E-Paper
Advertisement

పుస్తకాలు-నోట్‌బుక్‌ల్లో ఖాళీ అంచులు ఎందుకు? ఆ కారణం తెలుస్తే షాక్ కావాల్సిందే

పుస్తకాలు-నోట్‌బుక్‌ల్లో ఖాళీ అంచులు ఎందుకు? ఆ కారణం తెలుస్తే షాక్ కావాల్సిందే
Advertisement

Note Books: పూర్వం నుంచి వస్తున్న ఆచారాలకు ఓ లెక్క ఉంటుంది.. దాని వెనుక చెడు కంటే మంచి ఎక్కువగా ఉంటుంది.  వాటి గురించి తెలియని నేటి తరం యువతీయువకులు రకరకాల ప్రశ్నలు సంధిస్తారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో పాపులర్ అవుతారు. దాని గురించి వెతికితే  అసలు రీజన్ అర్థమవుతుంది.

పుస్తకాలు-నోట్‌బుక్‌ల్లో మార్జిన్లు ఎందుకు ఉంచుతారు? పాఠశాల పుస్తకాలు, నోట్‌బుక్‌లు, వాటి అంచున ఎరుపు లేదా నీలం గీతలు ఉంటాయి. గుర్తించిన ఖాళీ స్థలాన్ని మనం చూశాం. ఒక్కమాటలో చెప్పాలంటే మార్జిన్ అని ముద్దుగా పిలుస్తాము. చిన్న పుస్తకం అయినా పెద్ద పుస్తకం అయినా మార్జిన్ కచ్చితంగా ఉంటుంది. ఇక నోట్‌బుక్‌ల విషయంలో కొంతభాగం ఖాళీగా వదిలేయడం వల్ల వృధా అవుతుందని తరచుగా ఆశ్చర్యపోతాము.

Advertisement

కేవలం పేజీలను అందంగా ఉంచడానికి కాదు.. ఉపాధ్యాయులు ఎర్ర పెన్నుతో దిద్దడానికి స్థలం ఉంచడం కోసం అస్సలు కాదు. దీనివల్ల ఖాళీ ఉంచుతామని మనలో చాలామంది చిన్నప్పటి నుండి నమ్ముతూ వచ్చారు. అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు. అసలు నిజం తెలిస్తే చాలా ఆసక్తికరం, ఆశ్చర్యకరంగా ఉంటుంది.

అసలు విషయం తెలిస్తే షాక్ తప్పదు-పుస్తకాల్లో మార్జిన్లు వదిలివేసే  సంప్రదాయం కొత్తదేమీ కాదు. చాలా శాతాబ్దాల కిందట మొదలైంది. ఆ మార్జిన్లకు ఎలుకలు-చెద పురుగులు- కీటకాలతో ప్రత్యక్ష సంబంధం ఉందని తెలిస్తే నవ్వొస్తుంది. పాత రోజుల్లో  భద్రమైన ఇనుప అరలు, కంప్యూటర్లు, క్లౌడ్ స్టోరేజ్ లేకుంటే డిజిటల్ డేటా ఉండేవి కావు. ఆ రోజుల్లో కాగితాలను ఏళ్ల తరబడి భద్రంగా ఉంచడం పెద్ద సవాల్.

Advertisement

ఎందుకంటే ఎలుకలు, చెద పురుగులకు పుస్తకాలను అంచుల నుండి కొరకడం వాటికి సాధారణ అలవాటు. ఈ లెక్కన కాగితంపై అంచు నుండి అంచు వరకు రాస్తే ఏమవుతుందో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఎలుకలు, చెద పురుగులు  పుస్తకాల పేజీలు, రాసిన కీలక సమాచారాన్ని శాశ్వతంగా నాశనం చేస్తాయి.

ఆనాటి నుంచి నేటికీ ఇదే సంప్రదాయం- ఆ సమస్యను నివారించడానికి అద్భుతమైన పద్దతిని తీసుకొచ్చారు. ఆ నేపథ్యంలో పుస్తకాల పేజీలను కాపాడటానికి అంచుల వద్ద ఖాళీ స్థలం లేదా మార్జిన్లను వదిలివేయాలని నిర్ణయించారు. దీనివల్ల అతిపెద్ద ప్రయోజనం కలిగింది. ఎలుకలు, కీటకాలు అంచులను కొరికినా మధ్యలో రాసిన ముఖ్యమైన సమాచారం సురక్షితంగా ఉండేది.

పుస్తకాల్లో ఖాళీ స్థలం పదాలకు ఒక రక్షణ కవచంలా పని చేసేది. ఎలుకలు సమస్య  మాత్రమే కాదు, కాలక్రమేణా పేజీలు పాడైపోవడం మరొక ప్రధాన కారణం. ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల పేజీలు అంచుల వద్ద చిరిగిపోతాయి.  తేమ కారణంగా వంకరగా మారతాయి. పుస్తకాన్ని బైండింగ్ చేసినప్పుడు కాగితం అంచుల్లో గణనీయమైన భాగం లోపలికి పోతుంది.

ALSO READ: మేకప్ పైనే సన్‌స్క్రీన్ ఎలా అప్లై చేయాలి? ఈ టిప్స్ పాటిస్తే బేస్ చెడిపోదు

మార్జిన్లు లేకపోతే రాసిన అక్షరాలు బైండింగ్ వెనుక కనపించకుండా పోతాయి. చదవడానికి అసాధ్యంగా ఉంటాయి.  మార్జిన్లు ఈ సమస్యలను సులభంగా పరిష్కరించి చదివే అనుభవాన్ని మెరుగుపరిచాయి. ఈ నేపథ్యంలో ఇళ్లు, ఆఫీసుల్లో ఎలుకలు  పుస్తకాలను కొరకినా లేకపోయినా మార్జిన్లు ఖాళీ వదిలే పాత పద్ధతి అలవాటుగా మారింది.

పుస్తకాల ముద్రణలో అంతర్భాగంగా మారిపోయింది. మార్జిన్లు ఆ రోజుల్లో చాలా ఉపయోగకరంగా ఉండేవి. ఉపాధ్యాయులు మార్కులు ఇవ్వడానికి, కామెంట్స్ రాయడానికి వాటిని ఉపయోగిస్తారు. అంతేకాకుండా మార్జిన్ల వల్ల మన చేతిరాత అందంగా కనిపించేలా చేస్తాయి కూడా. అదీ మార్జిన్ల వెనుక అసలు కథ.

Related News

నచ్చిన ఆహారం తింటూ.. కిలో బరువు తగ్గాలంటే.. రోజుకు ఎన్ని అడుగులు నడవాలి?

గుంటూరు స్పెషల్ కోవా పూరీ..ఇంట్లోనే ఇలా చేస్తే స్వీట్ షాప్ టేస్ట్!

వంకాయ నువ్వుల రోటి పచ్చడి..ఈ స్టైల్‌లో చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ!

పర్ఫెక్ట్ రాయలసీమ స్టైల్ ఉగ్గాని..ఒక్కసారి తింటే వదిలిపెట్టరు!

రొమ్ము క్యాన్సర్ ఈ దశకు చేరితే ఏం జరుగుతుంది? ప్రతి మహిళ తెలుసుకోవాల్సిందే!

నోటికి కారంగా, సూపర్ టేస్టీగా ఆలూ పచ్చి కారం ఫ్రై!

నెల రోజులపాటు నిల్వ ఉండే రవ్వ లడ్డు..క్షణాల్లోనే చేయండిలా!

సేమియా ఉప్మా బోర్ కొట్టిందా? ఇలా ఎగ్ సేమియా ట్రై చేయండి!

Big Stories

Advertisement
×