E-Paper
Advertisement

ప్రమోషన్లు అంటే చాలు వచ్చేస్తాడు.. కొత్త సినిమా ప్రమోషన్స్ షురూ చేసిన అనిల్ రావిపూడి

ప్రమోషన్లు అంటే చాలు వచ్చేస్తాడు.. కొత్త సినిమా ప్రమోషన్స్ షురూ చేసిన అనిల్ రావిపూడి
Advertisement

Anil Ravipudi: అనిల్ రావిపూడి ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఈయన దర్శకత్వంలో త్వరలోనే జనవరి 12 విడుదల సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా విడుదలకు పెద్దగా సమయం లేకపోవడంతో ప్రమోషన్లను కూడా మొదలుపెట్టారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన అప్డేట్ తెలియజేస్తూ అనిల్ రావిపూడి(Anil Ravipudi) షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రమోషన్స్ అంటే అందరికన్నా ముందుంటాం..

ఇందులో భాగంగా అనిల్ రావిపూడి కృతి శెట్టి (Kriti Shetty) కీర్తి సురేష్(Keerthy Suresh) మధ్య ఈ వీడియో కొనసాగుతుంది.ఈ చిత్రం కోసం “ప్రమోషన్లు అంటే చాలు అందరికంటే ముందుంటాం” అంటూ ఒక అప్డేట్ వీడియోను షేర్ చేశారు.రజనీకాంత్ ‘దళపతి’ సినిమాలో శోభన, రజనీకాంత్ విడిపోయే సీన్‌ను ఫన్నీ వేలో రీ క్రియేట్ చేశారు. ఈ వీడియోలో శోభన ప్లేస్‌లో కృతి శెట్టి, రజనీకాంత్ ప్లేస్‌లో అనిల్ రావిపూడి కనిపించారు. ఈ వీడియోలోకి కృతి శెట్టి మాట్లాడుతూ అనిల్ రావిపూడి లేకుండా ఒక రీల్ చేద్దామనుకుంటున్నాను అంటూ చెప్పగా వెంటనే కీర్తి సురేష్ ప్రమోషన్స్ అంటే చాలు వచ్చేస్తాడంటూ తల పట్టుకున్నారు.

దళపతి సినిమా సీన్ రీక్రియేషన్..

Advertisement

ఇలా అనిల్ రావిపూడి లేకుండా వీరిద్దరూ సరదాగా డాన్స్ చేస్తూ ఒక రీల్ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక సినిమా ప్రమోషన్స్ అంటే ఎప్పుడు ఎంతో విభిన్నంగా ఆలోచిస్తూ సినిమాలను ముందుకు తీసుకువెళ్లడంలో అనిల్ రావిపూడి రూటే సపరేట్ అని చెప్పాలి. ఇలా విభిన్నంగా సినిమాలను ప్రమోట్ చేస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తారు. తాజాగా దళపతి సినిమాలోని సీన్ రిక్రియేట్ చేస్తూ జనవరి 12 విడుదల ప్రమోషన్లు చేయడం పట్ల నెటిజెన్స్ షాక్ అవుతున్నారు.

?jplx=MWVqZXhjazBndnN5bQ%3D%3D

Advertisement

ఇలా అనిల్ రావిపూడి ప్రమోషనల్ వీడియో పై నెటిజెన్స్ స్పందిస్తూ.. సినిమా ప్రచారంలో నిన్ను మించినోళ్లు ఎవరూ లేరు.. ఏమన్నా క్రియేటివిటీనా అనీలూ అంటూ ఫన్నీగా ఈ వీడియో పై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ ఒక్క వీడియోతో అమ్మాయిల రీల్స్ కు కావలసిన కంటెంట్ ఇచ్చావు కదా గురూ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక జనవరి 12 విడుదల సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో రేపటి నుంచి మ్యూజికల్ ప్రమోషన్లు కూడా ప్రారంభమవుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సినిమాలో వెంకటేష్ కళ్యాణ్ రామ్ హీరోలుగా నటించగా కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Also Read: ‘జనవరి 12 విడుదల’ టాప్ ప్రొడ్యూసర్ చేతికి నైజాం రైట్స్..ఇక లాభాల పంటే?

Related News

రాహుల్ గాంధీ వ్యాఖ్యల వివాదం పై సోనాక్షి సిన్హా కౌంటర్!

రామ్ పోతినేని నుంచి ఊహించని సర్‌ప్రైజ్.. ఫస్ట్ లుక్‌కు ముహూర్తం ఫిక్స్!

‘జనవరి 12 విడుదల’ టాప్ ప్రొడ్యూసర్ చేతికి నైజాం రైట్స్..ఇక లాభాల పంటే?

టైం 100 నెక్స్ట్ ఇండియా కవర్ పేజీ పై బాలీవుడ్ బ్యూటీ.. రాజమౌళి ప్రశంసలు!

ఏం టాలెంట్ గురూ.. సంయుక్త ఫోటోలు చూసి ఆశ్చర్యపోతున్న అభిమానులు!

సమంత సీమంతం వేడుక ఏ పద్ధతిలో జరిగిందో తెలుసా?

ఈఎన్ఈ రిపీట్ లో ఎంతమంది గెస్ట్ లుగా నటించారో తెలుసా?

Big Stories

Advertisement
×