DVV Danayya : ఇండస్ట్రీకి మరో నిర్మాత దూరం కాబోతున్నాడా..? అంటే ఈ మధ్య టాలీవుడ్‌లో జరిగిన కొన్ని పరిణామాలను చూస్తే అవును అనే సమాధానం వస్తుంది. సినిమాలకు దూరం కాబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్న నిర్మాత ఎవరో కాదు… పవన్ కళ్యాణ్‌తో ఈ మధ్య ఓజీ సినిమాను నిర్మించిన డీవీవీ దానయ్య. 300 కోట్ల కలెక్షన్లు, 2025లో హైయెస్ట్ కలెక్షన్లు తెచ్చిపెట్టిన ఓజీ తర్వాత ఈయనపై ఇలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం…
డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్… డీవీవీ దానయ్య బ్యానర్ ఇది. ఈ బ్యానర్‌లో చివరగా వచ్చిన మూడు సినిమాలు అంటే… ఆర్ఆర్ఆర్ (1,350 కోట్ల కలెక్షన్లు), సరిపోదా శనివారం (100 కోట్ల కలెక్షన్లు), ఓజీ (300 కోట్ల కలెక్షన్లు).
మూడు సినిమాల కలెక్షన్లు నెంబర్స్ చూస్తే భారీగానే కనిపిస్తున్నాయి. అయినా… డీవీవీ దానయ్య కొన్ని రోజుల పాటు సినిమా నిర్మాణ రంగానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారట. ఇది నిజమే కాదో.. కానీ, ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
అందులోనూ… ఓజీ సినిమా తర్వాత డీవీవీ దానయ్య ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతుంది. ఓజీ సినిమాకు నిజానికి మిక్సిడ్ టాక్ వచ్చింది. అయినా… పవన్ కళ్యాణ్ క్రేజ్ వల్ల 300 కోట్ల క్లబ్‌లో ఈ మూవీ చేరిపోయింది. అయితే, ఈ సినిమాకు కొన్ని ఏరియాల్లో నష్టాలు వచ్చాయని అంటున్నారు. దీని గురించి నిర్మాతకు బయ్యర్లు కాల్ చేయడానికి ప్రయత్నిస్తే, తమ ఫోన్ కాల్స్‌కు రెస్పాండ్ అవ్వడం లేదు అని బయర్లు అంటున్నారట.
ఓజీ మూవీని తెరకెక్కించడానికి భారీగానే ఖర్చు అయినట్టు తెలుస్తుంది. సినిమా నిర్మాణం కోసం దానయ్య పెట్టిన డబ్బు… డిజిటల్, థియేట్రికల్ బిజినెస్ వల్ల రాలేదు అని కూడా అంటున్నారు.
ఏమైందో తెలీదు కానీ, దానయ్య సినిమాలకు దూరం అవ్వడం అనే వార్త బయటికి వచ్చిన తర్వాత… అందరూ పవన్ కళ్యాణ్ వల్లే ఇలా జరిగింది అంటూ కామెంట్స్ అయితే చేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్… హరి హర వీరమల్లు సినిమా చేశాడు. ఆ సినిమాను ఎఏం రత్నం నిర్మించాడు. ఈ వీరమల్లు తర్వాత రత్నం కూడా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు దానయ్యకు కూడా అలాంటి పరిస్థితి రావడంతో.. పవన్ కళ్యాణ్‌నే బ్లేమ్ చేస్తున్నారు కొంతమంది.
దానయ్య సినిమాలకు దూరం అయ్యాడే అనే వార్తలు స్టార్ట్ అయింది… నాని – సుజీత్ మూవీ నుంచే. ఓజీ తర్వాత డైరెక్టర్ సుజీత్ తన తర్వాత సినిమా నానితో ఉంటుందని ప్రకటించాడు. దీనికి నిర్మాత డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్. ఈ నిర్మాతలు కూడా నాని – సుజీత్ మూవీపై అప్పట్లో కామెంట్స్ చేశారు.
అయితే, సడన్‌గా ఈ మూవీ వేరే నిర్మాతల చేతికి వెళ్లిపోయింది. అది కూడా ఓజీ తర్వాత. అంటే దానయ్య సినిమాలన్నీ వదిలేశాడా.? అనే టాక్ వచ్చేసింది. అయితే దీనిపై డీవీవీ టీం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. ఏదైనా ప్రకటన వస్తే, అప్పుడు అందరికీ ఓ క్లారిటీ రావొచ్చు.