E-Paper
Advertisement

వానాకాలంలో కారులో ఈ 8 వస్తువులు ఉంటే లక్షల నష్టం తప్పదు.. వెంటనే తీసేయండి!

వానాకాలంలో కారులో ఈ 8 వస్తువులు ఉంటే లక్షల నష్టం తప్పదు.. వెంటనే తీసేయండి!
Advertisement

Monsoon Car Safety: వర్షాకాలంలో చాలా మంది గొడుగు, బ్యాగులు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తో పాటు ఇతర సామగ్రిని కారులోనే వదిలేస్తుంటారు. కానీ, అలా చేయడం వల్ల కొన్నిసార్లు పెద్ద నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఎక్కువ తేమ, వేడి, నీటి చెమ్మ వల్ల కారులో ఉన్న కొన్ని వస్తువులు పాడవడమే కాకుండా, దుర్వాసన, బూజు, బ్యాక్టీరియా లాంటి సమస్యలను తీసుకొస్తాయి. అందుకే వర్షాకాలంలో కొన్ని వస్తువులను కారులో అస్సలు ఉంచకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1.ఎలక్ట్రానిక్ వస్తువులు

కారులో ల్యాప్‌ టా ప్‌లు, కెమెరాలు, టాబ్లెట్లు, పవర్ బ్యాంక్‌ లు లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కారులో ఉంచకండి. తేమ, అధిక ఉష్ణోగ్రతల వల్ల వాటి పనితీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది.

2.ముఖ్యమైన డాక్యుమెంట్స్

Advertisement

అలాగే పాస్‌ పోర్ట్, ఇన్సూరెన్స్ పేపర్లు, సర్టిఫికెట్లు, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లు కూడా కారులో ఉండకూడదు. తేమ కారణంగా కాగితాలు తడిసి ముడతలు పడటం, బూజు పట్టడం, చదవలేని స్థితికి చేరే ప్రమాదం ఉంది.

3.ఫుడ్ ఐటెమ్స్

ఆహార పదార్థాలు కూడా కారులో ఎక్కువసేపు ఉంచడం మంచిది కాదు. ముఖ్యంగా వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటంతో అవి త్వరగా పాడవుతాయి. దుర్వాసన రావడమే కాకుండా చీమలు, ఇతర కీటకాలు కూడా కారులోకి చేరే అవకాశం ఉంటుంది.

4.మెడిసిన్స్

Advertisement

మందులు కూడా కారులో నిల్వ చేయకూడదు. ఇన్సులిన్, ఇన్హేలర్లు, కొన్ని సిరప్‌లు అధిక వేడి, తేమ వల్ల పనితీరును కోల్పోయే అవకాశం ఉంటుంది.

5.బ్యాగులు, పర్సులు

లెదర్ బ్యాగులు, పర్సులు, బెల్టులు, షూ లాంటి తోలు వస్తువులు కూడా తేమను పీల్చుకుని దుర్వాసన రావడం, బూజు పట్టే ప్రమాదం ఉంటుంది.

6.తడి గొడుగు

చాలామంది చేసే మరో పొరపాటు తడి గొడుగును కారులోనే వదిలేయడం. దీనివల్ల కారులో తేమ పెరిగి బూజు, చెడు వాసన ఏర్పడుతుంది. అలాగే తడి బట్టలు, జిమ్ బ్యాగులు కూడా కారులో ఉంచకపోవడం మంచిది. ఇవి బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతాయి.

7.బ్యాటరీతో పని చేసే వస్తువులు

బ్యాటరీతో పనిచేసే వస్తువులు కూడా కారులో ఎక్కువసేపు ఉండకూడదు. వైర్‌ లెస్ ఇయర్‌ బడ్స్, బ్లూటూత్ స్పీకర్లు, ఫ్లాష్‌ లైట్లు లాంటి పరికరాల బ్యాటరీలు వేడి, తేమ వల్ల త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది.

8.పెట్స్ ఫుడ్

పెంపుడు జంతువుల ఆహారం కారులో ఉంచితే అది త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. అంతేకాదు, కీటకాలు, ఎలుకలను ఆకర్షించే అవకాశం ఉంటుంది.

8.ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు

ఇక మొబైల్ ఫోన్లు, ల్యాప్‌ టాప్‌ లు, హ్యాండ్‌ బ్యాగులు, నగలు లాంటివిలువైన వస్తువులను కారులో కనిపించేలా వదిలేయడం అస్సలు మంచిది కాదు. దొంతనాలకు కారణం అవుతాయి.

వర్షాకాలంలో కారును శుభ్రంగా ఉంచాలంటే తడి వస్తువులను వెంటనే బయటకు తీయాలి. కారులో సిలికా జెల్, తేమను పీల్చే పదార్థాలు ఉంచితే తేమ తగ్గుతుంది. వీలైనంత వరకు కప్పు ఉన్న ప్రదేశంలో కారును పార్క్ చేయడం, కిటికీలను పూర్తిగా మూసి ఉంచడం, ఫ్లోర్ మ్యాట్‌ లను తరచూ శుభ్రం చేసి ఆరబెట్టడం కూడా మంచిది. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ కారు లోపలి భాగం శుభ్రంగా ఉండటంతో పాటు, విలువైన వస్తువులు కూడా సురక్షితంగా ఉంటాయి.

Read Also: కార్ కవర్ ఏ కలర్ ఉండాలి? ఎలాంటి మెటీరియల్ తీసుకోవాలి?

Related News

సింగిల్ ఛార్జ్‌ తో 301 కి.మీ రేంజ్.. ఓలా S1Z స్కూటర్ వచ్చేసింది!

ఇండియన్ మార్కెట్‌ను షేక్ చేయబోతున్న 6 కొత్త SUVలు.. లిస్ట్ చూస్తే మతిపోవాల్సిందే!

టాటా పంచ్ EV ఒరిజినల్ రేంజ్ ఎంత? రియల్ టెస్ట్‌ లో షాకింగ్ రిజల్ట్!

మహీంద్రా EVలపై భారీ ఆఫర్.. ఏకంగా రూ.8 లక్షల తగ్గింపు!

జావా 42 FJ లాంచ్.. 6 అదిరిపోయే రంగుల్లో అందుబాటులోకి!

జస్ట్ లక్షకే.. 200 కి.మీ రేంజ్.. ఏథర్ కోనార్క్ వచ్చేసింది!

లాంగ్ రైడర్లకు అదిరిపోయే బైక్.. కవాసకి వెర్సిస్ 650 కొత్త వెర్షన్ వచ్చేసింది!

హ్యుందాయ్ నుంచి ఏకంగా 26 కొత్త కార్లు.. టాప్ 7 మోడళ్లు ఏవో తెలిస్తే మతిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×