E-Paper
Advertisement

వ‌రేసుకుంటే క‌ష్ట‌మే! ఆరుత‌డే వేసుకోమ‌న్నాం.. కానీ బీఆరెస్ రైతుల‌ను రెచ్చ‌గొట్టింది.. !

వ‌రేసుకుంటే క‌ష్ట‌మే! ఆరుత‌డే వేసుకోమ‌న్నాం.. కానీ బీఆరెస్ రైతుల‌ను రెచ్చ‌గొట్టింది.. !
Advertisement

ఎల్‌నినో ఎఫెక్ట్ … కాళేశ్వ‌రం లేని లోటు.. ! రైతాంగానికి ఏ విధంగా న‌ష్టం చేస్తుందో చెప్పేందుకు బీఆరెస్ విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ రాజ‌కీయ ఎపిసోడ్‌లో కాంగ్రెస్‌ను విల‌న్‌గా నిలిపేందుకు అన్ని వ‌న‌రులు వాడుకుంటున్న‌ది. కానీ కాంగ్రెస్ స‌ర్కార్ మాత్రం ఏది ప‌ట్టించుకునే ప‌రిస్థితిలో లేదు.

బీఆరెస్‌కు స‌డ‌న్‌గా క‌న్నెప‌ల్లి పంప్‌హౌజ్ ఎందుకు గుర్తొచ్చిందో తెలుసా? ఈ ఎల్‌నినో క‌రువు ఛాయ‌ల వ‌ల్లే. అవును.. ఇదే మంచి సంద‌ర్బ‌మ‌ని త‌ల‌చే…కాళేశ్వ‌రం అవ‌స‌రం ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎంత‌లా అవ‌స‌ర‌మ‌నే విష‌యాన్ని చెప్పేందుకు దీన్ని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారే త‌ప్ప‌.. నిజంగా వారికి రైతులపై ప్రేమ ఉండి కాదు.

Advertisement

ఎందుకంటే.. ఎల్‌నినో ప్ర‌భావం ఉంద‌ని తెలిసిన ఈ నేత‌లు విచ్చ‌ల‌విడిగా వ‌రి వేసుకోండ‌ని ముందే ఎందుకు ఊద‌ర‌గొడ‌తారు. స‌ర్కార్ ఓ ఏడు ర‌కాల వ‌రి వంగ‌డాల‌నే వేసుకోండ‌ని, అవే మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నాయ‌ని చెబుతూ వ‌స్తుంటే.. ఇదే అదునుగా భావించి… ఎందుకు వ‌రి విస్తీర్ణం త‌గ్గించాలి..? ఎందుకు ఏడు ర‌కాల వ‌రి వంగ‌డాలే వాడుకోవాలి..? వరిని పెంచండి.. ఇష్ట‌మున్న‌ట్టు వేసుకోండ‌ని ప్రెస్‌మీట్లు పెట్టి మ‌రీ ఊద‌ర‌గొట్టారు.

ఇప్పుడు మ‌ళ్లీ ఎల్‌నినోను ఇలా కాళేశ్వ‌రానికి లింకు పెట్టి మాట్లాడుతున్నారు. కానీ బీఆరెస్ రాజ‌కీయ వ్యూహాన్ని రేవంత్ గ‌మ‌నించాడు. అందుకే ఇవాళ క్లారిటీగా చెప్పాడు. మేం క‌రువు ప‌రిస్థితులు అంచ‌నా వేయ‌లేక కాదు. ముందు జాగ్ర‌త్త‌గా మా ప్ర‌ణాళిక‌ల్లో మేమున్నాం.. ఆరుతడి పంట‌లే వేయ‌మ‌ని చెప్పాం. కానీ బీఆరెస్ రైతుల‌ను రెచ్చగొట్టింది. రైతులు న‌ష్ట‌పోయినా ప‌ర్వాలేదు వారికి రాజ‌కీయ మైలేజీ రావాలె..! ఇదే వారి ఉద్దేశ్యం. రాజ‌కీయ ప్ర‌యోజ‌నం.. అని కాంగ్రెస్ విడ‌మ‌ర్చి చెబుతూ వ‌స్తోంది.

Advertisement

అంటే.. ఒక్క విష‌యంలో మాత్రం క్లారిటీ వ‌చ్చింది. వ‌రి విస్తీర్ణం త‌గ్గడం లేదు. స‌ర్కార్ సూచించిన‌ట్టుగా ఆరుత‌డి పంట‌ల‌కు రైతులు పోలేదు. అంటే క‌రువు పరిస్థితుల నేప‌థ్యంలో పంటలు ఎండుడు ఖాయం. స‌ర్కార్ బ‌ద్నాం అవుతుందా? ఇది బీఆరెస్ త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుని రాజ‌కీయాలు చేస్తుందా? అనే విష‌యాలు ప‌క్క‌న బెడితే.. రైతులు మాత్రం ఈ వానాకాలం సీజ‌న్‌లో భారీగా న‌ష్ట‌పోతున్నార‌నే విష‌యం మాత్రం క్లారిటీ.

Related News

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

పుష్కరకాలంలో యువత యూటర్న్‌..! మోడీ అప్పుడు కొత్త ఓటర్ల పాలిట హీరో..! అందుకే నెత్తినెత్తుకున్నారు.. ఇప్పుడెందుకు వైఖరి మారింది? సీఎస్‌డీఎస్‌ ఆసక్తికర విశ్లేషణ..!

ఉద్యమాల ఆయువుపట్టు మీద పాలకుడి దాడి! ప్రశ్నించే గొంతులకు వేదిక లేకుండా చేసే కుయుక్తులు..! ధర్నాచౌక్‌లకు తాళాలేయడం.. రోగానికి మందు కాదు..!

హస్తిన పోరులో తెలంగాణ కీ రోల్‌! రేవంత్‌పై భారీ నమ్మకం పెట్టుకున్న ఏఐసీసీ! ఢిల్లీ పోరులో టీ కాంగ్రెస్‌ హవా!

తమిళనాడు టూర్‌లో మోడీ, విజయ్‌ల ఎడముఖం పెడముఖం! పరువు పోకుండా మోడీ తండ్లాట..! మౌనంగా ఉంటూ ఇమేజీని డ్యామేజీ చేసేలా విజయ్‌..!

Big Stories

Advertisement
×