BigTV English

Hari Hara Veera Mallu: చేసేది ప్యాచ్ వర్క్ మాత్రమే.. పవన్ ఎన్ని రోజులు కేటాయించారంటే.?

Hari Hara Veera Mallu: చేసేది ప్యాచ్ వర్క్ మాత్రమే.. పవన్ ఎన్ని రోజులు కేటాయించారంటే.?

Hari Hara Veera Mallu Update: మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. కెరీర్ మొదట్లోనే తనదైన మ్యానరిజంతో చాలామంది ప్రేక్షకులకు దగ్గరయ్యారు పవన్. కొద్ది సమయంలోనే అభిమానులను సంపాదించుకొని వారి దృష్టిలో పవర్ స్టార్ అయిపోయారు. కానీ సినిమాలు మాత్రమే తనకు తృప్తిని ఇవ్వకపోవడంతో రాజకీయాల్లోకి దిగారు. ఓటమిని ఎదుర్కొని నిలబడి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని సంపాదించుకున్నారు. దీంతో తనను సినిమాల్లో చూసి అభిమానం పెంచుకున్న ప్రేక్షకుల్లో ఆందోళన మొదలయ్యింది. వారికోసమే ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ పూర్తిచేయాలని నిర్ణయించుకున్నారు పవన్.


పెద్ద బ్రేక్

పవన్ కళ్యాణ్‌కు ఎంత పాపులారిటీ ఉన్నా భారీ బడ్జెట్‌తో, ప్యాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేయడానికి ఆయన ఎప్పుడూ ఇష్టపడలేదు. కానీ మొదటిసారి ఆయన హీరోగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ భారీ బడ్జెట్‌తో చిత్రీకరణ ప్రారంభించుకుంది. ‘హరి హర వీరమల్లు’తో పాటు పలు ఇతర ప్రాజెక్ట్స్‌ను కూడా సైన్ చేశారు పవన్ కళ్యాణ్. అప్పుడే ఏపీలో ఎన్నికల హడావిడి మొదలయ్యింది. దీంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయ ప్రచారాలలో బిజీ అయిపోయారు. అలా ‘హరి హర వీరమల్లు’ సినిమాకు పెద్ద బ్రేకే పడింది. ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి ఈ సినిమా కోసం కాస్త సమయాన్ని కేటాయించడానికి పవన్ ముందుకొచ్చారు.


Also Read: హరిహర వీరమల్లు షూటింగ్ మొదలైంది రిలీజ్ అయ్యేది అప్పుడే

ఆఫీస్ పక్కనే

తాజా సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 23 నుండి ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. కానీ ఇప్పుడు జరిగేది అంతా ప్యాచ్ వర్క్ మాత్రమే. ప్రస్తుతం ఈ షూటింగ్‌లో హీరో పవన్ కళ్యాణ్, విలన్ బాబీ డియోల్ తప్పా మరెవరూ పాల్గొనడం లేదు. వీరిద్దరి మధ్య పలు కీలక సీన్స్‌ను షూట్ చేసి వాటిని ఎడిట్ చేయనున్నారు మేకర్స్. వారం రోజుల పాటు ఎక్కువగా యాక్షన్ ఎపిసోడ్స్‌పైనే దృష్టిపెట్టనున్నారు. యాక్షన్ సీన్స్ పూర్తి చేయడం కోసం కేవలం వారం రోజులు మాత్రమే గడువు ఇచ్చారట పవన్ కళ్యాణ్. వాటికోసం మంగళగిరిలోని తన పార్టీ ఆఫీస్ పక్కనే స్పెషల్‌గా గ్రీన్ మ్యాట్‌తో సెట్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.

గుమ్మడికాయ కొట్టేస్తారు

ఈ నెలలో యాక్షన్ సీన్స్ పూర్తయిన తర్వాత అక్టోబర్ 15 నుండి మరో వారం రోజుల పాటు ‘హరి హర వీరమల్లు’ షూటింగ్‌లో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. దాంతో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యిపోతుంది. అలా ‘హరి హర వీరమల్లు’కు గుమ్మడికాయ కొట్టేస్తారు. ఈ సినిమా సంగతి ఇలా ఉంటే.. సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ‘OG’ సంగతి ఏంటి అని ఫ్యాన్స్‌లో సందేహాలు మొదలయ్యాయి. ఆ మూవీలో కూడా పలు యాక్షన్ ఎపిసోడ్స్‌ను పెండింగ్‌లో పెట్టారు పవన్ కళ్యాణ్. వాటిని పూర్తి చేయడం కోసం దీపావళి తర్వాత డేట్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానిక ‘హరి హర వీరమల్లు’, ‘OG’లను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని పవన్ డిసైడ్ అయ్యారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×