చాలా మంది అంతర్జాతీయ ప్రయాణీకులకు ఎయిర్ పోర్టులో పాస్ పోర్టును ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తారు. పాస్ పోర్టుతో పాటు తమ దేశంలోకి అడుగు పెట్టేందుకు అవసరమైన అన్ని రకాల డాక్యుమెంట్స్ ఉన్నాయో? లేవో? పరిశీలిస్తారు. చెక్ పాయింట్ దగ్గర వెయిట్ చేయలేక చాలా మంది ప్రయాణీకులు తీవ్ర అసహనానికి గురవుతుంటారు. పలు అంతర్జాతీయ విమానాశ్రయాలలో పాస్ పోర్టు చెకింగ్ కోసం చాలా మంది లైన్లలో నిలబడాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల రెండు మూడు లైన్లలో ప్రయాణీకులు నిలబడుతారు. ఎక్కువ మంది ప్రయాణీకులు ఉన్న సమయంలో పొడవైన క్యూలైన్లు కనిపిస్తాయి. అయితే, చిన్న విమానాశ్రయాలు వేగవంతమైన చెకింగ్ ప్రక్రియను నిర్వహించేలా ప్రయత్నిస్తాయి. అయితే, కొద్ది కాలంగా చాలా విమానాశ్రయాలు అత్యాధునిక పాస్ పోర్టు చెకింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తక్కువ మ్యాన్ పవర్ ను ఉపయోగించి వేగంగా ప్రయాణీకుల పాస్ పోర్ట్ చెకింగ్ ప్రక్రియు పూర్తి చేస్తున్నారు. ఇక తాజాగా సింగపూర్ లోని చాంగి విమానాశ్రయంలో మొత్తం పాస్ పోర్ట్ చెకింగ్ ప్రక్రియను కేవలం 8 సెకన్లలో ఎలా పూర్తయ్యిందో ఒక ట్రావెలర్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.
లాంజ్ గురూ అనే ట్రావెలర్ సింగపూర్ ఎయిర్ పోర్టులోని పాస్ పోర్టు వెరిఫికేషన్ విధానాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. “నేను ఇప్పటి వరకు 147 దేశాలను సందర్శించాను. ఈ ఎయిర్ పోర్టును మించిన ఎయిర్ పోర్టు మరేదీ లేదు. నేను ఇప్పటి వరకు చూసిన అత్యంత వేగవంతమైన పాస్ పోర్ట్ చెకింగ్ విధానం ఇక్కడే ఉంది. సింగపూర్ చాంగి ఎయిర్ పోర్టు నిజంగా అద్భుతం. పాస్‌పోర్ట్ స్కాన్ నుంచి ఎంట్రీ వరకు 7.57 సెకన్లలో కంప్లీట్ అయ్యింది. అధికారికంగా ఏ విమానాశ్రయంలోనైనా ఇంత తక్కువ సమయంలో పూర్తి కావడం అసాధ్యం. ఇప్పటి వరకు చాలా ఎయిర్ పోర్టులలో క్యూ లైన్లలో చాలా సేపు వెయిట్ చేసిన సందర్భాలున్నాయి. కానీ, ఇక్కడ అలాంటిది ఏమీ లేదు” అని వివరించారు.
ఇక ప్రస్తుతం లాంజ్ గురూ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నెటిజన్లు క్రేజీగా కామెంట్స్ పెడుతున్నారు. “ఇది నిజంగా చాలా ఫాస్ట్ గా ఉంది. అత్యంత సులభంగా కూడా ఉంది. అద్భుతంగా ఆకట్టుకుంటుంది కూడా” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. “నేను కూడా ఇప్పటి వరకు 42 దేశాలు తిరిగాను. సింగపూర్ లాంటి విధానం మరే దేశంలోనూ లేదు. నిజంగా సింగపూర్ గొప్ప దేశం” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “నేను కూడా రెండు రోజులుగా సింగపూర్ లోనే ఉన్నాయి. ఈ విమానాశ్రయం అద్భుతంగా ఉంది. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ప్రయాణీకులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా పాస్ పోర్టు చెకింగ్ కొనసాగుతుంది. నేను చాలా ఆశ్చర్యపోయాను” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.
సింగపూర్ చాంగి విమానాశ్రయంలో ప్రస్తుతం 4 టెర్మినల్స్ ఉండగా, 5 టెర్మినల్ ను కూడా నిర్మిస్తున్నారు. 2025లో ఈ ఎయిర్ పోర్టు 13వ సారి ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా ఎంపికైంది.
Read Also: రైల్లో హైటెక్ వాష్ రూమ్, ఫైవ్ స్టార్ హోటల్లోనూ ఇలా ఉండదండీ బాబూ!