BigTV English

HBD Rithu Varma: సైలెంట్ గా వచ్చి కోట్లు కూడబెట్టిన రీతూ వర్మ.. మొత్తం ఆస్తుల వివరాలివే..!

HBD Rithu Varma: సైలెంట్ గా వచ్చి కోట్లు కూడబెట్టిన రీతూ వర్మ.. మొత్తం ఆస్తుల వివరాలివే..!

HBD Rithu Varma: ‘అనుకోకుండా’ అనే షార్ట్ ఫిలిమ్ ద్వారా కెరియర్ ఆరంభించిన రీతు వర్మ (Rithu Varma).. ఈ షార్ట్ ఫిలింతో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది.అంతేకాదు ఈ షార్ట్ ఫిలిం 2012లో 48 గంటల ఫిలిం ప్రాజెక్ట్ కాంపిటీషన్లో ఉత్తమ లఘుచిత్రంగా నిలిచింది. అలాగే రీతు వర్మకు ఉత్తమ నటిగా పురస్కారం కూడా లభించింది. అంతేకాదు 2013లో సినిమా కేన్స్ షార్ట్ ఫిలిం కార్నర్ లో కూడా ఈ షార్ట్ ఫిలిం ప్రదర్శించబడింది. ఆ తర్వాత తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఈమె.. ప్రేమ, ఇష్క్, కాదల్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. అందులో కాస్ట్యూమ్ డిజైనర్ పాత్ర పోషించింది. ఆ తర్వాత ‘నా రాకుమారుడు’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో కూడా నటించి పేరు దక్కించుకుంది.


రీతు వర్మ సినిమా కెరియర్..

ఇక తెలుగులో నటిస్తున్నప్పుడే తమిళంలో అవకాశాలు రావడంతో అక్కడ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. మళ్లీ తెలుగులో 2016లో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా వచ్చిన ‘ పెళ్లిచూపులు’ సినిమాలో కీలకపాత్ర పోషించి తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గర అయింది. ఇక తర్వాత టక్ జగదీష్ , ఒకే ఒక్క జీవితం, మార్క్ అంటోని వంటి చిత్రాలతో ఆకట్టుకున్న ఈమె.. 2024లో శ్రీ విష్ణు (SriVishnu) నటించిన ‘స్వాగ్’ సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఇక రీతు వర్మ సినిమాలే కాదు ‘మోడరన్ లవ్ హైదరాబాద్’ అనే వెబ్ సిరీస్ కూడా చేసింది. ఇదిలా ఉండగా ఈరోజు రీతూ వర్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈమె ఆస్తులు వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


రీతూ వర్మ ఆస్తుల వివరాలు..

1990 మార్చి 10న హైదరాబాదులో జన్మించిన ఈమె.. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. ఇంజనీరింగ్ తర్వాత డాబర్ గులాబరి మిస్ రోజ్ గ్లో పేజెంట్ పోటీలలో పాల్గొని రెండవ స్థానం అందుకుంది. మోడల్గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత నటిగా పుంజుకుంది. ఇకపోతే సైలెంట్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె ఇప్పుడు కోట్ల రూపాయలను కూడబెట్టింది. ఇకపోతే రీతు వర్మ నటి మాత్రమే కాదు గ్రూప్ ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్లో మానవ వనరుల మేనేజింగ్ డైరెక్టర్ కూడా. అంతేకాదు ముంబైలోని జేపీ మోర్గాన్ అసెట్ మేనేజ్మెంట్లో అసోసియేట్ గా పనిచేసిన ఈమె గతంలో గోల్డ్ మన్ సాచ్స్ లో పెట్టుబడి పరిశోధన సహచరురాలు, విశ్లేషకురాలిగా కూడా పనిచేసింది. ఇక రీతు వర్మ ఆస్తుల విషయానికి వస్తే.. రూ.12,65,858 కోట్లు అని సమాచారం. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.30 నుండి రూ.50 లక్షలు వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

రీతు వర్మ కార్ కలెక్షన్స్..

ఇక రీతు వర్మ కార్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. రేంజ్ రోవర్, ఆడి ఏ6 వంటి కార్లు ఉన్నాయి. ఇక అంతే కాదు విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×