E-Paper
Advertisement

CURE Bill: లీకైన తెలంగాణ క్యూర్ బిల్లు సీక్రెట్స్.. ఇకపై మున్సిపాలిటీల్లో నడవని మేయర్ల హవా!

CURE Bill: లీకైన తెలంగాణ క్యూర్ బిల్లు సీక్రెట్స్.. ఇకపై మున్సిపాలిటీల్లో నడవని మేయర్ల హవా!
Advertisement

CURE Bill: స్వేచ్చ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రస్తుతం అమల్లో ఉన్న 1959 మున్సిపల్ చట్టానికి స్వస్తి పలికి, సర్కారు ఇటీవలే క్యూర్ బిల్లును తీసుకువచ్చిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం వెబ్ సైట్ లో ఉన్న ఈ బిల్లుపై ఈ నెల 24వ తేదీ వరకు సర్కారు ప్రజాభిప్రాయాలను సేకరిస్తున్న సంగతి తెల్సిందే. ఈ బిల్లులో పొందుపర్చిన పలు నియమ నిబంధనలను గమనిస్తే కార్పొరేషన్లకు ప్రత్యేకంగా కల్పించాల్సిన పలు హక్కులు, అధికారాలకు సర్కారు కత్తెర పెట్టిందనే చెప్పవచ్చు. అధికారులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహారించుకుండా జవాబుదారిగా వ్యవహారించేలా కఠిన నిబంధనలను పొందుపరిచింది.

ముందు వారిపై చర్యలు..?

ఇప్పటి వరకున్న నిబంధనల ప్రకారం ప్రజలు నేరుగా ఎన్నుకునే కౌన్సిల్ సభ్యులు, సభ్యులు ఎన్నుకునే మేయర్, డిప్యూటీ మేయర్లు ఎలా వ్యవహారించినా, వారి పదవీ కాలానికి ముందు వారిపై చర్యలు తీసుకునేందుకు అనుకూలమైన రూల్స్ లేవు. కానీ కొత్తగా ప్రవేశపెట్టిన క్యూర్ బిల్లు అమల్లోకి వస్తే నేరుగా మున్సిపల్ కార్పొరేషన్ల పాలక మండలిలను రద్దు చేసేలా నిబంధనలను సర్కారు సిద్దం చేసింది. కేవలం ఒక్క ఉత్తర్వుతో కాకుండా కౌన్సిల్ కు ఎగువ సభ అయిన శాసన సభలో బిల్లులాగా ప్రవేశపెట్టి, సభ ఆమోదిస్తే మేయర్, డిప్యూటీ మేయర్లను పదవుల నుంచి తొలగించేలా సర్కారు రూల్స్ తీసుకురానుంది.

ఇష్టారాజ్యంగా నిర్ణయాలు..

Advertisement

పాలక మండలి పరిస్థితి ఇలా ఉంటే కార్పొరేషన్ల కమిషనర్లు సైతం ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోకుండా కట్టడి చేసేలా నిబంధనలు ఈ బిల్లులో తెరపైకి రానున్నాయి. సర్కారు ఆదేశాలను అమలు చేయకుండా పక్కన బెట్టినా, కార్పొరేషన్ నిధులు వృథాగా ఖర్చయ్యేలా నిర్ణయాలు తీసుకున్నా, వారిని బాధ్యులను చేస్తూ కార్పొరేషన్ నుంచి బదిలీ చేసేలా, అవసరమైతే మరింత కఠిన చర్యలు కూడా సిద్దమయ్యేలా క్యూర్ బిల్లులో సెక్షన్ల వారీగా నిబంధనలను పొందుపరిచారు.

Also read: POCSO Monitoring: ఆ ఒక్క తప్పే ఆరు ప్రాణాలను బలితీసుకుందా.. షాబాద్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్!

పైళ్ల చెకింగ్ పవర్..

Advertisement

రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లపై పట్టు బిగించేలా ప్రభుత్వం తన పర్యవేక్షణ, నియంత్రణ అధికారాలను క్యూర్ బిల్లుతో మరింత కఠినతరం చేయనుంది. కార్పొరేషన్ల పరిపాలనను పర్యవేక్షించడంతో పాటు, అవసరమైతే మేయర్లను తొలగించేలా, ఏకంగా కార్పొరేషన్‌నే రద్దు చేసేలా చట్టంలోని నిబంధనలు ప్రభుత్వానికి పూర్తి అధికారాలను కల్పిస్తున్నాయి. క్యూర్ పరిధిలోని మున్సిపల్ వ్యవహారాలపై ప్రభుత్వానికి ప్రత్యేక అధికారాలు కల్పించారు. కార్పొరేషన్, కమిషనర్ వద్ద ఉన్న ఎలాంటి రికార్డులనైనా, తీర్మానాల వివరాలనైనా ప్రభుత్వం ఎప్పుడైనా తెప్పించుకునే ప్రొవిజన్ ను ఈ కొత్తంలో కల్పించారు.

నిబంధనలు మరింత కఠినం

మున్సిపల్ కార్యాలయాలను, విభాగాలను తనిఖీ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించేలా నిబంధన విధించారు. ఈ అధికారికి కార్యాలయాల్లోకి ప్రవేశించే, ఉద్యోగులను విచారించే పూర్తి హక్కుతో పాటు ప్రభుత్వం జారీ చేసే ఆదేశాలను కార్పొరేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలన్న నిబంధనను మరింత కఠినంగా అమలు చేయటంతో పాటు విఫలమైతే, ఆ విధులను ప్రభుత్వమే నేరుగా తన ఆధీనంలోకి తీసుకునేలా బిల్లులో నిబంధనలను పొందుపరిచారు.

అనుమతులను రద్దు..

కార్పొరేషన్ తన విధులను సక్రమంగా నిర్వహించకపోతే ఆ పనులను పూర్తి చేయడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించేలా, ఆ వ్యక్తికి జీతభత్యాలు, ఖర్చులను మున్సిపల్ నిధుల నుంచే డ్రా చేసేలా సర్కారుకు పవర్ రానుంది. కార్పొరేషన్, కమిషనర్ పాస్ చేసిన ఎలాంటి ఆర్డర్లనైనా సర్కారు సమీక్షించేలా బిల్లులో నిబంధనలున్నాయి. చట్టవిరుద్ధంగా, ప్రజాజీవనానికి విఘాతం కలిగించేలా ఉన్నా ఆయా తీర్మానాలను, అనుమతులను రద్దు చేసే పవర్ కూడా సర్కారుకు వచ్చేలా నిబంధనలు ఉన్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్, సభ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేలా క్యూర్ బిల్లులో ప్రొవిజన్ పెట్టారు.

Also Read: Farmer DISCOM: రైతు డిస్కంకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బావుల వద్ద కరెంట్ మీటర్లపై కీలక ప్రకటన!

అలా చేస్తే సస్పెన్షనే..

కౌన్సిల్ సమావేశం జరుగుతున్నపుడు లేదా విధి నిర్వహణలో ఉద్దేశపూర్వకంగా దురుసుగా ప్రవర్తి,చినా, ఆస్తులను ధ్వంసం చేసినా, బూతులు మాట్లాడినా మేయర్, డిప్యూటీ మేయర్, కౌన్సిల్ సభ్యులను ప్రభుత్వం సస్పెండ్ చేసే అతి ముఖ్యమైన పవర్ ఈ బిల్లులో సర్కారుకు సంక్రమించనుంది. చట్టాన్ని ఉల్లంఘించినా, విది నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారించినా, అధికార దుర్వినియోగం చేసినా మేయర్, డిప్యూటీ మేయర్‌ను వివరణ కోరి, అది సంతృప్తి కరంగా లేని పక్షంలో పదవి నుంచి శాశ్వతంగా తొలగించే కీలకమైన పవర్ కూడా సర్కారు పరిధిలోకి రానుంది.

పదవులు కోల్పోయేలా కొత్త బిల్లు..

కార్పొరేష సరిగ్గా పని చేయకపోయినా, ఆర్థికంగా దివాళా తీసినా, పాలన సాగించడం అసాధ్యమని భావిస్తే ప్రభుత్వం తెలంగాణ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా సదరు కార్పొరేషన్‌ను పూర్తిగా రద్దు చేసే వెసులుబాటు కల్పించనున్నారు. ఈ నోటిఫికేషన్‌ను అసెంబ్లీ లో ప్రవేశ పెట్టి, సభ ఆమోదిస్తే కార్పొరేషన్ రద్దయి వెంటనే మేయర్, డిప్యూటీ మేయర్ సహా సభ్యులందరూ పదవులు కోల్పోయేలా కొత్త బిల్లును అధికారులు రూపకల్పన చేశారు. కొత్త పాలకమండలి వచ్చే వరకు పాలనా బాధ్యతలను జిల్లా కలెక్టర్ లేదా ఆర్డీఓ స్థాయి అధికారికి గానీ, ప్రభుత్వం నియమించే అధికారికి అప్పగించేలా నిబంధనలు ఉండనున్నాయి.

కొత్త బిల్లులో..

రద్దయిన ఆరు నెలల లోపు ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించి కొత్త కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలన్న నిబంధన అమల్లోకి రానుంది. జోన్లు, సర్కిళ్ల విభజన విధులను టీఐఐసీకి బదలాయించేలా కొత్త బిల్లులో నిబంధనలు పెట్టారు. పరిపాలనా సౌలభ్యం కోసం వార్డులను సర్కిళ్లుగా డిప్యూటీ కమీషనర్ పరిధిలోకి, అలాగే జోన్లను జోనల్ కమీషనర్ పరిధిలో విభజించే అధికారం ప్రభుత్వానికి సమకూరనుంది. అంతేగాక, మున్సిపల్ కార్పొరేషన్‌కు ఏవైనా అధికారాలను, విధులను తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ( టీఐఐసీ) కు బదలాయించే అధికారం కూడా ప్రభుత్వానికి ఉండేలా నిబంధనలను రూపకల్పన చేశారు. కార్పొరేషన్ పరిధిలోని విధులను అవసరాన్ని బట్టి ఇతర ప్రభుత్వ సంస్థలకు బదిలీ చేసే స్వేచ్ఛ ప్రభుత్వానికి సమకూరనుంది.

Also read: WhatsApp వాడేవారందరూ తప్పక మార్చాల్సిన 10 ముఖ్యమైన సెట్టింగ్స్!

Related News

Road Development: నల్గొండ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్.. రికార్డు స్థాయిలో నిధులు విడుదల!

POCSO Monitoring: ఆ ఒక్క తప్పే ఆరు ప్రాణాలను బలితీసుకుందా.. షాబాద్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్!

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. అపార్ట్‌మెంట్లు ఈ పని చేయకపోతే ఇక ట్యాంకరే దిక్కు!

Substations: వావ్ క్రేజీ ఐడియా.. తొలి దశ సక్సెస్ అయితే సిటీ మొత్తం ఇదే ట్రెండ్..?

షాబాద్ సైకో కథ ఎండ్.. ఎన్‌కౌంటర్‌లో రాజ్‌కుమార్ హతం? దీనివెనుక అసలు నిజమేంటి?

Farmer DISCOM: రైతు డిస్కంకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బావుల వద్ద కరెంట్ మీటర్లపై కీలక ప్రకటన!

Water Tourism: ఇక గోవా వెళ్లక్కర్లేదు.. తెలంగాణలో నీటిపై తేలియాడే రెస్టారెంట్.. ఎక్కడో తెలుసా..!

Big Stories

Advertisement
×