Big Stories

Keep Your Eyes Safe: హీట్ వేవ్ వల్ల మీ కళ్లు దెబ్బతింటున్నాయా.. ఈ అద్భుతమైన చిట్కాలు మీ కోసమే

Keep Your Eyes Safe: ఈ ఏడాది ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఉదయం 9 దాటితే చాలు ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రం 6 కావస్తున్న బయటకు వెళ్లలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. మండుతున్న ఎండల కారణంగా చాలా రకాల సమస్యలు, ప్రమాదాలు ఎదురవుతాయి, ముఖ్యంగా వడదెబ్బ, నీరసం, డీహైట్రేషన్, వంటి ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అయితే హీట్ వేవ్ కారణంగా కళ్లకు కూడా చాలా ప్రభావం ఉంటుంది. కళ్లు పొడి బారడం, చికాకు రావడం వంటివి జరుగుతాయి. దీంతో కళ్లు ఎర్రబడి మంటలు వస్తాయి. అంతేకాదు హీట్ వేవ్ అలెర్జీని పెంచుతుంది. అందువల్ల కళ్లను రక్షించుకోవడానికి చాలా రకాలు చిట్కాలు ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం.

- Advertisement -

హీట్ వేవ్ సమయంలో కళ్లను రక్షించుకోవడానికి 10 చిట్కాలు :

- Advertisement -

1. సన్ గ్లాసెస్ ధరించడం

ఎండలో బయటకు వెళ్లే సమయంలో సన్ గ్లాసెస్ ధరించడం వల్ల UV కిరణాల నుండి కళ్లను రక్షించుకోవచ్చు. కంటిశుక్లం, మచ్చల క్షీణత, ఇతర కంటికి సంబంధించిన వాటి నుంచి ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇందుకోసం 100% UVA, UVB కిరణాలను తాకకుండా ఉండే సన్ గ్లాసెస్ ఎంచుకోవాలి.

2. హైడ్రేటెడ్‌గా ఉండడం

ఎండాకాలంలో తగినంత తేమ అనేది కళ్ళను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. కళ్లు పొడి బారడం, చికాకును నివారిస్తుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు త్రాగడం వల్ల ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలుగుతుంది.

3. కంటి చుక్కలను ఉపయోగించాలి

కంటి చుక్కలు కళ్లను తేమగా ఉంచడంలో సహాయపడతాయి. వేడి, పొడి గాలి వల్ల కళ్లను పొడిబారకుండా చేస్తుంది. కళ్ళు పొడిగా లేదా చికాకుగా అనిపిస్తే లూబ్రికేటింగ్ కంటి చుక్కలను ఉపయోగించాలి.

4. టోపీ ధరించాలి

వెడల్పు అంచులు కలిగిన టోపీని ధరించడం వల్ల ముఖం మొత్తాన్ని సంరక్షిస్తుంది. అందులోను కళ్ళకు సూర్యకాంతి నేరుగా పడకుండా సహాయపడుతుంది. అందువల్ల బయట ఎక్కువ కాలం గడిపేటప్పుడు కనీసం 3-అంగుళాల అంచు ఉన్న టోపీని ధరించండి.

5. పీక్ సన్ అవర్స్ మానుకోండి

సూర్య కిరణాలు 10 AM, 4 PM మధ్య బలంగా ఉంటాయి. ఈ సమయంలో బయట తిరిగితే UV ఎక్స్పోజర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ గంటలలో ఎటువంటి బయట పనులు ఉన్నా పరిమితం చేయడం మంచిది.

6. UV-బ్లాకింగ్ కాంటాక్ట్ లెన్స్‌లను ఉపయోగించండి

UV-బ్లాకింగ్ కాంటాక్ట్ లెన్సులు ఉపయోగించడం వల్ల UV కిరణాల నుండి అదనపు రక్షణ పొరను అందిస్తాయి. UV-నిరోధించే కాంటాక్ట్ లెన్స్‌లను పొందడానికి కంటి నిపుణులను సంప్రదించండి.

7. కంటికి ఆరోగ్యకర ఆహారాలు తినండి

ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు C, E,జింక్ వంటి పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. ఇవి వేడి, UV ఎక్స్‌పోజర్ ద్వారా తీవ్రతరం అయ్యే కంటి పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కంటి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి తరచూ ఆహారంలో సాల్మన్, ఆకు కూరలు, సిట్రస్ పండ్లు, గింజలు వంటి ఆహారాలను చేర్చుకోండి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News