Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ (Peddi) మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నెక్స్ట్ మూవీ ఏంటి అన్న విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది. అయితే గత కొన్ని రోజుల నుంచి ఆయన ఓ బాలీవుడ్ బడా డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. కానీ తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఓ స్టార్ హీరోని తప్పించి, మెగా ప్రాజెక్ట్ చేజిక్కించుకున్నాడని, ఆ సినిమాపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుందని ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటి? ఏ హీరోను తప్పించి రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్ సొంతం చేసుకున్నారు? అనే వివరాల్లోకి వెళితే…
స్టార్ హీరో ప్రాజెక్ట్ చెర్రీ చేతికి…
సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ తో అనుకున్న ప్రాజెక్ట్ మరో హీరో చేతికి వెళ్లడం అన్నది పెద్ద విషయం ఏమీ కాదు. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. డేట్స్ లేకపోవడం, లేదా ఒక హీరోకు నచ్చని కథ మరో హీరోకి నచ్చడం వంటివి జరగడం ఇక్కడ కామన్. అయితే తాజాగా ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రామ్ చరణ్ చేతికి చిక్కింది అని ఫిలిం నగర్ సర్కిల్స్ లో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ని ముందుగానే ఓ స్టార్ హీరోతో కొంతకాలం క్రితం అనౌన్స్ చేశారు. ఆ హీరో కూడా టైర్ వన్ హీరో కావడం గమనార్హం.
అలాంటిది ఓ టాప్ హీరోని పక్కన పెట్టి, రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్ దక్కించుకున్నాడు అనే వార్త వైరల్ అవుతుంది. అయితే ఆ స్టార్ హీరో వదిలేస్తే ఈ సినిమా చెర్రీ దగ్గరకు చేరిందా? లేదంటే మేకర్స్ ఆ హీరోని పక్కన పెట్టి చరణ్ దగ్గరకు వచ్చారా? అనేది చర్చకు దారి తీసింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయని, ఒకవేళ ఈ మెగా ప్రాజెక్టు గానీ అనుకున్నట్టుగా పట్టాలెక్కితే రామ్ చరణ్ కెరియర్ లోనే ఓ మాసివ్ ప్రాజెక్ట్ అవుతుందని అంటున్నారు. దీంతో ఎలాగైనా సరే ఈ ప్రాజెక్టు ఓకే కావాలని మెగా ఫాన్స్ కోరుకుంటున్నారు.
Read Also : ఐకానిక్ సాంగ్ కు ఆ బూతు స్టెప్పులేంట్రా… సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు?
ఇదిలా ఉండగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ వంటి ఆస్కార్ విన్నింగ్ మూవీ తర్వాత ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ని నిరాశపరిచి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. చెర్రీ త్వరగానే ఈ మూవీ ఫలితాన్ని పక్కన పెట్టేసి, తన నెక్స్ట్ మూవీపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఆయన ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బాక్డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.