BigTV English

Bullet Train: రైల్లో హైటెక్ వాష్ రూమ్, ఫైవ్ స్టార్ హోటల్లోనూ ఇలా ఉండదండీ బాబూ!

Bullet Train:  రైల్లో హైటెక్ వాష్ రూమ్, ఫైవ్ స్టార్ హోటల్లోనూ ఇలా ఉండదండీ బాబూ!

Bullet Train Washrooms:

రైళ్లలో వాష్ రూమ్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాలో ఇప్పుడిప్పుడే కాస్త మార్పు వస్తుంది. గతంలో అత్యంత మురికిగా ఉండేవి. భరించలేనంత కంపు కొట్టేవి. అందులోకి వెళ్లాలంటేనే చాలా మంది భయపడేవారు. కానీ, గత దశాబ్ద కాలంగా రైళ్లలో పరిశుభ్రత పెరిగింది. రైల్వే కోచ్ ల నుంచి వాష్ రూమ్స్ వరకు నీట్ నెస్ మెయింటెన్ చేస్తోంది ఇండియన్ రైల్వే. ఇక అత్యాధునిక వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత మరింత పరిశుభ్రమైన వాష్ రూమ్స్ ప్రయాణీకులకు అందుబాటులోకి ఉన్నాయి. కొన్ని రైళ్లలో సెన్సార్ ఆధారిత వాష్ రూమ్ లను ఇన్ స్టాల్ చేయిస్తోంది ఇండియన్ రైల్వే.


జపనీస్ బుల్లెట్ రైల్లో వాష్ రూమ్ ఎలా ఉంటుందంటే?

ఇక తాజాగా జపనీస్ బుల్లెట్ రైలులో ప్రయాణించిన ఓ ఇండియన్ ట్రావెలర్.. అందులోని వాష్ రూమ్ ను నెటిజన్లకు చూపించే ప్రయత్నం చేశాడు. అత్యాధునిక సాంకేతికతతో అత్యంత లగ్జరీగా ఆకట్టుకుంటుంది. ఇంకా చెప్పాలంటే ఫైవ్ స్టార్ హోటళ్లలో కూడా ఇంత చక్కటి వాష్ రూమ్ ఉండదేమో అనిపించేలా ఉంది.

హైటెక్ ఫీచర్లు.. అద్భుతమైన డిజైన్..

జపాన్ బుల్లెట్ రైలులోని వాష్ రూమ్ లు  ఆధునిక ఫీచర్లు, హై ఎండ్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. చక్కటి లైటింగ్ తో కూడిన విశాలమైన వాష్ రూమ్ లు ఆకట్టుకుంటున్నాయి.  ప్రయాణీకుడు రెస్ట్‌ రూమ్‌ లోకి ప్రవేశించడంతో వీడియో ప్రారంభమవుతుంది. వాష్‌ రూమ్‌ లో ఎలక్ట్రానిక్ బిడెట్ ఫంక్షన్లు,  హీట్ సీట్లు, ఇన్ బిల్ట్ ఎయిర్ డ్రైయర్లతో వెస్ట్రన్ మోడల్ టాయిలెట్లు ఉన్నాయి. ప్రత్యేక సింక్ ప్రాంతంలో సోప్ డిస్పెన్సర్లు, హ్యాండ్ డ్రైయర్లు, నిలువెత్తు అద్దం ఉన్నది. పూర్తి సెన్సార్స్ తో కూడిన వాష్ రూమ్ అత్యంత పరిశుభ్రంగా, ప్రయాణీకులకు ఆహ్లాదాన్ని కలిగించేలా ఉంది. ఈ వాష్ రూమ్  యాక్సెసిబిలిటీని మరింత పెంచేలా ఆటోమేటిక్ డోర్లతో అమర్చబడి ఉన్నాయి. వాష్ రూమ్ పరిసరాలు కూడా ఎంతో పరిశుభ్రంగా కనిపిస్తున్ననాయి. జపాన్ ప్రజా రవాణా మౌలిక సదుపాయాలలో ప్రపంచ అగ్రగామిగా ఎందుకు ఉందో ఈ రైల్లోని వాష్ రూమ్ చూస్తే అర్థం అవుతుంది.


Read Also: లక్నో నుంచి ముంబైకి జస్ట్ 12 గంటల్లోనే.. వచ్చేస్తోంది వందే భారత్ స్లీపర్!

నెటిజన్లు ఏం చెప్తున్నారంటే?

తాజాగా జపాన్ బుల్లెట్ రైలు వాష్ రూమ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. జపాన్ రైల్వే వ్యవస్థపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కొంత మంది భారతీయ రైల్వే టాయిలెట్స్ తో కంపార్ చేస్తున్నారు. ఇండియాలో ఇలాంటి వాష్ రూమ్స్ రావడానికి మరో 5 నుంచి 10 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉందన్నారు. వాష్ రూమ్స్ అంద్భుతంగా ఉండగానే సరిపోదు. వాటిని ప్రయాణీకులు కూడా అత్యంత జాత్రగా వాడాలి. అప్పుడే ఇలా ఉంటాయని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు.

Read Also: మ్యాజిక్ మేఘాలయా టూర్.. IRCTC అదిరిపోయే ప్యాకేజ్, అస్సలు మిస్ అవ్వద్దు!

Related News

Passport Check: ఆ దేశంలో కేవలం 8 సెకన్లలోనే పాస్‌ పోర్ట్ చెకింగ్ కంప్లీట్.. అదెలా సాధ్యం?

Falaknuma Express: మిర్యాలగూడలో ఆగిపోయిన ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్, కారణం ఏంటంటే?

Vande Bharat Train: లక్నో నుంచి ముంబైకి జస్ట్ 12 గంటల్లోనే.. వచ్చేస్తోంది వందే భారత్ స్లీపర్!

Trains Cancelled: కుండపోత వర్షాలతో పలు రైళ్లు రద్దు.. మీ రైళ్లు ఉన్నాయేమో చెక్ చేసుకోండి!

IRCTC Tour Package: మ్యాజిక్ మేఘాలయా టూర్.. IRCTC అదిరిపోయే ప్యాకేజ్, అస్సలు మిస్ అవ్వద్దు!

Tatkal Booking: ఈ 5 చిట్కాలు పాటిస్తే.. సెకన్లలో వ్యవధిలో తాత్కాల్ టికెట్ బుక్ చేసుకోవచ్చు!

Russia – Ukraine: డ్రోన్ దాడులతో విరుచుకుపడ్డ రష్యా, ముక్కలు ముక్కలైన ఉక్రెయిన్ ప్యాసింజర్ రైలు!

Big Stories

×