BigTV English

Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీనే మర్చిపోయిన రోహిత్ శర్మ !

Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీనే మర్చిపోయిన రోహిత్ శర్మ !

Rohit Sharma: ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ నిలిచింది. మే 9 ఆదివారం రోజు దుబాయిలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టును చిత్తు చేసి టైటిల్ సొంతం చేసుకుంది భారత్. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో మూడుసార్లు టైటిల్స్ సొంతం చేసుకున్న తొలి జట్టుగా టీమిండియా రికార్డు క్రియేట్ చేసింది. ఈ ఫైనల్ లో న్యూజిలాండ్ ని నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది భారత్.


 

ఈ టోర్ని ఆధ్యాంతం ఆల్ రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటిన రోహిత్ సేన.. ఫైనల్ లోను అదే జోరును కనబరిచి పుష్కరకాలం తర్వాత చాంపియన్స్ ట్రోఫీని తిరిగి భారత్ కి తీసుకువచ్చింది. చివరగా 2013లో మహేంద్రసింగ్ ధోని సారధ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోగా.. మళ్లీ రోహిత్ శర్మ {Rohit Sharma} నాయకత్వంలో తిరిగి ఈ ట్రోఫీని గెలుచుకుంది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ గెలిచిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు.


మైదానానికి వచ్చి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్క అభిమానికి కృతజ్ఞతలు తెలిపాడు రోహిత్. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో రోహిత్ {Rohit Sharma} మాట్లాడుతూ.. ” మా ఆటని చూసేందుకు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. ఇది మా హోమ్ గ్రౌండ్ కాదు. కానీ ప్రేక్షకులు మాకు అందించిన మద్దతుతో నిజంగా ఇది మా హోమ్ గ్రౌండ్ లా మారిపోయింది. అభిమానులంతా సంతోషించేలా గెలిచినందుకు మాకు ఆనందంగా ఉంది.

మా విజయానికి ప్రధాన కారణం స్పిన్నర్లే. ఈ ఒక్క మ్యాచ్ మాత్రమే కాదు.. టోర్ని మొత్తం మా స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన చేశారు. మా స్పిన్నర్లపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ మా బౌలర్లు ఏమాత్రం నిరాశపరచలేదు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ మెరుగైన ప్రదర్శనతో మ్యాచ్ ని మా వైపు తిప్పారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి లో ఏదో ప్రత్యేకత ఉంది. ఆ ఆలోచనతోనే అతన్ని జట్టులోకి తీసుకున్నాం.

నిజానికి టోర్నమెంట్ ప్రారంభంలో అతనికి అవకాశం ఇవ్వలేదు. కానీ న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో అతనికి అవకాశం ఇస్తే 5 వికెట్లు పడగొట్టాడు. అక్కడి బౌలింగ్ లో గొప్ప క్వాలిటీ ఉంది” అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ ప్రెస్ మీట్ అయిపోయిన అనంతరం రోహిత్ శర్మ చేసిన పని నవ్వులు పూయిస్తుంది. సాధారణంగా రోహిత్ శర్మ తనకి సంబంధించిన వస్తువులు లేదా ఏదైనా విషయాన్ని మరిచిపోయే అలవాటు ఉందన్న విషయం తెలిసిందే.

 

ఈ క్రమంలోనే తాజాగా మరోసారి రోహిత్ కి సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి.. మీడియా సమావేశంలో మాట్లాడిన అనంతరం రోహిత్ శర్మ ఛాంపియన్ ట్రోఫీ కప్ ని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో రోహిత్ శర్మ ఏకంగా కప్ నే మరిచిపోయాడు అంటూ ఈ వీడియో చూసి నవ్వుకుంటున్నారు నెటిజెన్లు. ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు.

Related News

SL VS PAK : ఆసియా క‌ప్ లో నేడు శ్రీలంక‌-పాక్ మ‌ధ్య పోరు.. చావో రేవో..!

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

Big Stories

×