E-Paper
Advertisement

మా నాన్న హీరో.. ఈ పేరు గల వారు తండ్రి మాటని జవదాటరు

మా నాన్న హీరో.. ఈ పేరు గల వారు తండ్రి మాటని జవదాటరు
Advertisement

పేరు అనేది ఒక వ్యక్తిని గుర్తించే సాధనం మాత్రమే కాదు. నేమ్ ఆస్ట్రాలజీ (నామ జ్యోతిష్యం) ప్రకారం.. పేరు మొదటి అక్షరం వ్యక్తి స్వభావం, ఆలోచనా విధానం, కుటుంబ బంధాల గురించి కూడా కొన్ని సూచనలు చేస్తుంది. ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేక గ్రహ ప్రభావం ఉంటుందని, అది వ్యక్తి ప్రవర్తనపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్రంలో చెబుతారు.

భారతీయ సంస్కృతిలో తండ్రి స్థానం

భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులకు అత్యంత గౌరవం ఇస్తారు. ముఖ్యంగా తండ్రిని కుటుంబానికి మార్గదర్శిగా భావిస్తారు. పిల్లలకు క్రమశిక్షణ, జీవిత విలువలు, బాధ్యతలను నేర్పడంలో తండ్రి కీలక పాత్ర పోషిస్తాడు. చాలా మంది తమ జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో తండ్రి సలహాను ఎంతో విలువైనది.
నామ జ్యోతిష్యం ప్రకారం.. కొన్ని పేరు మొదటి అక్షరాలు ఉన్నవారు తండ్రితో ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉంటారు.

K అంటే క అక్షరంతో ప్రారంభమయ్యే పేరు గలవారు

Advertisement

‘K’ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని నమ్మకం. కుటుంబ సంప్రదాయాలు, విలువలను ఎంతో గౌరవిస్తారు. తండ్రి నేర్పిన పాఠాలను ఎప్పటికీ మరచిపోరు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా తండ్రి నమ్మకాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తారు. తండ్రి సూచనలను జీవితంలో ముఖ్యమైన మార్గదర్శకంగా భావిస్తారు.

A అంటే అ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు గలవారు

‘A’ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారిపై సూర్యుడు, కుజుడు ప్రభావం ఉంటుందని నమ్మకం. వీరు క్రమశిక్షణతో జీవించడానికి ఇష్టపడతారు. జీవితంలో తండ్రికి అత్యున్నత స్థానం ఇస్తారు. తండ్రి గౌరవానికి భంగం కలిగించే పనులు చేయకుండా జాగ్రత్తపడతారు. తండ్రి చెప్పిన విలువలను జీవితాంతం పాటించేందుకు ప్రయత్నిస్తారు.

P లేదా ప అక్షరంతో ప్రారంభమయ్యే పేరు గల వారు

Advertisement

‘P’ అక్షరంతో పేరు మొదలయ్యే వారిపై గురు, బుధ గ్రహాల ప్రభావం ఉంటుందని చెబుతారు. వీరు తమ భావాలను ఎక్కువగా బయటపెట్టకపోయినా, తండ్రిపై లోతైన ప్రేమను కలిగి ఉంటారు. తండ్రి కోరికలను తమ కోరికల కంటే ముఖ్యంగా భావిస్తారు. తండ్రి చెప్పిన మాటను గౌరవించి, అవసరమైతే తమ కోరికలను కూడా పక్కన పెడతారు.

R అంటే ర అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారు

‘R’ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారు బయటకు స్వతంత్రంగా కనిపించినా, కుటుంబానికి ఎంతో దగ్గరగా ఉంటారు. జీవితంలోని ముఖ్యమైన నిర్ణయాల సమయంలో తండ్రి అభిప్రాయాన్ని తప్పకుండా తెలుసుకోవాలని భావిస్తారు. తండ్రి గౌరవాన్ని కాపాడేందుకు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యం వీరిలో ఉంటుంది.

Also Read: ట్రూ లవర్.. ఈ తేదీలో పుట్టినవారు జీవితాంతం తోడుగా ఉంటారు

నామ జ్యోతిష్యం ప్రకారం.. A, P, K, R అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారు తమ తండ్రిని ఎంతో గౌరవిస్తారు. తండ్రి సలహాను పాటించడం, ఆయన నమ్మకాన్ని నిలబెట్టడం, కుటుంబ విలువలను కాపాడడం వీరి ముఖ్య లక్షణాలు. అయితే ఇవన్నీ సంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా చెప్పబడిన అభిప్రాయాలు మాత్రమే. ప్రతి వ్యక్తి అనుభవం భిన్నంగా ఉండవచ్చు.

Related News

నిద్రలో కాలి కండరాలు పట్టేయడానికి కారణమేంటి? ఎప్పుడు ప్రమాదకరమంటే..

నాన్ స్టాప్ డాండియా డాన్స్ చేసినా చెదరని మేకప్.. రాత్రంతా ఫ్రెష్ లుక్ కోసం టిప్స్

సన్‌స్క్రీన్ వాడుతున్నా చర్మం నల్లబడుతోందా? మీరు చేస్తున్న తప్పులు ఇవే

10 నిమిషాలు లేదా 20 నిమిషాలు? ఎంతసేపు స్నానం చేస్తే చర్మ ఆరోగ్యానికి మంచిది?

విస్కీ ఎలా తాగితే రుచికరంగా ఉంటుంది? నీట్‌గా, ఐస్‌తోనా లేదా వాటర్‌తోనా

తొలిసారి డాండియా డాన్స్ చేయబోతున్నారా? గర్బా నైట్‌లో ఈ జాగ్రత్తలు పాటించాలి

లగ్జరీ డేట్‌కు వెళ్లిన యువతి.. ప్రపోజల్ తిరస్కరించగానే ఆమెకు గట్టిగా షాకిచ్చిన యువకుడు

ఉదయం పూట మీ కీళ్లు బిగుసుకుపోతున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్..?

Big Stories

Advertisement
×