BigTV English

Tirumala Laddu Issue: ఏఆర్ డెయిరీ లారీ వివరాలు విడుదల.. ఎంతకి దిగజారావ్ జగన్ : టీడీపీ ఫైర్

Tirumala Laddu Issue: ఏఆర్ డెయిరీ లారీ వివరాలు విడుదల.. ఎంతకి దిగజారావ్ జగన్ : టీడీపీ ఫైర్

Tirumala Laddu Issue: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదానికి కారణమైన AR డెయిరీకి సంబంధించిన నెయ్యి లారీ వివరాలను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. జంతువుల కొవ్వుతో కల్తీ చేసి.. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బ తీయటమే కాక, ఇలాంటి ఫేక్ ప్రచారాలు కూడా చేస్తావా వైఎస్‌ జగన్ అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. అసలు నీకు స్వామి వారంటే భయం, భక్తి ఉన్నాయా అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎంపిక చేసిన AR డెయిరీ కంపెనీకి సంబంధించి నాలుగు ట్యాంకర్ల నెయ్యిని జూన్ నెలలో వాడారని తెలుగుదేశం ఆరోపిస్తోంది.


ఆ ట్యాంకర్లకి సంబంధించిన వాటికి సంబంధించి తేదీలు, ట్యాంకర్ రిజిస్ట్రేషన్ నంబర్లు విడుదల చేసింది. వీటికి స్థానిక ల్యాబ్ లో టెస్ట్ చేయించాలని చూడగా.. జంతు కొవ్వు గుర్తించే సామర్ధ్యం ఆ ల్యాబ్ కి లేకపోవటంతో బయటపడలేదన్న తెలుగుదేశం ఆరోపిస్తోంది. దీంతో ఆ నాలుగు ట్యాంకర్స్‌లో వచ్చిన నెయ్యిని.. లడ్డూ తయారీలో ఉపయోగించారని ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే లడ్డూ నాణ్యత మరింత క్షీణించటం, నెయ్యిలో తేడా వాసన గమనించిన తరువాత వచ్చిన నాలుగు ట్యాంకర్స్ లోని శాంపిల్స్ తీసి.. గుజరాత్ లోని ల్యాబ్ కి పంపగా, అక్కడ జంతు కొవ్వుతో కల్తీ చేసినట్టు తేలిందని.. దీంతో ఆ నాలుగు ట్యాంకర్స్‌ను రిజెక్ట్ చేసారని తెలుగుదేశం చెబుతోంది.

Also Read: జగన్… సిట్‌తో పాపాల పుట్ట పగలడం ఖాయం: జీవీ ఆంజనేయులు


ఇదిలా ఉంటే.. తిరుమలలో లడ్డూల కల్తీ తమ హయాంలోనే జరిగిందని అధికార పక్షాలు చేస్తున్న ఆరోపణలను టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. అదంతా అబద్ధమని పేర్కొంటూ నేడు తిరుమలకు వెళ్లి పుష్కరిణిలో స్నానం ఆచరించి.. అఖిలాండం హారతి వెలిగించి.. ప్రమాణం చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు భూమనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×