E-Paper
Advertisement

Samsung 2026 Flagship: ఫోటోగ్రఫీ లిమిట్స్ బ్రేక్ చేసిన శామ్‌సంగ్ 2026 ఫ్లాగ్‌షిప్.. లాంచ్ ఎప్పుడంటే?

Samsung 2026 Flagship: ఫోటోగ్రఫీ లిమిట్స్ బ్రేక్ చేసిన శామ్‌సంగ్ 2026 ఫ్లాగ్‌షిప్.. లాంచ్ ఎప్పుడంటే?
Advertisement

Samsung 2026 Flagship: శామ్‌సంగ్ పేరు వినగానే మొబైల్ ప్రపంచంలో నమ్మకం, ఇన్నోవేషన్ గుర్తొస్తాయి. దక్షిణ కొరియా నుంచి మొదలైన ఈ బ్రాండ్ టెక్నాలజీ రంగంలో దశాబ్దాల అనుభవంతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది యూజర్లకు చేరువైంది. ఫీచర్ ఫోన్‌ల నుంచి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్‌ల వరకూ ప్రతి సెగ్మెంట్‌లో శామ్‌సంగ్ తనదైన ముద్ర వేసింది. డిస్‌ప్లే క్వాలిటీ, కెమెరా టెక్నాలజీ, చిప్‌సెట్ అభివృద్ధి, బ్యాటరీ పనితీరు వంటి విషయాల్లో శామ్‌సంగ్ ఎప్పుడూ కొత్త స్టాండర్డ్ సెట్ చేస్తూ వస్తోంది. ప్రతి సంవత్సరం మారుతున్న యూజర్ అవసరాలను ముందుగానే అర్థం చేసుకుని వాటికి తగ్గట్టుగా కొత్త ఫీచర్లను పరిచయం చేయడం శామ్‌సంగ్ బ్రాండ్‌గా నిలిచింది. ఇప్పుడు 2026లో 6జి టెక్నాలజీతో సరికొత్తగా శామ్‌సంగ్ రాబోతుంది. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

2026 ఫ్లాగ్‌షిప్ ఎంట్రీ ప్రారంభం

Advertisement

శామ్‌సంగ్ 2026లో మార్కెట్‌కి తీసుకువస్తున్న న్యూ ఫ్లాగ్‌షిప్ ఇంకా లాంచ్ అవకముందే టెక్ ప్రపంచంలో పెద్ద చర్చగా మారింది. ఈ ఫోన్‌లో ఉన్న 6జి సపోర్ట్, 400ఎంపి కెమెరా, భారీ 4టిబి స్టోరేజ్, 9000mAh బ్యాటరీ వంటి స్పెక్స్ చూస్తే ఇది ఇక మొబైల్‌ కాదు, భవిష్యత్తు డివైస్ అని చెప్పేంత లెవల్‌లో ఉంది. లీక్స్ ప్రకారం శామ్‌సంగ్ ఈ ఫోన్‌ను 2026 జనవరిలో జరిగే అధికారిక లాంచ్ ఈవెంట్‌లో విడుదల చేయబోతుందని సమాచారం. ఈ తేదీ గత ఏడాది లాంచ్ ప్యాట్రన్‌కి చాలా దగ్గరగా ఉండడం వల్ల ఇది నిజమే అయ్యే అవకాశం ఎక్కువ.

6జి టెక్నాలజీ తీసుకురాబోయే మార్పు

Advertisement

ఈ ఫోన్‌లోని 6జి రెడీ నెట్‌వర్క్ యూజర్ అనుభవాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ప్రస్తుత 5జి కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ స్పీడ్ వచ్చే అవకాశం ఉండటంతో స్ట్రీమింగ్, గేమింగ్, లార్జ్ ఫైల్ డౌన్‌లోడ్స్ అన్నీ అత్యంత వేగంగా జరుగుతాయి. ఇండియాలో 6జి పబ్లిక్ సర్వీస్ 2026 చివరి నుంచే స్టార్ట్ అవుతుందని టెక్ రిపోర్టులు చెబుతున్నాయి. అందుకే ఈ ఫోన్ ఫ్యూచర్ ప్రూఫ్‌గా భావిస్తున్నారు.

Also Read: IRCTC Goa Tour: కోల్‌కతా నుంచి గోవా, గోకర్ణ వరకు.. ఐఆర్‌సిటిసి ఇన్‌-క్లూజివ్ టూర్ వెళ్లొద్దాం రండి

400ఎంపి కెమెరాతో అల్ట్రా డీటైల్ విజువల్స్

శామ్‌సంగ్ ఈసారి మొబైల్ ఫోటోగ్రఫీ లిమిట్స్‌ను మరింత ముందుకు తీసుకెళ్తోంది. ఈ ఫోన్‌లోని 400ఎంపి మెయిన్ కెమెరా సూదిగిండంత డీటైల్‌ని కూడా స్పష్టంగా క్యాప్చర్ చేసే పవర్ కలిగి ఉంది. నైట్ ఫోటోలు క్లియర్‌గా, యాక్షన్ షాట్స్ స్టెబుల్‌గా, వీడియోల విషయంలో 8కె రికార్డింగ్ మరింత స్మూత్‌గా ఉండబోతున్నాయి. ఐసోసెల్ నెక్స్ట్ జనరేషన్ సెన్సర్ వాడుతున్నట్టు లీక్స్ చెబుతుండటంతో ఫోటో క్వాలిటీ మరో లెవల్‌కి వెళ్లడం ఖాయం.

4టిబి స్టోరేజ్‌తో ఎక్కడా స్పేస్ టెన్షన్ లేదు

మొబైల్ హిస్టరీలో ఇప్పటివరకు రాని భారీ స్టోరేజ్ ఆప్షన్‌ను సామ్‌సంగ్ ఈ ఫోన్‌లో ఇస్తోంది. 4టిబి స్టోరేజ్ అంటే యూజర్‌కు ఏ ఫైల్ డిలీట్ చేయాల్సిన అవసరం ఉండదు. హెవీ డ్యూరేషన్ సినిమాలు, 8కె వీడియోలు, హై గ్రాఫిక్స్ గేమ్స్, ప్రాజెక్ట్ ఫోల్డర్లు అన్నీ ఒకే ఫోన్‌లో సేఫ్‌గా ఉంచుకోవచ్చు. అంతేకాదు శామ్‌సంగ్ స్పెషల్ స్టోరేజ్ కంప్రెషన్ టెక్ వాడుతున్నందున స్పీడ్ కూడా తగ్గకుండా ఉంటుంది.

9000mAh బ్యాటరీ తో రెండు రోజుల పవర్

ఈ ఫోన్‌లోని 9000mAh బ్యాటరీ మరొక పెద్ద ఆకర్షణ. ఇంత భారీ బ్యాటరీ ఫ్లాగ్‌షిప్ లెవల్‌లో ఇవ్వడం చాలా అరుదు. ఒకసారి ఛార్జ్ చేస్తే రెండు రోజులు హేవీ యూజ్ కూడా సులభంగా సాగుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ 150W వరకు ఉండే అవకాశం ఉందని లీక్స్ చెబుతున్నాయి. కొత్త ఏఐ పవర్ మేనేజ్‌మెంట్‌తో బ్యాటరీ లైఫ్ ఇంకా పెరుగుతుంది.

ఇండియాలో ధర.. లాంచ్ వివరాలు

ఈ సామ్‌సంగ్ 2026 ఫ్లాగ్‌షిప్ ధర ఇండియా మార్కెట్‌లో రూ.1,29,999 దగ్గరగా ఉండే అవకాశం ఉంది. ప్రీమియం ఫీచర్లు చూసుకుంటే ఈ ధర కూడా జస్టిఫై అవుతుందని అనిపిస్తుంది. లాంచ్ అయిన వెంటనే 2026 మొబైల్ మార్కెట్ మొత్తం కొత్త స్టాండర్డ్‌కి మారటం ఖాయం.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×