సెటిరిజిన్ అనేది అలెర్జీలను తగ్గించడంలో ఉపయోగపడే ముఖ్యమైన ఔషధం. దీనిని మెడికల్ షాపులలో చాలా మంది ఈజీగా గుర్తు పడుతారు. తుమ్ములు, కళ్ళ దురద, దద్దుర్లు, చర్మం మీద దురద రావడం లాంటి సమస్యను తగ్గించడంలో ఈ మెడిసిన్ సాయపడుతుంది. ఇంతకీ సెటిరిజిన్ అంటే ఏంటి? దీన్ని ఎవరు వాడాలి? ఎలా పని చేస్తుంది? దీని వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం…
సెటిరిజిన్ అనేది యాంటిహిస్టామైన్ అని పిలువబడే ఒక రకమైన ఔషధం. ఇది అలెర్జీ లక్షణాలను నయం చేసేందుకు ఉపయోగపడుతుంది. ముక్కు కారడం, తుమ్ములు, దురద, కళ్ల నుంచి నీళ్లు కారడం, చర్మం మీద దద్దుర్లు లాంటి ఆరోగ్య సమస్యలను తగ్గించేందుకు ఉపయోగిస్తారు.దీన్ని ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపులలో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
ఈ మందును పెద్దలు, 6 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు మాత్రమే తీసుకోవాలి. వైద్యుడి సూచన ప్రకారం 2–6 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు కూడా దీనిని ఇవ్వవచ్చు. మూత్రపిండాలు, కాలేయ సమస్యలు ఉన్నవారు ముందుగా వైద్యుడిని సంప్రదించి తీసుకోవాలి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కూడా డాక్టర్ సూచన మేరకు వాడాలి. ఒకవేళ మందులు వాడితే అలర్జీ వచ్చే వాళ్లు ఉపయోగించకపోవడం మంచిది. 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు డాక్టర్ చెప్తే, ఇవ్వకూడదు. అలెర్జీ ఉన్నప్పుడు, శరీరం హిస్టామిన్ అనే రసాయనాన్ని తయారు చేస్తుంది. ఇది తుమ్ములు, దురద, ముక్కు కారటానికి కారణమవుతుంది. సెటిరిజిన్ హిస్టామిన్ ను నిరోధించడంలో ఉపయోగపడుతుంది. అలర్జీ లక్షణాలను గంటలోగా ఆపుతుంది. ఒక్కమాత్ర తీసుకుంటే దాని ప్రభావం 24 గంటలు ఉంటుంది. రోజుకు ఒకటి మాత్రమే తీసుకోవాలి. ఈ టాబ్లెట్ తీసుకుంటే మత్తు కలిగించి నిద్రపోయేలా చేస్తుంది.
సెటిరిజిన్ సాధారణంగా సురక్షితం. కానీ, కొన్ని దుష్ప్రభావాలను కలిగిస్తుంది.
⦿ కొంతమందికి అలసటగా లేదంటే మగతగా అనిపిస్తుంది.
⦿ సెటిరిజిన్ తీసుకున్న తర్వాత నోరు పొడిబారుతుంది.
⦿ తేలికపాటి తలనొప్పి కలుగుతుంది.
⦿ అనారోగ్యంతో పాటు కడుపులో కాస్త అసౌకర్యం కలిగిస్తుంది.
⦿ కొన్నిసార్లు మైకము, గొంతు నొప్పి కలిగిస్తుంది.
⦿ అరుదైన సందర్భాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.
Read Also: మేక పాలు తాగితే.. మతిపోయే లాభాలు, తెలిస్తే అస్సలు వదలరు !
సెటిరిజిన్ ను పెద్దలు, 12 ఏళ్లు పైబడిన పిల్లలు సాధారణంగా రోజుకు ఒకసారి 10 mg తీసుకుంటారు. 6–12 సంవత్సరాల వయస్సు గల పిల్లలు రోజుకు ఒకటి లేదా రెండుసార్లు 5 mg తీసుకోవచ్చు. ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా నిద్ర వస్తుంది. హృదయ స్పందన పెరుగుతుంది. అతిగా తీసుకుంటే అనార్థాలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డాక్టర్ల సలహాలు, సూచనలు లేకుండా సెటిరిజిన్ తీసుకోకపోవడం మంచిది.
Read Also: చాయ్‌తో బిస్కెట్ తినొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే షాక్ అవుతారు!