Shahid Afridi: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025 ) నేపథ్యంలో పాకిస్తాన్ మహిళల జట్టు దారుణంగా విఫలం అవుతుంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో రెండు మ్యాచ్ లు ఓడిపోయింది పాకిస్తాన్ మహిళల జట్టు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మహిళల జట్టుపై ఆ దేశానికి సంబంధించిన మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది ( Shahid Afridi ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ మానేసి, కిచెన్ లో వంట చేసుకోండి అంటూ మహిళలను కించపరుస్తూ మాట్లాడారు షాహిద్ ఆఫ్రిది. ముఖ్యంగా టీమిండియా చేతిలో ఓడినందుకే ఈ వ్యాఖ్యలు చేశాడు అఫ్రిది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
వన్డే మహిళల వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఆదివారం అంటే నిన్న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మహిళల జట్ల మధ్య ఫైట్ జరిగింది. ఇందులో టీమిండియా తన ఆధిపత్యాన్ని ఈ చలాయించింది. బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్, నిన్న టీమిండియా చేతిలో ఘోర పరాభవం చవి చూసింది. నిన్నటి మ్యాచ్ లో ఏకంగా 88 పరుగుల తేడాతో ఘోర ఓటమిపాలైంది పాకిస్తాన్ మహిళల జట్టు. ఈ మ్యాచ్ లో టీమిండియా 247 పరుగులు చేయగా, ఆ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది పాకిస్థాన్. దీంతో 159 పరుగులకే కుప్పకూలింది. అయితే పాకిస్తాన్ ఓడిపోవడంతో మహిళలపై అత్యంత దారుణంగా ఆ దేశానికి చెందిన మాజీ క్రికెటర్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే షాహిద్ ఆఫ్రిది కూడా కామెంట్స్ చేశారు.
వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా నిన్న టీమిండియా చేతిలో ఓడిపోయిన మహిళల పాకిస్తాన్ జట్టును ఉద్దేశించి ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ వెంటనే మానేసి, వంటింట్లో కూరలు చేసుకోండి అంటూ మహిళల జట్టును కించపరిచాడు అఫ్రిది. అప్పుడైనా మహిళల జట్టుకు బుద్ధి వస్తుందని నిప్పులు చెరిగాడు షాహిద్ ఆఫ్రిది.టీమిండియా మహిళల చేతిలో ఓడిపోవడం సిగ్గు చేటు అని ఆగ్రహించారు. ఇలాంటి వాళ్లు ఎందుకు ఉన్నట్లు అని ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే షాహిద్ ఆఫ్రిది వీడియో బయటికి రావడంతో కొంతమంది ఆయనకు కౌంటర్ ఇస్తున్నారు. ఒరేయ్ మీ పురుషుల జట్టు కూడా టీమిండియా చేతిలో అత్యంత దారుణంగా ఓడిపోయింది. ఆసియా కప్ టోర్నమెంట్ లో మూడు సార్లు ఓడిపోయారు. అప్పుడు పాకిస్తాన్ పురుషుల జట్టు ప్లేయర్లు ఏం చేయాలి రా ? కొంచమైనా నీకు బుద్ధుందా అని షాహిద్ ఆఫ్రిదిపై ఫైర్ అవుతున్నారు.
Shahid Afridi said – "Pakistani women cricketers should leave the cricket and start making food in the kitchen".
Do you agree with Shahid Afridi or not ?🤔pic.twitter.com/9MqNjl4fo1
— Richard Kettleborough (@RichKettle07) October 6, 2025