International Men’s Day 2026: చాలామంది పురుషులు తమ ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు అంటూ రోజంతా బిజీగా గడుపుతుంటారు. ఈ క్రమంలో సొంత ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మర్చిపోతుంటారు. ఫలితంగా చిన్న వయసులోనే ముఖంపై ముడతలు, కళ్ల కింద నల్లటి వలయాలు, జుట్టు రాలడం, నీరసం వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. వయసు తక్కువే అయినా.. ముఖంలో మాత్రం పెద్దవారిలా కనిపిస్తుంటారు. నేడు (నవంబర్ 19) అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా మగవారి ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా రోజూ మనం చేసే కొన్ని పనులు కూడా త్వరగా వృద్ధాప్య ఛాయలు కనిపించడానికి కారణం కావచ్చు. ఆ 5 అలవాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..
రాత్రి పొద్దుపోయేదాకా ఆఫీసు పనులు చేయడం లేదా ఫోన్లు చూస్తూ గడపడం వల్ల శరీరానికి సరైన విశ్రాంతి దొరకడం లేదు. రోజుకు కనీసం 7 – 9 గంటల నిద్ర లేకపోతే కళ్లు అలసిపోయినట్లు కనిపిస్తాయి, చర్మం కాంతి తగ్గుతుంది. నిద్రపోయినప్పుడే మన శరీరం దెబ్బతిన్న కణాలను రిపేర్ చేసుకుంటుంది కాబట్టి.. టైమ్‌కి పడుకోవడం చాలా ముఖ్యం.
కెరీర్ టెన్షన్, డబ్బుల సర్దుబాటు, ఇంటి బాధ్యతల వల్ల మగాళ్లు నిరంతరం మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడి ఎక్కువైతే శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని త్వరగా అలసట రావడం, ముఖంపై ముడతలు పడటం జరుగుతుంది. వ్యాయామం చేయడం, నచ్చిన వాళ్లతో సమయం గడపడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
Also Read: ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
స్మోకింగ్ చేసేవాళ్లలో చర్మాన్ని బిగుతుగా ఉంచే కొల్లాజెన్ దెబ్బతింటుంది. దీనివల్ల ముఖంపై గీతలు, ముడతలు త్వరగా వస్తాయి. ఇక మద్యం ఎక్కువగా తాగడం వల్ల నిద్ర చెడిపోయి, శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఈ రెండింటికీ దూరంగా ఉంటే ఆరోగ్యంతో పాటు యవ్వనం కూడా నిలుస్తుంది.
సమయానికి తినకపోవడం, బయటి జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్, ఐరన్, విటమిన్ బి12, విటమిన్ సి అందడం లేదు. వీటి లోపం వల్ల విపరీతమైన నీరసం, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు ఉండేలా చూసుకోవాలి.
పనిలో పడి చాలామంది మగాళ్లు అసలు నీళ్లే తాగరు. శరీరానికి సరిపడా నీళ్లు అందకపోతే చర్మం పొడిబారిపోయి, ముఖం డల్‌గా మారుతుంది. రోజంతా తగినన్ని నీళ్లు తాగడం వల్ల శరీరం యాక్టివ్‌గా ఉండటమే కాకుండా.. చర్మం కూడా తాజాగా కనిపిస్తుంది. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ, అవసరమైతే డాక్టర్‌ను సంప్రదిస్తూ ఉంటే మగాళ్లు ఎప్పుడూ ఆరోగ్యంగా, యంగ్‌గా కనిపించవచ్చు.
Also Read: అల్లం ఎండిపోకుండా నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి!