BigTV English

HDL-Dementia : గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైనా ముప్పే!

HDL-Dementia : గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైనా ముప్పే!
HDL-Dementia

HDL-Dementia : లివర్ ఆరోగ్యాన్ని కాపాడేందుకు, గుండె వ్యాధుల ముప్పును తగ్గించేందుకు గుడ్ కొలెస్ట్రాల్ అవసరం.దీనినే హెచ్‌డీఎల్-సీ (హై డెన్సిటీ లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్)గా వ్యవహరిస్తాం. శరీరంలో దీని మోతాదు మించినా ప్రమాదమే. ఇది నిర్దేశిత పరిమాణాన్ని మించితే డెమెన్షియా ముప్పు తప్పదని మోనాష్ యూనివర్సిటీ అధ్యయనం హెచ్చరిస్తోంది.


ఆహారంతో సంబంధం లేకుండా శరీరంలో హెచ్‌డీఎల్-సీ అత్యధికంగా పెరిగితే ముంచుకొస్తున్న ప్రమాదానికి ఓ హెచ్చరికగా భావించాలి. అది మన జీవక్రియలో రానున్నమార్పులకు సంకేతం. డిమెన్షియా వచ్చే ముప్పు 27% అధికంగా ఉన్నట్టు భావించాలి.

హెచ్‌డీఎల్-సీ స్థాయులు అధికంగా ఉన్న వారిపై చేసిన పరిశోధనల్లో.. 6.3 ఏళ్లలో వారు డిమెన్షియా బారిన పడే అవకాశాలు 27% అధికంగా ఉన్నట్టు వెల్లడైంది. 75 ఏళ్ల వయసు, ఆపై పడిన వారిలో హెచ్‌డీఎల్-సీ అధికమైతే డిమెన్షియా రిస్క్ 42% అధికమని అర్థం.


హెచ్‌డీఎల్-సీ స్థాయి 40 – 60 mg/dL మేర ఉంటే ఆరోగ్యానికి మంచిది. దీనిని దాటి 80 mg/dL స్థాయికి చేరితే మాత్రం డిమెన్షియా ముప్పు 27% అధికమవుతుంది. అందుకే వృద్ధాప్యంలో హెచ్‌డీఎల్-సీ నిర్దేశిత స్థాయులను దాటకుండా జాగ్రత్త వహించాలి.

Related News

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×