Green Tea For Diabetes: గ్రీన్ టీ యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిస్తే.. ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఇది అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రభావవంతమైన యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. గ్రీన్ టీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. మధుమేహం ఉన్న వారికి గ్రీన్ టీ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
డయాబెటిస్ అనేది అన్ని వయస్సుల వారికి వచ్చే తీవ్రమైన ఆరోగ్య సమస్య. పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ దీని బాధితులుగా మారుతున్నారు. అందుకే డయాబెటిస్ అదుపులో ఉంచడానికి, లైష్ స్టైల్ తో పాటు తినే ఆహారం రెండింటినీ మెరుగుపరచడం అవసరం.
చక్కెరను అదుపులో ఉంచుకోవాలంటే గ్లైసెమిక్ ఇండెక్స్ 55 కంటే తక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. వీటిని తినడం వల్ల చక్కెర వేగంగా పెరిగే ప్రమాదం ఉండదు.
కొన్ని అధ్యయనాలు క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి పెరుగుదలను నివారించడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని సూచిస్తున్నాయి.
గ్రీన్ టీ ప్రయోజనాలు:
గ్రీన్ టీ కేవలం రిఫ్రెషింగ్ డ్రింక్ మాత్రమే కాదు.. ఇది వ్యాధుల నుండి మిమ్మల్ని సురక్షితంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, అంతే కాకుండా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి గ్రీన్ టీ ఉపయోగపడుతుందని పరిశోధకులు కనుగొన్నారు.
గ్రీన్ టీలో కాటెచిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది గ్లూకోజ్‌ను గ్రహించే కణాల సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా రక్తంలో చక్కెరను సమర్థవంతంగా నియంత్రించడంలో సహాయపడుతుంది.
డయాబెటిస్ ఉన్న వారు గ్రీన్ టీ తాగితే.. కలిగే ప్రయోజనాలు:
గ్రీన్ టీని తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్‌ను నివారించబడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీనిని క్రమం తప్పకుండా తాగే వారికి డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా తక్కువగా ఉంది.
గ్రీన్ టీ ఇన్సులిన్ కార్యకలాపాలను పెంచడంలో సహాయపడుతుందని, అలాగే ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుందని ఓ పరిశోధనలో రుజువైంది.
Also Read: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా ? అయితే డిప్రెషన్‌లో ఉన్నట్లే !
కొన్ని అధ్యయనాల ప్రకారం.. రోజూ రెండు నుండి మూడు కప్పుల గ్రీన్ టీ తాగేవారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 19% తక్కువగా ఉంటుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఉపవాసం ఉన్న సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇది కంటి సమస్యలు, గుండె సమస్యలు, నరాల సమస్యలు వంటి మధుమేహం వల్ల కలిగే ఇతర సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
డయాబెటిస్ నిర్వహణలో బరువు నియంత్రణ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గ్రీన్ టీ జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గడానికి కూడా మీకు సహాయపడుతుంది. గ్రీన్ టీ రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తుంది. అందుకే డయాబెటిస్ పేషెంట్లు గ్రీన్ టీ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.