Egypt Pyramids myth: ప్రపంచంలో.. ఎన్ని వింతలున్నా.. ఈజిప్ట్‌లోని ‘గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా’ ఇచ్చే కిక్కే వేరు! ఎందుకంటే.. లేటెక్ట్ టెక్నాలజీ, క్రేన్లు, కంప్యూటర్లు లేని 4500 ఏళ్ల క్రితమే.. అంత పెద్ద రాళ్లతో వీటిని ఎలా కట్టారనేది ఇప్పటికీ పెద్ద మిస్టరీ. కొందరైతే.. దీని వెనక ఏలియన్స్ టెక్నాలజీ ఉందని గట్టిగా నమ్ముతారు. మరికొందరేమో నక్షత్రాల పొజిషన్‌ని బట్టి వీటిని కట్టారని చెప్తారు. అసలు ఈ పిరమిడ్ల వెనక ఉన్న ఆ షాకింగ్ నిజాలేంటో, సైన్స్ ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం.
హిస్టరీ అనగానే చాలా మంది బోర్ ఫీల్ అవుతారు కానీ, ఈజిప్ట్ పిరమిడ్ల టాపిక్ వస్తే.. మాత్రం అందరి చెవులు రిక్కించుకుంటారు. ఎందుకంటే అందులో ఉన్న సస్పెన్స్ అలాంటిది మరి! ఈ హాట్ టాపిక్ వెనక ఉన్న కొన్ని క్రేజీ ఫ్యాక్ట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
ఒక్కో రాయి బరువు 25 టన్నులు.. ఎలా ఎత్తారు?
గిజాలోని గ్రేట్ పిరమిడ్‌ను దాదాపు 23 లక్షల భారీ రాళ్లతో కట్టారు. ఇందులో ఒక్కో రాయి బరువు కనీసం 2.5 టన్నుల నుంచి 80 టన్నుల వరకు ఉంటుంది. మన ఇంట్లో ఒక బీరువా జరపాలంటేనే నలుగురం కావాలి. అలాంటిది వేల ఏళ్ల క్రితం ఎలాంటి క్రేన్లు, జేసీబీలు, కనీసం ఇనుప పరికరాలు కూడా లేని కాలంలో.. అంత పెద్ద రాళ్లను 480 అడుగుల ఎత్తుకు ఎలా తీసుకెళ్లారు?
ఇక్కడే “ఏలియన్స్ థియరీ” స్క్రీన్‌పైకి వచ్చింది. మనుషులకు ఇది సాధ్యం కాదు కాబట్టి, గ్రహాంతరవాసులే వచ్చి తమ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో వీటిని కట్టారని చాలా మంది బుక్స్, డాక్యుమెంటరీలు కూడా రాసేశారు.
కానీ ప్రస్తుత రీసెర్చ్ ప్రకారం.. దీని వెనక ఏలియన్స్ లేరు.. మనలాంటి మనుషుల తిరుగులేని మేధస్సు మాత్రమే ఉందని సైంటిస్టులు నిరూపించారు.
ర్యాంప్ సిస్టమ్: ఈజిప్షియన్లు పిరమిడ్ చుట్టూ ఇసుక, మట్టితో పెద్ద పెద్ద వాలుగా ఉండే మార్గాలను నిర్మించారు.
నీటి లూబ్రికేషన్: రాళ్లను భారీ చెక్క స్లెడ్జ్‌లపై ఉంచి, వాటి ముందు ఇసుకను నీటితో తడిపేవారు. ఇలా చేయడం వల్ల ఘర్షణ సగానికి సగం తగ్గిపోయి, వందల మంది కలిసి ఆ రాళ్లను ఈజీగా పైకి లాగగలిగేవారు.
పిరమిడ్ల గురించిన మరో మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే.. గిజాలో ఉన్న మూడు ప్రధాన పిరమిడ్లు, ఆకాశంలోని.. ‘ఓరియన్ బెల్ట్’ లోని మూడు నక్షత్రాల పొజిషన్‌కు సరిగ్గా స్ట్రెయిట్‌గా మ్యాచ్ అవుతాయి. అలాగే వీటి నాలుగు దిక్కులు మన కంపాస్ కంటే ఖచ్చితంగా ఉంటాయి.
ఆ కాలంలో గూగుల్ మ్యాప్స్ కానీ..టెలిస్కోప్‌లు కానీ లేవు కదా, మరి ఇదెలా సాధ్యం? ఈజిప్షియన్లు ఖగోళ శాస్త్రంలో జీనియస్స్. వారు రాత్రి పూట ధ్రువ నక్షత్రం, ఇతర నక్షత్రాల కదలికలను బట్టి భూమిపై లైన్లు గీసేవారు. నక్షత్రాలే తమ దేవుళ్లని నమ్మే వారు, రాజుల ఆత్మలు నేరుగా ఆ నక్షత్రాల లోకానికి వెళ్లాలనే ఉద్దేశంతో అంత పక్కాగా అలైన్‌మెంట్ చేశారు.
కేవలం ఊహాగానాలు కాకుండా ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం ముఖ్యం. పిరమిడ్ల లోపల ఎలాంటి ఏలియన్ స్పేస్ షిప్స్ కానీ, వింత టెక్నాలజీ కానీ లేవు. కానీ 4500 ఏళ్ల క్రితమే మనుషులు అంత ప్లానింగ్‌తో, ఇంజనీరింగ్ అద్భుతాన్ని సృష్టించడం నిజంగా ఏలియన్స్ చేసిన పని కంటే తక్కువేం కాదు. అందుకే పిరమిడ్లు ఇప్పటికీ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ వండర్‌గా నిలిచాయి.