E-Paper
Advertisement

లెజెండ్రీ సింగర్ జానకమ్మ చివరి వీడియో ఇదే!

లెజెండ్రీ సింగర్ జానకమ్మ చివరి వీడియో ఇదే!
Advertisement

S.Janaki:వయోభారంతో వచ్చే అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్న లెజెండ్రీ సింగర్ జానకి మైసూర్ లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శనివారం రోజు మైసూర్ లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ గుండెపోటుతో మరణించారు. లెజెండ్రీ సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న జానకమ్మ.. ఇక లేరు అనే విషయాన్ని అటు సెలబ్రిటీలు, ఇటు అభిమానులు, సంగీత శ్రోతులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి ఆమె 2016లోనే రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. ఆమె పాటలు వినపడుతున్నంత కాలం మన మనసుల్లో ఆమె ఎప్పటికీ సజీవంగానే ఉంటారు.

జానకమ్మ చివరి వీడియో..

ఇకపోతే జానకమ్మ మరణించడంతో ఆమెకు సంబంధించిన చివరి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఏడాది మార్చి చివరి వారంలో ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత చెన్నైలోని జానకమ్మ ఇంటికి వెళ్లారు. ఆమె పాదాల దగ్గర కూర్చొని పాటలు పాడగా.. జానకి ఎంతో ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అంతేకాదు సంతోషంగా సునీతను ఎంకరేజ్ కూడా చేశారు. అయితే ఇంతలోనే ఆమె తుది శ్వాస విడవడం సంగీత ప్రేమికులను శోకసంద్రంలో ముంచేసింది. ఏది ఏమైనా మొన్ననే కదా జానకమ్మ అంత సంతోషంగా కనిపించారు. అంతలోనే ఇంత విషాదమా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక జానకమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నారు.

17 భాషలలో 48 వేలకు పైగా పాటలు..

Advertisement

దక్షిణాది సినీ ప్రస్థానంలో చెరగని ముద్ర వేసుకున్న ఈమె.. 17 భాషలలో 48 వేలకు పైగా పాటలు పాడి రికార్డు సృష్టించింది. ఎస్ జానకి బాలసుబ్రమణ్యం, ఇళయరాజాలతో ఆమె కాంబినేషన్ ఎన్నో ఆల్ టైం హిట్ లను అందుకుంది. ముఖ్యంగా తన అద్భుతమైన గాత్రంతో 31 రాష్ట్రస్థాయి పురస్కారాలు, నాలుగు జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు జానకమ్మ. 1957లో ఒక తమిళ చిత్రం ద్వారా గాయనిగా వెండితెరకు పరిచయమైన ఈమె.. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. సుమారుగా 60 ఏళ్లకు పైగా సాగిన ఆమె సంగీత ప్రస్థానంలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ తో పాటు సుమారు 17 భాషలలో 48 వేలకు పైగా పాటలను ఆలపించి రికార్డు సృష్టించారు. భాష ఏదైనా భావాన్ని పలికించడంలో ఆమె తర్వాతే ఎవరైనా.. చిన్న పిల్లల గొంతు దగ్గర నుండి వృద్ధుల గొంతు వరకు ఎలాంటి శబ్దాలనైనా సరే చాలా అలవోకగా పలికించగల అద్భుత స్వర విన్యాసం ఆమె సొంతం ..అలాంటి ఒక గొప్ప గాయని నేడు మన మధ్య లేకపోవడం బాధాకరం అనే చెప్పాలి.

కొడుకు మరణించిన 6 నెలలకే..

సంగీత ప్రపంచంలో ఎన్నో శిఖరాలను అధిరోహించిన జానకి వ్యక్తిగతంగా మాత్రం తీవ్ర విషాదాలు ఎదుర్కొంది. 1997లో ఈమె భర్త వి.రామ ప్రసాద్ గుండెపోటుతో మరణించగా.. ఈ ఏడాది జనవరిలో ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ కూడా గుండెపోటుతో కన్నుమూశారు. కొడుకు మరణించిన ఆరు నెలలకే జానకి కూడా అదే గుండెపోటుతో కన్నుమూయడంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఇక ఆమె మన మధ్య లేకపోయినా ఆమె పాడిన వేలాది పాట రూపంలో జానకి గారి స్వరం ప్రతి ఒక్కరి గుండెల్లో మారుమ్రోగుతూనే ఉంటుంది.

Advertisement

 

also read:లెజెండ్రీ సింగర్ ఎస్.జానకి మృతి.. సెలబ్రిటీలు సంతాపం!

Related News

లెజెండ్రీ సింగర్ ఎస్.జానకి మృతి.. సెలబ్రిటీలు సంతాపం!

కొత్త కారు కొన్న నటి హేమ.. ధర ఎంతంటే?

దయనీయస్థితిలో పావలా శ్యామల.. గుర్తుపట్టలేని విధంగా!

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ గాయని ఎస్. జానకి కన్నుమూత!

తెలుగు తెరపై తొలి CGI మాయాజాలం ఏ సినిమాతో మొదలైందో తెలుసా?

సిగరెట్‌తో కాల్చాడు.. చెంప పగిలేలా కొట్టాడు’.. మాజీ ప్రియుడిపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

అఖిల్ ‘లెనిన్’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. థియేటర్లలో కలెక్షన్లు తగ్గితే అప్పుడే, లేదంటే..?

Big Stories

Advertisement
×