Glow Skin In One Day: ప్రతి ఒక్కరూ మెరిసే, అందమైన చర్మాన్ని కోరుకుంటారు. దీనిని సాధించడానికి.. కొంత మంది స్కిన్ కేర్ ఫాలో అవుతారు. మరికొందరేమో ఖరీదైన ఫేస్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు. ఇంకొందరేమో పార్లర్లకు పరుగులు పెడతారు. కానీ కొన్ని పార్లు పార్టీలకు, ఫంక్షన్లకు హాజరు కావాల్సి వచ్చి ఫేషియల్స్‌కు వెళ్ళడానికి సమయం లేకపోతే ఏమి చేయాలి? అనే సందేహం కలుగుతుంది. ఇలాంటి సమయంలో మీరు ఇంట్లో అందుబాటులో ఉన్న పదార్థాలను ఉపయోగించి ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు. ఇవి మీ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అంతే కాకుండా తక్కువ సమయంలోనే గ్లోయింగ్ స్కిన్ అందిస్తాయి. ఇంతకీ గ్లోయింగ్ స్కిన్ కోసం ఎలాంటి ఫేస్ ప్యాక్స్ ఇంట్లోనే తయారు చేసుకుని వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హోం మేడ్ ఫేస్ ప్యాక్స్:
1. శనగపిండి, పెరుగుతో ఫేస్ ప్యాక్:
కావాల్సిన పదార్థాలు:
శనగపిండి- 2 టేబుల్ స్పూన్లు
పెరుగు- తగినంత
పసుపు- చిటికెడు
తయారీ విధానం: ఈ ప్యాక్ తయారు చేయడానికి.. 2 టీస్పూన్ల శనగపిండిని తగినంత పెరుగు, చిటికెడు పసుపుతో కలపండి. వీటిని బాగా కలిపి మీ ముఖానికి 15 నుంచి 20 నిమిషాలు అప్లై చేయండి. తరువాత.. చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. మీ ముఖం తక్షణమే తాజాగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. తరచుగా ఇలా చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
2. ముల్తానీ మిట్టి , రోజ్ వాటర్‌తో ఫేస్ ప్యాక్:
కావాల్సిన పదార్థాలు:
ముల్తానీ మిట్టి- 2 టీస్పూన్లు
రోజ్ వాటర్- 2 టీస్పూన్లు
తయారీ విధానం: ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి.. మీకు 2 టీస్పూన్ల ముల్తానీ మిట్టి, 2 టీస్పూన్ల రోజ్ వాటర్ అవసరం. వీటిని చెప్పిన మోతాదులో తీసుకుని నునుపుగా పేస్ట్ లాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి 10 నుంచి 15 నిమిషాలు అప్లై చేసి.. తర్వాత శుభ్రం చేసుకోండి. దీనిని వాడటం వల్ల చర్మం మృదువుగా , మెరిసేలా కనిపిస్తుంది. అంతే కాకుండా ఇది గ్లోయింగ్ స్కిన్ కోసం కూడా అద్భుతంగా పని చేస్తుంది. ముల్తానీ మిట్టి మీ చర్మానికి చాలా ప్రయోజనకరమైన సహజ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. దీంతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని చల్లబరుస్తుంది. అంతే కాకుండా రిఫ్రెష్‌గా చేస్తుంది. ఇది మొటిమలు, ముడతలు, పిగ్మెంటేషన్‌ను కూడా తగ్గిస్తుంది.
Also Read: ఆరోగ్యానికి మంచివని బాదం ఎక్కువగా తింటున్నారా ? ఈ సమస్యలు తప్పవు !
3. కలబంద, నిమ్మరసంతో ఫేస్ ప్యాక్:
కావాల్సిన పదార్థాలు:
కలబంద- 3 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం- తగినంత
తయారీ విధానం:
ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి పైన తెలిపిన మోతాదుల్లో కలబంద జెల్‌ను, నిమ్మరసంతో కలపండి. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి. ఇది మీ చర్మానికి తక్షణ మెరుపు, తాజా రూపాన్ని ఇస్తుంది. కలబంద చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ లో వాడే నిమ్మరసం మచ్చలను తగ్గిస్తుంది. ఈ ఫేస్ తరచుగా వాడటం వల్ల ముఖం చాలా అందంగా కనిపిస్తుంది.