Bad Boy Karthik Teaser: కుర్ర హీరో నాగ శౌర్య ఈ మధ్య వెండితెరపై కనిపించింది లేదు. 2023 లో రంగబలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటివరకు మరో సినిమాను ప్రకటించిందే లేదు. ఇక ఈ మధ్యనే బ్యాడ్ బాయ్ కార్తీక్ అనే సినిమాను ప్రకటించాడు. రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్ పై శ్రీనివాసరావు చింతలపూడి, విజయ కుమార్ చింతలపూడి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ శౌర్య సరసన విధి యాదవ్ హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ హీరోయిన్ శ్రీదేవి కీలక పాత్రలో నటిస్తోంది.
ఇప్పటికే బ్యాడ్ బాయ్ కార్తీక్ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కథ ఏంటి అనేది చూపించలేదు కానీ, హీరో క్యారెక్టర్ ను మాత్రమే చూపించారు. డైలాగ్స్ లేకుండా ఉన్న ఈ టీజర్ లో యాక్షన్ పార్ట్ నే ఎక్కువ చూపించారు.
బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగ శౌర్య కనిపించాడు. కనిపించినవాళ్లను కనిపించినట్లు చితక్కొడుతూ.. బ్యాడ్ బాయ్ లానే దర్శనమిచ్చాడు. ఇక విలన్ గా సముద్రఖని నటించినట్లు తెలుస్తోంది. నాగ శౌర్య బ్యాడ్ బాయ్ గా ఎందుకు మారాడు.. ? రాజకీయ నాయకుడిగా ఉన్న సముద్రఖనికి నాగ శౌర్యకు మధ్య వైరం ఏంటి.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
టీజర్ లో కథ ఏమి అర్ధంకాకపోయినా నాగ శౌర్య లుక్, యాక్షన్ అదిరిపోయాయి. హీరోయిన్ ను అస్సలు చూపించలేదు. బ్యాడ్ బాయ్ అని చెప్పారు.. కానీ స్మార్ట్ బాయ్ లా ఉన్నావ్.. వెన్నెల కిషోర్ కామెడీ ఆకట్టుకుంటున్నాయి. ఇక హ్యారిస్ జయరాజ్ మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో నాగ శౌర్య హిట్ ను అందుకుంటాడా .. ? లేదా.. ? అనేది చూడాలి.