BigTV English

Health Tips for Heart: నిద్రసరిగా పోకపోతే గుండె సంబంధింత సమస్యలు ఎదురవుతాయట.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

Health Tips for Heart: నిద్రసరిగా పోకపోతే గుండె సంబంధింత సమస్యలు ఎదురవుతాయట.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

Health Tips for Heart: ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర చాలా ముఖ్యం. కొన్ని కారణాల వల్ల రోజు నిద్ర పోలేకపోయినా లేదా తక్కువ నిద్రపోయినా ఆ రోజంతా అలసటగా, నీరసంగా అనిపించి తగినంత నిద్రలేనట్లు కనిపిస్తుంది. అయితే తక్కువ నిద్రపోవడం అనేది రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుందని చాలా అధ్యయనాలలో వెల్లడైంది. ప్రతీరోజూ తక్కువ నిద్రపోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మూలకణాలు దెబ్బతింటాయి. దీని వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందట. ఈ మేరకు న్యూయార్క్‌లోని కార్డియోవాస్కులర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. తక్కువ నిద్ర ఆరోగ్యానికి హానికరం, ముఖ్యంగా ఆరోగ్యకరమైన గుండెకు మంచిది కాదని పరిశోధనలో తేలింది.


గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్ని గంటల నిద్ర అవసరం..?

అధ్యయనం భాగంగా కొంత మంది వాలంటీర్ల నమూనాలను తీసుకుని టెస్ట్ చేయగా అసలు విషయం తేలింది. 6 వారాల పాటు ప్రతిరోజూ ఒకటిన్నర గంటల కంటే తక్కువ సమయం పాటు నిద్రపోయే వ్యక్తుల నమూనాలను తీసుకుని పరిశోధన చేశారు. నిరంతరాయంగా తక్కువ సమయం పాటు నిద్రపోయేవారి కణాల్లో చాలా తేడా కనిపించినట్లు పరిశోధనలో వెల్లడైంది. అలాంటి వారి శరీరంలో తెల్ల రక్తకణాలు పెరగడం వల్ల మంట పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ఆరోగ్యకరమైన గుండె కోసం 7-8 గంటలు నిద్రపోవాలి.


35 ఏళ్ల వ్యక్తులపై అధ్యయనం

35 ఏళ్ల వ్యక్తులను మొదట 6 వారాల పాటు 8 గంటలు నిద్రించమని తెలిపారు. అనంతరం వారి రక్త నమూనాలను తీసుకుని పరిశోధన చేశారు. ఈ క్రమంలో వారి రోగనిరోధక కణాల పరీక్ష చేసిన అనంతరం వారి నిద్రను 6 వారాల పాటు ప్రతిరోజూ 90 నిమిషాలు తగ్గించారు.

Also Read: Keep Your Eyes Safe: హీట్ వేవ్ వల్ల మీ కళ్లు దెబ్బతింటున్నాయా.. ఈ అద్భుతమైన చిట్కాలు మీ కోసమే

తక్కువ నిద్రపోవడం గుండెకు ఎందుకు ప్రమాదకరం

తక్కువ నిద్రపోవడం వల్ల గుండెలో మంట పెరుగుతుందని అధ్యయనంలో తేలింది. తక్కువ నిద్రపోయే వారి రక్తంలో రోగనిరోధక కణాలు పెరిగుతాయని వెల్లడించింది. అంతేకాదు ఇది గుండె వాపును కూడా పెంచుతుంది. శరీరంలో ఇన్ఫెక్షన్, గాయం లేదా అనారోగ్యాన్ని నివారించడానికి కొంచెం అవసరం అయినప్పటికీ.. కానీ తక్కువ సమయం పాటు నిద్రించడం అనేది గుండెకు ప్రమాదకరం. శరీరంలో మంట కొనసాగితే లేదా ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు లేదా అల్జీమర్స్‌కు కారణమవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాదు తక్కువ నిద్రపోవడం వల్ల ఆరోగ్యకరమైన రోగనిరోధక కణాలను ఉత్పత్తి చేసే మూలకణాలలో మార్పులు కూడా వస్తాయి.

Tags

Related News

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Big Stories

×