E-Paper
Advertisement

అంబులెన్స్‌ పదానికి అసలు అర్థం ఇదే, అలా పుట్టి.. ఇలా వాడుకలోకి వచ్చింది!

అంబులెన్స్‌ పదానికి అసలు అర్థం ఇదే, అలా పుట్టి.. ఇలా వాడుకలోకి వచ్చింది!
Advertisement

అంబులెన్స్ (Ambulance).. ఇది వినగానే మనకు గుర్తుకొచ్చేది హెల్త్ ఎమర్జెన్సీ వెహికిల్. డిక్షనెరీలో వెతికినా.. దీనికి ఇదే అర్థం ఉంటుంది. కానీ, అంబులెన్స్ అనే పదం ఎప్పుడు ఎలా వాడుకలోకి వచ్చిందనే సంగతి ఎవరికీ తెలీదు. కానీ, ఆపదలో ఉన్న ప్రాణాలను కాపాడంలో అంబెలెన్స్ పాత్ర వెలకట్టలేనిది. ప్రమాదాల నుంచి అత్యవసర అనారోగ్యాల వరకు.. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా క్షణాల్లో వాలిపోయి.. ప్రాణాలు కాపాడే ఈ వాహనానికి ఆ పేరే కరెక్ట్. అదెందుకో తెలియాలంటే.. మీరు ముందు మీరు అంబులెన్స్ చరిత్ర తెలుసుకోవాలి.

అంబులెన్స్ అంటే?

అంబులెన్స్ అంటే ఏమిటనేది ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే, అది కేవలం రోగులను లేదా క్షతగాత్రులను వేగంగా ఆసుపత్రికి తీసుకెళ్లే వాహనమే కాదు. నడిచే వైద్యాలయం. ఇందులో బాధితుడికి అత్యవసర లేదా ప్రాథమిక చికిత్స అందించే వైద్య పరికరాలు ఉంటాయి. శిక్షణ పొందిన పారామెడికల్ సిబ్బంది సైతం ఉంటారు. ఆసపత్రికి చేరే వరకు బాధితుడికి ఎలాంటి ప్రాణ హానీ లేకుండా చూసుకుంటారు. అయితే, మనం ఇప్పడు పిలుస్తున్న ‘అంబులెన్స్’ పదం.. ఇంగ్లీష్ నుంచి పుట్టింది కాదు. అది లాటిన్ పదం.

అంబులెన్స్ అసలు అర్థం ఇదే

Advertisement

అంబులెన్స్ అనేది లాటిన్ పదం Ambulare నుంచి పుట్టింది. అంబులేర్ అంటే నడవడం లేదా కదలడం అని అర్థం. దీన్ని ఫ్రెంచ్ భాషలో Hopital ambulant అంటారు. అంటే.. కదిలే ఆసుపత్రి అని అర్థం. యుద్ధ క్షేత్రాల్లో గాయపడిన సైనికులను తరలించడం కోసం ఉపయోగించే అత్యవసర.. కదిలే వైద్య శిబిరాలను అలా పిలిచేవారు. కాలక్రమేనా అది ‘అంబులెన్స్’గా మారింది.

ఇదే అంబులెన్స్ చరిత్ర..

ప్రాచీన కాలంలో గాయపడిన వ్యక్తులను గుర్రలు, గుర్రబండ్లు, డోలీల సహాయంతో ఆస్పత్రులకు తరలించేవారు. 15వ శతాబ్దంలో స్పానిష్ సైన్యం.. యుద్ధంలో గాయపడిన సైనికులను రక్షించడానికి మొదటిసారిగా ప్రత్యేక బండ్లను ఉపయోగించడం మొదలుపెట్టారు. 19వ శతాబ్దంలో నెపోలియన్ బోనపార్టే కాలంలో ప్రముఖ సర్జన్ డొమినిక్ జీన్ లారీ.. అధికారికంగా గుర్రపు బండ్లతో ‘ఫ్లయింగ్ అంబులెన్స్’ వ్యవస్థను ప్రవేశపెట్టారు. వీటిని ఎక్కువగా యుద్ధ భూమిలో గాయపడిన సైనికులను తరలించేందుకు ఉపయోగించేవారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మోటారు వాహనాలను అంబులెన్సులుగా మార్చారు. కాలక్రమేనా.. వైద్య పరికరాలతో కూడిన అంబులెన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

అంబులెన్సులన్నీ ఒక్కటి కాదు

Advertisement

అంబులెన్సుల్లో చాలా రకాలు ఉన్నాయంటే మీరు ఆశ్చర్యపోతారు. సమస్య తీవ్రతను బట్టి.. వివిధ రకాల అంబులెన్సులను ఉపయోగిస్తారు. వీటిలో మొదటిది బేసిక్ లైఫ్ సపోర్ట్ (BLS) అంబులెన్స్. ఇందులో ప్రాథమిక చికిత్స కిట్లు, ఆక్సిజన్ సిలిండర్లు, స్ట్రెచర్ ఉంటాయి. సాధారణ రోగుల తరలింపుకు దీన్ని వాడతారు. అత్యవసర కేసుల కోసం అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ (ALS) అంబులెన్సులను వాడతారు. ఇది నడిచే ICU లాంటిది. ఇందులో వెంటిలేటర్, డిఫిబ్రిలేటర్, బీపీ మానిట్లు, అత్యవసర మందులు ఉంటాయి. ఇక ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, సుదూర ప్రాంతాల్లోని హాస్పిటల్స్‌కు బాధితులను తరలించడానికి ఎయిర్ అంబులెన్సులు వాడతారు.

అంబులెన్స్ వాహనాలపై.. పదాలెందుకు తిరగేసి రాసి ఉంటాయి?

అంబులెన్స్‌ వాహనాలను చూసినప్పుడు మీకు ఈ డౌట్ వచ్చే ఉంటుంది. దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉంది. మన ముందు వెళ్తున్న వాహనాల అద్దాల్లో వెనుక వచ్చే వాహనాల వ్యతిరేకంగా కనిపిస్తాయి. కుడిది ఎడమగా, ఎడమది కుడిగా కనిపిస్తుంది. అంబులెన్స్ పేరును రివర్స్‌లో రాయడం వల్ల వారికి AMBULANCE అని చదవడం సులభం అవుతుంది. దీనివల్ల వాహనదారుడు అప్రమత్తమై వెంటనే దారి ఇస్తాడు.

Also Read: మొబైల్ ఫోన్ కనిపెట్టిన వ్యక్తి.. ఫస్ట్ కాల్ ఎవరికి చేశాడో తెలుసా? ఆ ఆసక్తికరమైన కథ ఇదే!

Related News

చిరిగిన బట్టలు ధరించకూడదు ఎందుకు? ఇప్పుడు అదే ట్రెండ్, దానివల్ల నష్టాలెన్నో తెలుసా?

నేను చనిపోయి ఐదేళ్లయింది.. కానీ ఇంకా బ్రతికే ఉన్నాను! ఒక అంతుచిక్కని మైండ్-బెండింగ్ మిస్టరీ

మిమ్మల్ని మానసికంగా వేధించే టాక్సిక్ వ్యక్తులను ఇలా కంట్రోల్ చేయండి.. ఈ 6 రకాల టిప్స్ మీ కోసమే

మా నాన్న హీరో.. ఈ పేరు గల వారు తండ్రి మాటని జవదాటరు

అస్తమా ఉన్నవారు వర్షాకాలంలో వీటికి దూరంగా ఉండాలి.. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం

డబ్బు, సుఖం, విలాసాలు.. ఈ పేరుగల వ్యక్తులు ధనవంతులు కావడానికి ఏమైనా చేస్తారు

ఈ 6 సంకేతాలు కనిపిస్తే మీ బాయ్‌ఫ్రెండ్ ఇక మిమ్మల్ని ప్రేమించడం లేదనే.. జాగ్రత్త సుమా

Big Stories

Advertisement
×