BigTV English

AP Fake Liquor case: తంబళ్లపల్లి కల్తీ మద్యం కేసులో కీలక మలుపులు

AP Fake Liquor case: తంబళ్లపల్లి కల్తీ మద్యం కేసులో కీలక మలుపులు

AP Fake Liquor case: ఏపీలో కల్తీ మద్యం వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో కీలక పాత్రదారులుగా గుర్తించిన అధికార పార్టీ నాయకులను పార్టీ సస్పెండ్‌ చేసింది. పలువురు వ్యక్తులు అరెస్ట్‌ అయ్యారు. అయితే, ఈ వ్యవహారంపై ప్రతిపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా.. వైసీపీకి విమర్శలకు అంతే ధీటుగా కౌంటర్‌ ఇస్తున్నారు కూటమి నేతలు.


ఏపీ కల్తీ మద్యం కేసులో రాజకీయ దుమారం.. ఇప్పటికే 12 మంది అరెస్ట్ చేసిన సీఐ

మొత్తం 12 మంది ముద్దాయిలను అరెస్ట్‌ చేసినట్టు సీఐ తెలిపారు. అందులో అద్దెపల్లి జనార్దన్‌ రావును ఏ1 నిందితుడుగా గుర్తించామన్నారు. ANR బార్‌ను సీజ్‌ చేసినట్టు.. అతని వ్యాపారలపై ఫోకస్‌ చేసినట్టు తెలిపారు.


ఒక్క నియోజకవర్గంలోనే కాదు.. అన్ని నియోజకవర్గాల్లో రైడ్స్ జరిపించాలన్న భూమన

కల్తీ మద్యం పట్టుకున్నది కొంతే.. కానీ, పట్టుకోని కల్తీ మద్యం ప్రతీ నియోజకవర్గంలో ఉందని వైసీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. పట్టుకోలేనంత పరిస్థితి ఉంది కాబట్టే.. తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే చర్యలు తీసుకున్నారని విమర్శించారు.

కల్తీ మద్యం దందాను వైసీపీ నేతలు బయటపెట్టడంతోనే.. చర్యలు తీసుకున్నారని విమర్శ

కల్తీ మద్యం దందాపై వైసీపీ నేతలు గొడవ చేస్తేనే ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఇలాంటి కల్తీ మద్యం స్మాల్‌ స్కేల్‌ ఇండస్ట్రీలను TDP, జనసేన నాయకులు నడుపుతున్నారని ఆరోపించారు. వారందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

లిక్కర్‌ స్కాం గురించి ఒక్క మాట మాట్లాడకుండా.. మాపై బురద జల్లుతారా?-అనురాధ..

ఎలక్షన్‌ ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినవారే కల్తీ మద్యం కేసులో పట్టుబడ్డారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌, ఎమ్మెల్సీ అనురాధ అన్నారు. వైసీపీ హయాంలో లిక్కర్‌ స్కామ్‌కు తెరలేపి.. 3 వేల 5 కోట్లకు పైగా సొమ్ముచేసుకున్నారని ఆరోపించారు. లిక్కర్‌ స్కామ్‌లో ఇన్‌వాల్వ్‌ అయిన ఎమ్మెల్యేలు, ఎంపీలను ఒక్కరిని కూడా సస్పెండ్‌ చేయలేదని ఫైర్‌ అయ్యారు. లిక్కర్‌ స్కామ్‌ గురించి ఒక్క మాట మాట్లాడకుండా.. మాపై బురదజల్లుతారా..? అంటూ ప్రశ్నించారు. నకిలీ మద్యంను పట్టుకున్నది మా ప్రభుత్వం.. ఇమీడియట్‌గా యాక్షన్‌ తీసుకోమన్నది.. పోలీస్‌ రైడ్స్‌ జరిపించింది చంద్రబాబేనని.. ఇందులో వైసీపీ పాత్ర ఏముందని ప్రశ్నించారు.

Also Read: జగన్ నర్సీపట్నం టూర్.. అసలు ప్లాన్ ఇదేనా..?

లిక్కర్‌ స్కామ్‌ నిందితులపై చర్యలు తీసుకున్నారా-రామ్‌గోపాల్

కల్తీ మద్యం వ్యవహారంలో తమ పార్టీ నాయకులైన జయచంద్రా రెడ్డిని, సురేంద్ర నాయుడును సస్పెండ్‌ చేశామని అన్నారు ఎమ్మెల్సీ రామ్‌గోపాల్‌ రెడ్డి. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే.. ఆయన ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్‌ స్మామ్‌ గురించి ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు.

Related News

CM Progress Report: సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్.. పేరిట ఇంటింటికి సీఎం భరోసా..

Kurupam Incident: కురుపాం గురుకులంలో ఇద్దరు విద్యార్థినుల మృతి బాధాకరం: పవన్ కల్యాణ్

AP Rains: ఏపీలో మళ్లీ వర్షాలు.. రేపు ఈ జిల్లాల్లో పిడుగుపాటు హెచ్చరికలు

Srisailam Temple: తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రం అభివృద్ధి.. సీఎం చంద్రబాబు సమీక్ష.. డిప్యూటీ సీఎం కీలక సూచన

CM Chandrababu: అనంతపురం, కురుపాం ఘటనలపై సీఎం చంద్రబాబు ఆరా.. నివేదికలు ఇవ్వాలని ఆదేశాలు

Coconut Price: కొండెక్కిన కొబ్బరి కాయల ధర.. బెంబేలెత్తుతున్న సామాన్యులు

Auto Drivers Sevalo: ఆటో డ్రైవర్ల సేవలో.. జగన్ కోలుకోవడం కష్టం

Big Stories

×