Gordon on OTT: ఒక వీధి దొంగగా నేర ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఒక వ్యక్తి, ఏకంగా దేశ రాజకీయ వ్యవస్థనే శాసించే స్థాయికి ఎదిగిన తీరు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పడు అలాంటి మైండ్ బ్లోయింగ్ రియల్ స్టోరీ గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. 1970ల అర్జెంటీనా రాజకీయ హింసాత్మక చరిత్రను కళ్లకు కట్టేలా ఈ క్రైమ్ థ్రిల్లర్ ఉంటుంది. ప్రభుత్వ అండతో ఒక కిరాతక నేరస్థుడు సాగించిన రక్తచరిత్ర ఇప్పుడు వెబ్ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత ‘మనీ హెయిస్ట్’ (Money Heist) సిరీస్‌లో పలెర్మో పాత్రతో అలరించిన అర్జెంటీనా స్టార్ నటుడు రోడ్రిగో డి లా సెర్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ రియల్ క్రైమ్ థ్రిల్లర్ ‘గోర్డన్’ (Gordon) నిన్న (నవంబర్ 18) ఓటీటీలోకి అడుగుపెట్టింది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, వెన్నులో వణుకు పుట్టించే సన్నివేశాలతో సాగే ఈ 7 ఎపిసోడ్ల సంచలన సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది, అసలు ఆ మాఫియా డాన్ కథేంటో ఇప్పుడు చూద్దాం.
1970ల నాటి అర్జెంటీనా చరిత్రలో అత్యంత వివాదాస్పద, క్రూరమైన నేరస్థుడు అనిబాల్ గోర్డన్ నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. మార్సెలో లార్రాక్వీ రాసిన బయోగ్రఫీ నవలల ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. బయటకు తన భార్య, చిన్నారి కొడుకుతో కలిసి ఒక సాధారణ వ్యాపారవేత్తలా నటిస్తూ, లోపల భారీ దోపిడీలు, బ్యాంక్ రాబరీలకు ప్లాన్ చేసే తెలివైన దొంగగా గోర్డన్ (రోడ్రిగో డి లా సెర్నా) జీవితం మొదలవుతుంది. అయితే ఒక భారీ బ్యాంక్ దోపిడీ కేసులో జైలు పాలైన తర్వాత అతని జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. జైలులో ఉన్న రాజకీయ ఖైదీల సమాచారాన్ని ఇంటెలిజెన్స్ అధికారులకు చేరవేయడం ద్వారా ప్రభుత్వ పెద్దల దృష్టిలో పడతాడు. 1973లో క్షమాభిక్షపై జైలు నుండి విడుదలయ్యాక, దేశంలోని రాజకీయ అస్థిరతను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ రహస్య ఇంటెలిజెన్స్ ఏజెంట్‌గా, ‘ట్రిపుల్ ఏ’ (Triple A) డెత్ స్క్వాడ్ నాయకుడిగా మారతాడు. కిడ్నాప్‌లు, రహస్య నిర్బంధ కేంద్రాల్లో చిత్రహింసలు, రాజకీయ ప్రత్యర్థుల హత్యలతో దేశాన్నే గడగడలాడించిన ఒక రాక్షసుడి ప్రయాణాన్ని దర్శకులు పాబ్లో ట్రాపెరో, పాబ్లో ఫెండ్రిక్ కళ్లకు కట్టినట్లు చూపించారు.
ఈ 7 ఎపిసోడ్ల లిమిటెడ్ ల ‘గోర్డన్’ (Gordon) క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్‌లో అర్జెంటీనా స్టార్ నటుడు రోడ్రిగో డి లా సెర్నా టైటిల్ పాత్ర అయిన అనిబాల్ గోర్డన్‌గా అద్భుతంగా నటించగా, మతియాస్ రెకాల్ట్, కమిలా పెరాల్టా, మతియాస్ మేయర్, అగస్టిన్ పార్డెల్లా, ఫియోరెల్లా బొట్టాయోలి మరియు టోటో రోవిటో కీలక పాత్రలు పోషించారు. పాబ్లో ట్రాపెరో, పాబ్లో ఫెండ్రిక్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ నవంబర్ 18, 2026 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ Netflix లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం ఇది ఒరిజినల్ స్పానిష్ ఆడియోతో పాటు ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఇంకా విడుదల కాలేదు.
Read Also: నగరాన్ని వణికించే హంతకుడు… పోలీసులకు నిద్రలేని రాత్రులు… వెన్నులో వణుకు పుట్టించే సిరీస్