BigTV English

Hyper Aadi on Balakrishna: ఏపీలో ఎన్నికల తరువాత.. బాలయ్యపై హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు

Hyper Aadi on Balakrishna: ఏపీలో ఎన్నికల తరువాత.. బాలయ్యపై హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు

Hyper Aadi Speech in Gangs of Godavari Event: ‘జనరేషన్ మారితే మనుషులు మారుతారు.. టెక్నాలజీ మారుతుంది.. కానీ, బాలయ్య బాబు ఎనర్జీ మారదు. ఆయన గ్రాఫ్ పెరగడమే తప్ప తగ్గదు. సినిమాల్లో, ఓటీటీలో, రాజకీయాల్లో, సేవ చేయడంలో బాలయ్య బాబు అన్ స్టాపబుల్’ అని ప్రముఖ సినీ నటుడు హైపర్ ఆది అన్నారు. మే 31న ప్రేక్షకుల ముందుకు రానున్న’గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు.


ఈ కార్యక్రమానికి హీరో బాలయ్యతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. హైపర్ ఆది కూడా పాల్గొని మాట్లాడారు. నందమూరి నటసింహం (బాలకృష్ణ), కొణిదెల కొదమసింహం (పవన్ కల్యాణ్) కలిసి అసెంబ్లీలో అడుగుపెడితే ఎలా ఉంటుందో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా చూసినా కూడా అలానే ఉంటుందన్నారు.

‘ప్రపంచంలో ఎక్కడికెళ్లినా నేను తెలుగువాడిని అని గర్వంగా చెప్పుకుంటున్నామంటే దానికి కారణం సీనియర్ ఎన్టీఆర్. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఎలా ఉంటారో మాకు తెలియదు. కానీ, శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ ను భావించి ఆయన ఫొటోలను ఇంట్లో పెట్టాం. శ్రీరాముడిగా భావించి ఎన్టీఆర్ కు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. బొబ్బిలి పులి సినిమాలోని కోర్టు సన్నివేశం ఒక్కటి చూస్తే చాలు ఎన్టీఆర్ గాంభీర్యం ఏమిటో మనకు అర్థమవుతుంది. అటువంటి నటుడు, రాజకీయ నాయకుడు మళ్లీ పట్టరు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం నేను ఓ అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగుజాతి గౌరవాన్ని రామారావు కాపాడితే.. ఆయన గౌరవాన్ని బాలకృష్ణ నిలబెడుతూ వస్తున్నారు. బాలయ్య బాబు కొన్ని వేల మంది పేద ప్రజల బతుకులను నిలబెట్టారు.


Also Read: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘పుష్ప పుష్ప’.. 100 మిలియన్స్‌కు పైగా..

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతోమంది పేదవారికి సాయం చేశారు. బాలయ్యబాబుతో పనిచేసే ప్రతి ఒక్కరికీ భయం, బాధ్యత ఉంటుంది’ అని బాలయ్యను ఉద్దేశిస్తూ హైపర్ ఆది పేర్కొన్నారు. బాలయ్య రాకతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా కలెక్షన్ కూడా అన్ స్టాపబుల్ అవ్వాలని తాను కోరుకుంటున్నానని ఆది పేర్కొన్నారు.

విష్వక్ సేన్ గురించి మాట్లాడుతూ.. విష్వక్ సేన్ మంచి నటుడు.. అందుకే ఆయన సినిమాలకు నష్టాలు రావన్నారు. 24 క్రాప్ట్స్ పై పట్టున్న వ్యక్తి అని అన్నారు. మనందరికీ త్రివిక్రమ్ అంటే ఇష్టం.. కానీ, ఆయనకు మా దర్శకుడు కృష్ణ చైతన్య అంటే ఇష్టమన్నారు. ఈ సినిమాలో అంజలి, నేహాశెట్టి అద్భుతంగా నటించారన్నారు. నిర్మాతలను దృష్టిలో పెట్టుకుని సోషల్ మీడియాలో రివ్యూలు రాయాలంటూ విజ్ఞప్తి చేశారు. ఒక హీరోని అభిమానిస్తే మరో హీరోకు వ్యతిరేకమేమో అని భావించేవారికి ఓ మాట చెబుతున్నా.. తెలుగు సినిమాలన్నా.. తెలుగు హీరోలన్నా తమకు పిచ్చి అంటూ ఆది పేర్కొన్నారు.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×