E-Paper
Advertisement

బస్ లోనే టాయిలెట్ సదుపాయం.. ఈ కొత్త వోల్వో లగ్జరీ బస్సు ఒక అద్భుతం!

బస్ లోనే టాయిలెట్ సదుపాయం.. ఈ కొత్త వోల్వో లగ్జరీ బస్సు ఒక అద్భుతం!
Advertisement

Volvo 9600 Coach Unveiled in India: ప్రయాణికుల కోసం మరింత సౌకర్యవంతమైన బస్సులను తీసుకురావడంలో వోల్వో మరో ముందడుగు వేసింది. భారత్ లో తొలిసారిగా ఫ్యాక్టరీలో తయారైన 9600 సీటర్-స్లీపర్ కోచ్ ను కంపెనీ అధికారికంగా ఆవిష్కరించింది. ఇప్పటి వరకు మార్కెట్లో కనిపించిన చాలా సీటర్ స్లీపర్ బస్సులు తర్వాత మార్పులు చేసి రూపొందించబడేవి. కానీ, ఈ కొత్త కోచ్‌ ను పూర్తిగా ఫ్యాక్టరీలోనే ప్రత్యేకంగా తయారు చేశారు. గాంధీనగర్‌లో జరిగిన ప్రవాస్ 5.0 కార్యక్రమంలో ఈ కొత్త కోచ్‌ ను వోల్వో బసెస్ ఇండియా పరిచయం చేసింది. ఇంటర్ సిటీ ప్రయాణాలు, టూరిజం, పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా మార్చే లక్ష్యంతో దీనిని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

మొత్తం 51 మంది ప్రయాణించేలా!

ఈ కోచ్‌లో మొత్తం 51 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ఇందులో 24 అప్పర్ స్లీపర్ బెర్త్‌ లు, మూడు రియర్ లోయర్ బెర్త్‌ లు, 27 ప్రీమియం లోయర్ డెక్ సీట్లు ఉన్నాయి. ప్రయాణికులు తమ అవసరాన్ని బట్టి కూర్చునేలా లేదంటే  పడుకునే సౌకర్యాన్ని పొందేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

అత్యాధునిక సౌకర్యాలు

Advertisement

ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చేందుకు ఇందులో అనేక ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. విశాలమైన లగేజ్ కంపార్ట్‌ మెంట్, ఆన్‌ బోర్డ్ టాయిలెట్, చిన్న కిచెనెట్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, ఆకర్షణీయమైన మూడ్ లైటింగ్, వినోద సదుపాయాలు, అంతేకాదు, ప్రైవసీకి ప్రాధాన్య ఇచ్చే ప్రత్యేక ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఇవి మరింత ఉపయోగపడతాయి.

ఇంజిన్ గురించి..

ఇంజిన్ విషయానికి వస్తే, ఈ కోచ్‌లో 15 మీటర్ల పొడవైన బాడీ, VEDX8 ఇంజిన్, అలాగే I-Shift ట్రాన్స్‌మిషన్ ను అమర్చారు. దీంతో ఇంటర్ సిటీ ప్రయాణాలతో పాటు సుదూర రూట్లలో కూడా మెరుగైన పనితీరు అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.

అత్యాధునిక భద్రతా ఫీచర్లు

Advertisement

భద్రత విషయంలో కూడా వోల్వో రాజీ పడలేదు. ఈ కోచ్‌లో 360 డిగ్రీ కెమెరా, సాధారణ రియర్ వ్యూ మిర్రర్ల స్థానంలో ఎలక్ట్రానిక్ మిర్రర్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, డ్రైవర్ అలసటను గుర్తించే డ్రైవర్ స్టేట్ మానిటరింగ్,  ఆల్కహాల్ ఇంటర్‌ లాక్ సిస్టమ్ లాంటి ఆధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇవి ప్రమాదాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ కోచ్‌ లో ఉన్న టెలిమాటిక్స్ సిస్టమ్ ద్వారా వెహికల్ ఎక్కడ ఉంది? ఎంత వేగంతో వెళ్తోంది? ఫ్యూయల్ ఎంత ఉంది? లాంటి వివరాలను రియల్‌ టైమ్‌ లో తెలుసుకునే అవకాశం ఉంటుంది.

మొత్తంగా సీటింగ్, స్లీపర్ సౌకర్యాలను ఒకే వాహనంలో అందిస్తూ, అధునాతన భద్రతా వ్యవస్థలు, ప్రీమియం ఇంటీరియర్, ఆధునిక టెక్నాలజీతో వచ్చిన వోల్వో 9600 సీటర్ స్లీపర్ కోచ్.. భారత్ లో ప్రీమియం బస్సు ప్రయాణానికి కొత్త ప్రమాణాలను తీసుకురానుందని చెప్పుకోవచ్చు.

Read Also: ట్రావెల్స్‌ కు బెస్ట్ ఛాయిస్.. టాటా 9 సీటర్ లగ్జరీ వెహికల్ కొనేయండి బ్రో!

Related News

సింగిల్ ఛార్జ్‌ తో 301 కి.మీ రేంజ్.. ఓలా S1Z స్కూటర్ వచ్చేసింది!

ఇండియన్ మార్కెట్‌ను షేక్ చేయబోతున్న 6 కొత్త SUVలు.. లిస్ట్ చూస్తే మతిపోవాల్సిందే!

టాటా పంచ్ EV ఒరిజినల్ రేంజ్ ఎంత? రియల్ టెస్ట్‌ లో షాకింగ్ రిజల్ట్!

మహీంద్రా EVలపై భారీ ఆఫర్.. ఏకంగా రూ.8 లక్షల తగ్గింపు!

జావా 42 FJ లాంచ్.. 6 అదిరిపోయే రంగుల్లో అందుబాటులోకి!

జస్ట్ లక్షకే.. 200 కి.మీ రేంజ్.. ఏథర్ కోనార్క్ వచ్చేసింది!

లాంగ్ రైడర్లకు అదిరిపోయే బైక్.. కవాసకి వెర్సిస్ 650 కొత్త వెర్షన్ వచ్చేసింది!

హ్యుందాయ్ నుంచి ఏకంగా 26 కొత్త కార్లు.. టాప్ 7 మోడళ్లు ఏవో తెలిస్తే మతిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×