BigTV English

Homemade Face Pack: ముఖంపై మచ్చలు తొలగించే ఫేస్ ప్యాక్ ఇదే !

Homemade Face Pack: ముఖంపై మచ్చలు తొలగించే ఫేస్ ప్యాక్  ఇదే !

Homemade Face Pack: అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటాడు. ఈ క్రమంలోనే ముఖంపై ఏ చిన్న సమస్య వచ్చినా భయపడిపోతుంటారు. ముఖంపై మొటిమలు, మచ్చలు వస్తే చాలు వాటిని నయం చేసుకునేందుకు రకరకాల ఫేస్ క్రీములను వాడుతుంటారు. అంతే కాకుండా చర్మంపై వచ్చిన మొటిమలు తగ్గిపోవాలని కొందరు వైద్యులను కూడా సంప్రదిస్తుంటారు.


కొంత మందికి ముఖంపై నల్లటి మచ్చలు ఎక్కువగా వస్తుంటాయి. వాటిని తగ్గించుకునేందుకు హొం మేడ్ ఫేస్ ప్యాక్ వాడటం వల్ల  మంచి ఫలితాలు ఉంటాయి. ఈ ఫేస్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కలబంద:
అలోయిన్ అనే పదార్థం కలబందలో ఎక్కువగా ఉంటుంది. ఇది మంగు మచ్చలను తగ్గిస్తుంది. రాత్రి పడుకునే ముందు మచ్చలు ఉన్న చోట కలబందను రాస్తే మచ్చలు క్రమంగా తగ్గుతాయి. రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగి కలబందను రాస్తే మచ్చలు తొలగిపోతాయి. అంతే కాకుండా ముఖం నిగారింపు సంతరించుకుంటుంది.


యాపిల్ సిడర్ వెనిగర్:

యాపిల్ సిడర్ వెనిగర్ , నీరు సమపాళ్లలో తీసుకొని ఈ మిశ్రమాన్ని దూదితో మచ్చలు ఉన్న ప్రదేశంలో రుద్దాలి. రెండు మూడు నిమిషాల తర్వాత దీనిని గోరువెచ్చ నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే సమస్య తగ్గుతుంది.

ఉల్లిపాయ:
ఎర్ర ఉల్లిపాయ రసాన్ని మంగు మచ్చలు ఉన్న చోట రాస్తే మచ్చలు తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మచ్చలపై దీనిని అప్లై చేసుకుని కొద్దిసేపటి తర్వాత క్లీన్ చేసుకుంటే కొద్దిరోజుల్లోనే సమస్య తొలగిపోతుంది.

పాలు:
పాలలో కాటన్‌ను ముంచి మంగు మచ్చలు ఉన్న చోట రుద్దుకోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే సమస్య తగ్గుముఖం పడుతుంది. లాక్టిక్ ఆమ్లం వల్ల మచ్చలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఫేస్ ప్యాక్ కోసం  కావలసినవి:
కలబంద- 1 టేబుల్ స్పూన్
రోజ్ వాటర్ – రెండు టేబుల్ స్పూన్లు
నిమ్మ రసం- 1/2 స్పూన్

Also Read: నెయ్యితో మీ అందం రెట్టింపు అవడం పక్కా !

ఫేస్ ప్యాక్ తయారీ:
మంగు మచ్చలు తొలగించేందుకు ఈ ఫేస్ ప్యాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇందుకోసం ముందుగా ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జుని తీసుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ ఇందులో కలుపుకోవాలి. ఈ మూడింటిని మిక్స్ చేసి మచ్చలున్న చోట అప్లై చేసి పది నిమిషాల ద్వారా తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల ముఖంపై మచ్చలు తొలిగిపోతాయి. అంతే కాకుండా చర్మం నిగారిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ వల్ల  ముఖంపై ఉన్న జిడ్డు తొలగిపోతుంది. ఫలితంగా  ముఖం తాజాగా కాంతివంతంగా కనిపిస్తుంది.

బయట దొరికే ఫేస్ ప్రొడక్ట్స్ వాడే బుదులుగా ఇంట్లోనే  ఇలాంటి ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకుని వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంతే కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×