Rishabh shetty: సాధారణంగా ఒక సినిమా విడుదల అవుతుంది అంటే ఆ సినిమాలో నటీనటులను ముందుగానే ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అయితే ఏదైనా చిన్న చిన్న పాత్రలు ఉంటే హీరో లేదా హీరోయిన్ కుటుంబ సభ్యులను ఆ పాత్రలలో భాగం చేస్తూ ఉంటారు. ఇలా ఎన్నో సినిమాలలో హీరోలతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. ఇటీవల మంచు విష్ణు కన్నప్ప సినిమాలో తన నలుగురు పిల్లలను విష్ణు భాగం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నటుడు రిషబ్ శెట్టి (Rishabh Shetty)కూడా కాంతార చాప్టర్ 1 (Kantara Chapter1)సినిమాలో తన భార్య పిల్లలను కూడా భాగం చేశారని తెలుస్తోంది.
కన్నడ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా కొనసాగుతున్న రిషబ్ శెట్టి 2022వ సంవత్సరంలో కాంతార సినిమాకు స్వీయ దర్శకత్వం వహిస్తూ నటుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు ప్రీక్వెల్ సినిమాగా కాంతార చాప్టర్ 1 సినిమాని విడుదల చేశారు. అక్టోబర్ రెండవ తేదీ విడుదలైన ఈ సినిమా అన్ని భాషలలోనూ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో రిషబ్ నటన అద్భుతం అని చెప్పాలి. అయితే ఈ సినిమాలో తన భార్య ప్రగతి(Pragathi) అలాగే పిల్లల్ని కూడ భాగం చేశారని తెలుస్తోంది.
ఈ సినిమాలో వీరి పాత్ర పెద్దగా ప్రాధాన్యత లేదు కేవలం కొన్ని సెకన్లలో తెరపై కనిపించి మాయమవుతారు. మరి రిషబ్ భార్య ప్రగతి పిల్లలు మనకు సినిమాలో ఎక్కడ కనిపిస్తారనే విషయానికి వస్తే.. ఈ సినిమాలో కీలక సన్నివేశంగా మారిన రథం సీన్ లో రిషబ్ విరోచితంగా పోరాడే సమయంలో ఒక మహిళ, ఇద్దరు పిల్లల్ని కాపాడబోయే తరుణంలో కింద పడిపోతారు.అయితే అక్కడ రిషబ్ కాపాడిన మహిళ తన భార్య ప్రగతి అలాగే పిల్లలు తన పిల్లలు కావటం విశేషం.అయితే ఈ సన్నివేశం కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే ఉన్న తరుణంలో అక్కడ ఉన్నది రిషబ్ భార్య పిల్లలు అనే విషయాన్ని పెద్దగా ఎవరు గుర్తించలేరు.
కాస్ట్యూమ్ డిజైనర్ గా..
ఇలా ఈ సినిమాలో రిషబ్ కుటుంబం అంతా భాగమయ్యారనే చెప్పాలి. ఇక రిషబ్ భార్య ప్రగతి విషయానికి వస్తే ఈమె వృత్తిపరంగా ఐటి ఉద్యోగిని. రిషబ్ సినిమాలలో నటిస్తూ ఉండగా ఈమె తన ఉద్యోగం చేసుకుంటూ పిల్లల, కుటుంబ బాధ్యతలను నిర్వర్తించేవారు అయితే కాంతార సినిమా సమయం నుంచి ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ఇలా కాంతార, కాంతార1 సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా ప్రగతి వ్యవహరించడం విశేషం. ఇక వీరిద్దరి వివాహం 2017 వ, ఫిబ్రవరి 9 వ సంవత్సరంలో కర్ణాటకలో జరిగిన ఒక సన్నిహిత సాంప్రదాయ వేడుకలో జరిగింది. ఇలా వివాహం తర్వాత ఈమె ఐటీ రంగంలో ఉద్యోగం చేస్తూ తన భర్తకు చేదోడు వాదోడుగా నిలిచారు. ఇక ప్రస్తుతం మాత్రం పూర్తిగా తన భర్త సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. అయితే ప్రగతి సోషల్ మీడియాకు దూరంగా ఉన్న నేపథ్యంలో ఈమె గురించి చాలా మందికి పెద్దగా తెలియదనే చెప్పాలి.