E-Paper
Advertisement

ఇంట్లోనే క్రిస్పీ పప్పు చెగోడీలు..ఇలా చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ మీ సొంతం!

ఇంట్లోనే క్రిస్పీ పప్పు చెగోడీలు..ఇలా చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ మీ సొంతం!
Advertisement

Pappu chegodilu:మన తెలుగు ఇళ్లలో స్నాక్స్ అంటే.. ముందుగా గుర్తొచ్చే క్లాసిక్ ఐటమ్స్‌లో పప్పు చేగోడీలకు ఎప్పుడూ టాప్ ప్లేస్ ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఇవి ఫేవరెట్. ఆఫీస్ వర్క్ మధ్యలో.. బ్రేక్ తీసుకున్నా, ఫ్రెండ్స్‌తో కలిసి సినిమా చూస్తున్నా, పప్పు చేగోడీలు ఎప్పుడూ బోర్ కొట్టవు. బయట కొనే.. వాటిలో నూనె క్వాలిటీ, రుచి విషయంలో.. డౌట్ ఉండొచ్చు కానీ, ఇంట్లోనే ఫ్రెష్‌గా చేసుకుంటే హెల్తీగా, సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇంతకీ ఇవి ఎలా రెడీ చేయాలో తెలుసుకుందామా..

కావాల్సిన పదార్థాలు:

బియ్యప్పిండి: 2 కప్పులు

Advertisement

పెసరపప్పు లేదా శనగపప్పు: 1 కప్పు ( గంటసేపు నానబెట్టాలి)

నీళ్లు: తగినంత

Advertisement

నువ్వులు: 2 టేబుల్ స్పూన్లు

వాము లేదా జీలకర్ర: 1 టీ స్పూన్

ఉప్పు:తగినంత

కారం: 2 టేబుల్ స్పూన్లు

వెన్న లేదా నూనె: కొద్దిగా

నూనె: ఫ్రైకి సరిపడా

తయారీ విధానం:

1. ముందుగా పెసరపప్పు లేదా శనగపప్పుని కనీసం గంటసేపు నీళ్లలో నానబెట్టి, నీళ్లు పూర్తిగా వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు, ఉప్పు, కారం, నువ్వులు, వాము వేసి బాగా మరిగించాలి. నీళ్లు.. మరుగుతున్నప్పుడు కొద్దిగా నూనె లేదా వెన్న వేస్తే చేగోడీలు గట్టిగా లేకుండా గుల్లగా వస్తాయి. నీళ్లు మరుగుతుండగానే స్టవ్ సిమ్‌లో పెట్టి బియ్యప్పిండిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలపాలి. పిండి మొత్తం నీళ్లు పీల్చుకుని ముద్దలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాలు అలాగే ఉంచాలి. ఇలా ఆవిరిలో.. మగ్గడం వల్ల పిండి సాఫ్ట్‌గా మారి, చుట్టడానికి ఈజీగా ఉంటుంది.

2. పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నూనె లేదా నెయ్యి రాసుకుని..బాగా మెత్తగా ఒత్తుకోవాలి. తర్వాత నానబెట్టిన పప్పుని ఈ పిండి ముద్దలో వేసి మరోసారి కలపాలి. (లేదా చెగోడీ చుట్టిన తర్వాత పైన అద్ది నొక్కే పద్ధతి కూడా వాడొచ్చు. బయట కనిపిస్తూ వేగితే చూడటానికి, తినడానికి బాగుంటుంది). తర్వాత చిన్న పిండి ముద్ద తీసుకుని అ రచేతుల మధ్య పెట్టి సన్నని తాడులా రోల్ చేయాలి. తర్వాత రెండు చివరలను కలిపి చిన్న రింగ్‌లా లేదా సర్కిల్‌లా ప్రెస్ చేయాలి. నూనెలో వేసినప్పుడు విడిపోకుండా చివర్లను కొంచెం గట్టిగా నొక్కాలి. మరీ లావుగా కాకుండా, మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో చేస్తే లోపల వరకు చక్కగా వేగుతాయి.

Also Read: ఆకుకూర తినని వాళ్ళు కూడా..ఇష్టపడే పాలకూర పచ్చడి

3. నూనె బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చెగోడీలను ఒక్కొక్కటిగా వేయాలి. వేసిన వెంటనే.. గరిటెతో తిప్పకుండా, కొద్ది సెకన్లు ఆగి బబుల్స్ తగ్గుతున్నప్పుడు నెమ్మదిగా కలపాలి. హై ఫ్లేమ్‌లో వేయిస్తే.. బయట కలర్ వస్తుంది కానీ లోపల పచ్చిగా ఉండి.. మెత్తబడిపోతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి, నూనెలో నురగ తగ్గిన తర్వాత తీసి టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్‌టైట్.. కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే 2–3 వారాల పాటు తాజాగా, క్రిస్పీగా ఉంటాయి.

Related News

పాతికేళ్లకే నలభై ఏళ్ల వారిలా కనిపిస్తున్నారా? మగాళ్లు చేసే ఈ 5 తప్పులే కొంపముంచుతున్నాయి!

ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!

ఆకుకూర తినని వాళ్ళు కూడా..ఇష్టపడే పాలకూర పచ్చడి

ప్రొటీన్ ప్యాక్డ్ మిల్మేకర్ కట్లెట్స్..టీ టైమ్‌కి కిర్రాక్ స్నాక్ రెసిపీ

సెల్ఫ్ రెస్పెక్ట్ వెడ్డింగ్.. పంతులు, కోర్టు, మంత్రాలు ఏవీ లేకున్నా పెళ్లి జరుగుతుంది

తాళాల గుత్తిలో సరైన తాళం చెవి దొరకడం లేదా? నో టెన్షన్ సింపుల్ ట్రిక్స్ ఇవిగో

పెళ్లిళ్లు, పార్టీల్లో అదిరిపోయే లుక్ కావాలా? లెహంగాతో ఈ 6 హెయిర్‌స్టైల్స్ ట్రై చేయండి

Big Stories

Advertisement
×