E-Paper
Advertisement

జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయవచ్చా? వైద్యులు చెప్పిన సరైన విధానం ఇదే

జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయవచ్చా? వైద్యులు చెప్పిన సరైన విధానం ఇదే
Advertisement

జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయకూడదని చాలామంది అనుకుంటారు. మరికొందరు చల్లని నీళ్లతో స్నానం చేస్తే జ్వరం వెంటనే తగ్గిపోతుందని అనుకుంటారు. అయితే జనరల్ మెడిసిన్ సీనియర్ వైద్యులు డాక్టర్ సంజయ్ రైనా ప్రకారం.. ఈ రెండు అభిప్రాయాలు పూర్తిగా నిజం కావు. సాధారణంగా జ్వరం ఉన్నప్పుడు గోరువెచ్చని నీటితో కొద్దిసేపు స్నానం చేయడం సురక్షితమే. ఇలా చేయడం వల్ల శరీరంపై ఉన్న చెమట తొలగి, శరీరం శుభ్రంగా ఉండటంతో పాటు కొంత ఉపశమనం కూడా లభిస్తుంది.

గోరువెచ్చని నీటితో స్నానం ఎందుకు మంచిది?

గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరం సహజంగా ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి సహాయపడుతుంది. ఇది జ్వరాన్ని నేరుగా తగ్గించదు కానీ అసౌకర్యాన్ని తగ్గించి కొంత సౌకర్యంగా అనిపించేలా చేస్తుంది. అందువల్ల జ్వరం ఉన్నప్పుడు ఎక్కువసేపు కాకుండా తక్కువ సమయంలోనే గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

చల్లటి నీటితో స్నానం ఎందుకు చేయకూడదు?

Advertisement

జ్వరం వచ్చినప్పుడు చల్లటి నీటితో స్నానం చేస్తే శరీరంలో వణుకు వస్తుంది. వణుకు కారణంగా కండరాలు మరింత వేడిని ఉత్పత్తి చేస్తాయి. దీంతో శరీరం లోపల ఉష్ణోగ్రత తగ్గకుండా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే చలి ఎక్కువగా అనిపించి అసౌకర్యం కూడా పెరుగుతుంది.

వేడి నీటితో స్నానం చేస్తే వచ్చే సమస్యలు

వేడి నీటితో స్నానం చేయడం కూడా మంచిది కాదు. దీనివల్ల ఎక్కువ చెమట పట్టి శరీరంలో నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కొందరికి తల తిరగడం, బలహీనత పెరగడం వంటి సమస్యలు రావచ్చు. అందుకే జ్వరం వచ్చినప్పుడు స్నానానికి గోరువెచ్చని నీళ్లు మాత్రమే ఉపయోగించడం ఉత్తమం.

జ్వరం అంటే ఏమిటి?

Advertisement

జ్వరం అనేది ఒక వ్యాధి కాదు. శరీరంలో ఇన్‌ఫెక్షన్ లేదా ఇతర సమస్యలతో పోరాడుతున్నప్పుడు కనిపించే లక్షణం మాత్రమే. కాబట్టి జ్వరాన్ని మాత్రమే తగ్గించే ప్రయత్నం కాకుండా, దానికి కారణమైన వ్యాధికి సరైన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువ నీరు తాగడం, విశ్రాంతి తీసుకోవడం, తేలికైన ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. వైద్యుల సూచన మేరకే మందులు తీసుకోవాలి.

ఎప్పుడు స్నానం చేయకూడదు?

అత్యంత బలహీనంగా ఉన్నప్పుడు, తల తిరుగుతున్నప్పుడు, నిలబడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు లేదా ఎక్కువ మత్తుగా ఉన్నప్పుడు స్నానం చేయకూడదు. జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు ముందుగా వైద్యుడిని సంప్రదించడం అవసరం.

Also Read: అస్తమా ఉన్నవారు వర్షాకాలంలో వీటికి దూరంగా ఉండాలి.. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం

ఎప్పుడు డాక్టర్‌కు చూపించాలి?

జ్వరం మూడు రోజులకంటే ఎక్కువ కొనసాగితే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన తలనొప్పి, మెడ బిగుసుకుపోవడం, పదేపదే వాంతులు, అయోమయం, మూర్ఛ లేదా అధిక నిద్రమత్తు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ప్రారంభంలోనే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

Related News

నచ్చిన ఆహారం తింటూ.. కిలో బరువు తగ్గాలంటే.. రోజుకు ఎన్ని అడుగులు నడవాలి?

గుంటూరు స్పెషల్ కోవా పూరీ..ఇంట్లోనే ఇలా చేస్తే స్వీట్ షాప్ టేస్ట్!

వంకాయ నువ్వుల రోటి పచ్చడి..ఈ స్టైల్‌లో చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ!

పర్ఫెక్ట్ రాయలసీమ స్టైల్ ఉగ్గాని..ఒక్కసారి తింటే వదిలిపెట్టరు!

రొమ్ము క్యాన్సర్ ఈ దశకు చేరితే ఏం జరుగుతుంది? ప్రతి మహిళ తెలుసుకోవాల్సిందే!

నోటికి కారంగా, సూపర్ టేస్టీగా ఆలూ పచ్చి కారం ఫ్రై!

నెల రోజులపాటు నిల్వ ఉండే రవ్వ లడ్డు..క్షణాల్లోనే చేయండిలా!

సేమియా ఉప్మా బోర్ కొట్టిందా? ఇలా ఎగ్ సేమియా ట్రై చేయండి!

Big Stories

Advertisement
×