఆల్కహాల్ తాగడం మానేయాలి.

Related News

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×