BigTV English

Chili Garlic Chicken Fry: వెల్లులి కారంతో కోడి వేపుడు.. తినే కొద్దీ తినాలనిపిస్తుంది..

Chili Garlic Chicken Fry: వెల్లులి కారంతో కోడి వేపుడు.. తినే కొద్దీ తినాలనిపిస్తుంది..

Chili Garlic Chicken Fry: వెల్లుల్లి కారంతో చికెన్ ఫ్రై.. ఈ పేరు వింటేనే నాన్ వెజ్ ప్రియులకు నోరూరిపోతుంది కదా.. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ ఇలా రొటీన్‌గా తయారు చేసుకునే బదులు ఒకసారి వెల్లుల్లి కారంతో కోడివేపుడు తిన్నారంటే.. రుచి అదిరిపోతుంది అంతే. వెల్లుల్లితో చేసిన ఏ వంటకం అయిన రుచిగా ఉంటుంది. ఇక చికెన్‌లో వెల్లుల్లి కారం వేసి వండితే మరింత రుచిగా మారుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


వెల్లుల్లి కారం, కోడివేపుడు రెసిపీకి కావాల్సిన పదార్ధాలు
చికెన్- అరకిలో
గుప్పెడు వెల్లుల్లిపాయలు
నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు
పసుపు- పావు టీస్పూన్
కావాల్సినంత కారం
ఒక టేబుల్ స్పూన్- జీలకర్ర
కరివేపాకు
నూనె -కావాల్సినంత
రుచికిసరిపడ ఉప్పు

Also Read: విలేజ్ స్టైల్లో నాటుకోడి కర్రీ వండారంటే రుచి మామూలుగా ఉండదు, ట్రై చేయండి


తయారు చేసుకునే విధానం
ముందుగా చికెన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి.. శుభ్రం చేసిపెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లి పాయలను ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగినివ్వాలి. ఈ లోపు వెల్లుల్లి కారం సిద్ధం చేసుకోవాలి. మిక్సీజార్ తీసుకుని అందులో జీలకర్ర, వెల్లుల్లి పాయలు, పసుపు, రెండు, మూడు టేబుల్ స్పూన్ కారం వేసి సరిపడినంత ఉప్పు వేసి, అందులో కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టాలి. ఇక ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులో చికెన్, రుచికి సరిపడ సాల్ట్ వేసి బాగా కలిపాలి. కడాయిపైన మూత పెట్టి కాసేపు ఉంచితే చికెన్‌లో నీరు దిగిపోతుంది. ఆ నీరు బాగా ఇంకిపోయాక వెల్లుల్లి కారం అందులో వేసి బాగా కలపాలి. ఆ గ్రేవి అంతా ముక్కకు పట్టేలా ఉడికించుకోవాలి. చివర్లో కొత్తిమీర, కరివేపాకులను జల్లుకుని స్టవ్ కట్టేయాలి. ఆ తర్వాత వేడి వేడి అన్నంలో తింటే చాలా రుచికరంగా ఉంటుంది.

ఇక చికెన్‌తో పాటు, వెల్లుల్లిలో కూడా అనేక పోషకాలు ఉంటాయి. ఇది శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవాళ్లు ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. వీటిలో ప్రొటీన్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఒక సారి ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×