Director Sukumar: Director Sukumar: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న సుకుమార్ (sukumar) వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవలే పుష్ప, పుష్ప 2 చిత్రాలతో పాన్ ఇండియా వైడ్ పేరు సొంతం చేసుకున్న ఈయన ఇప్పుడు బుచ్చిబాబు సనా (Bucchibabu sana) దర్శకత్వం వహిస్తున్న ‘పెద్ది’ సినిమా డైరెక్షన్ పర్యవేక్షణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ (Ram Charan) తో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఒకవైపు వరస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సుకుమార్..ఇప్పుడు అక్కడక్కడ జరగబోయే పలు షాప్ ప్రారంభోత్సవాలకి వెళ్తూ సందడి చేస్తున్నారు.
అందులో భాగంగానే తాజాగా సుకుమార్ హైదరాబాదులో సందడి చేశారు. విషయంలోకి వెళ్తే.. ప్రపంచ ప్రఖ్యాత తైవాన్ కి చెందిన తైవానికి బోబా టీ బ్రాండ్ ను ఇనోర్బిట్ మాల్ లో ప్రారంభించారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ టీ బ్రాండ్ ను ఇప్పుడు హైదరాబాదులో కూడా అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపిన ఆయన.. షేర్ టీ, హైటెక్ సిటీలోని ఇనోర్బిట్ మాల్ లో భారతదేశ మొదటి ఔట్లెట్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుకుమార్ తో పాటు మేనేజింగ్ పార్టనర్స్ ప్రవీణ్ , అరుణ్, వికాస్,తేజ పాల్గొన్నారు.
ALSO READ:Nagarjuna 100 Movie : ‘లాటరీ కింగ్’… నాగార్జునతో లాటరీ కొట్టిస్తుందా ?
ఈ సందర్భంగా డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. “చిన్నపిల్లలు ఎంతగానో ఇష్టపడే బోబా టీ.. షేర్ టీ పేరుతో మన హైదరాబాదులో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. విదేశాలలో బోబా టీని తీసుకోవడానికి చిన్న పిల్లలతో క్యూ లైన్ లో నిలబడడం ఎన్నో దేశాలలో చూశాను. అమెరికాలో కూడా ఈ బ్రాండ్ కు మంచి డిమాండ్ ఉంది. తైవాన్ దేశానికి సంబంధించిన అథెంటిక్ రుచులతో ప్రత్యేకంగా తైవాన్ టెక్నీషియన్ తీసుకువచ్చి మరీ హైదరాబాదులో షేర్ టీ ప్రారంభించడం చాలా గొప్ప విషయం” అంటూ నిర్వహకులను అభినందించారు.. “విదేశాలలో సినిమాలకు షూటింగ్లకు వెళ్ళినప్పుడు నేను కూడా ఈ బోబా టీని సేవించాను. చిన్నారులకు ఇది ఎంతగానో ఇష్టమైన స్పాట్గా మారిపోతుంది” అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.
1992లో తైవాన్ లో స్థాపించబడిన షేర్ టీ.. తాజాగా తయారు చేసిన టీలు, ప్రీమియం పదార్థాలు, విస్తృతశ్రేణి రుచులకు ప్రపంచవ్యాప్తంగా ఇష్టమైనదిగా మారింది. 13కి పైగా దేశాలలో 500 కంటే ఎక్కువ స్టోర్లను షేర్ టీ , క్లాసిక్ మిల్క్ టీ ల నుండి ఫ్రూట్ టీలు, బోబా స్పెషాలిటీల వరకు రిఫ్రెషింగ్, ఆహ్లాదకరమైన, అనుకూలించదగిన పానీయాల అనుభవాన్ని అందించడంలో ప్రసిద్ధి చెందింది. అంటూ నిర్వాహకుడు ప్రవీణ్ తెలిపారు.
అంతేకాదు హైదరాబాదులో కొత్తగా ప్రారంభించబడిన ఈ అవుట్ లెట్ షేర్ టీ యువత ప్రతిబింబించే శక్తివంతమైన సమకాలీన వాతావరణాన్ని అందిస్తుందని , నాణ్యత పై దృష్టి పెడుతుంది అని , ముఖ్యంగా నగరంలోని డైనమిక్ యువతలో పెరుగుతున్న బబుల్ టీ సంస్కృతిని తీర్చడమే ఈ బ్రాండ్ లక్ష్యమని మేనేజింగ్ పార్టనర్స్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి అనేకమంది ఇన్ఫ్లుయెన్సర్లు, దుకాణాదారులు, ఆహార ప్రియులు కూడా హాజరయ్యారు. “షేర్ హ్యాపీనెస్.. షేర్ టీ “తత్వాన్ని జరుపుకునే రుచి సెషన్లు ఆకర్షణీయమైన కార్యకలాపాలను ఆస్వాదించారు.. అంతేకాదు హైదరాబాదు నగరం నడిబొడ్డున తాజా పదార్థాలతో అంతర్జాతీయ కేఫ్ అనుభవాన్ని కోరుకునే teaa ప్రియులకు ఇది కొత్త గమ్యస్థానంగా ఉంటుందని కూడా హామీ ఇచ్చారు..